Breaking News

జంక్‌ ఫుడ్‌ మానేసి.. వ్యాయామం చేయండి..

Published on Mon, 09/29/2025 - 10:01

జంక్‌ ఫుడ్‌ మానేయడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని అర్జున అవార్డు గ్రహీత, పద్మభూషణ్, పద్మశ్రీ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా కార్డియలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కేబీఆర్‌ పార్కు వద్ద ఆదివారం వాకథాన్‌ నిర్వహించారు. 

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గోపీచంద్‌ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ నడకకు సమయం కేటాయించాలని సూచించారు. శరీరానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, అవసరం లేని ఆహారం ఆరోగ్యానికి చేటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గోకల్‌రెడ్డి, రామకృష్ణ జనపాటి, సందీప్‌ పాల్గొన్నారు.  

రెయిన్‌ బో ఆస్పత్రిలో.. 
బంజారాహిల్స్‌ రెయిన్‌ బో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్‌ హార్ట్‌ క్లినిక్‌ను పుల్లెల గోపీచంద్‌ ఆదివారం ప్రారంభించారు. ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తామని ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ దినేష్‌ చిర్ల తెలిపారు. అత్యాధునిక ప్రమాణాలతో, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సెంటర్‌ కొనసాగుతుందని వారు తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అప్పుడే శరీరంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుందని గోపీచంద్‌ అన్నారు. జాతీయ ఉత్తమ బాల పురస్కార గ్రహీత సుకృతి వేణి బండ్రెడ్డి పాల్గొన్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)