Breaking News

అప్‌స్టాక్‌ సీఈవో వెయిట్‌ లాస్‌ జర్నీ: పదివేల అడుగులతో పది కిలోల బరువు..!

Published on Wed, 01/29/2025 - 17:41

బరువు తగ్గేందుకు ఏదో ఒక రీజన్‌ ఉంటుంది. కొందరికి ఎదుర్కొన్న బాడీ షేమింగ్‌ అవమానాలు, అనారోగ్యాలు తదితర కారణాలతో బరువు తగ్గడం జరుగుతుంది. మరికొందరూ సెలబ్రిటీలు, ప్రముఖులు స్ఫూర్తితో బరువు తగ్గించుకునే యత్నం చేస్తుంటారు. అయితే ఈ అప్‌స్టాక్‌(Upstox) సీఈవో వెయిట్‌ లాస్‌ జర్నీ మాత్రం కాస్త విభిన్నం. ఎందుకంటే తండ్రి అవ్వాలన్నా ఆలోచనే..  ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేసి, ఇలా స్మార్ట్‌గా మారేందుకు కారణమైంది అని అంటారాయన. మరీ ఆయన ఎలాంటి డైట్‌, వర్కౌట్లు ఫాలో అయ్యారో చూద్దామా..!.

అప్‌స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు(UpStox Co-founder) శ్రీని విశ్వనాథ్‌(Shrini Viswanath,) తాను తండ్రి అవ్వాలనే కోరిక తన ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై దృష్టిసారించేలా చేసిందట. ఆ కొత్త బాధ్యతను తీసుకునేటప్పడు తాను మరింత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటేమ కాకుండా తన బిడ్డకు గ్రేట్‌గా కనిపించాలనే పిచ్చి కోరిక వల్లే కిలోలు కొద్దీ బరువు తగ్గానంటారు. ప్రస్తుతం తన భార్య ప్రెగ్నెంట్‌ అని ఆమె కూడా తన ఈ వెయిట్‌ లాస్‌(weight loss) జర్నీలో ఎంతో తోడ్పాటును అందించిందని అన్నారు. 

ఆయన 68 కిలోలు బరువు ఉండేవారట. ఈ వెయిట్‌ లాస్‌ జర్నీకి కీలకమైంది అంకితభావం అని అంటారు విశ్వనాథ్‌. సరైన డైట్‌, వ్యాయమం క్రమంతప్పకుండా చేస్తే కచ్చితం వందరోజుల్లో పది కిలోలు బరువు తగ్గిపోతారంటున్నారు. ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, బయటి ఫుడ్‌ఆర్డర్‌ పెట్టుకోవడం తగ్గిస్తే బరువు అదుపులోనే ఉంటుందట. అలాగే షుగర్‌కి సంబంధించిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. వాటికి బదులు యాపిల్స్‌, బేరి, పీచెస్‌, డ్రైప్రూట్స్‌ వంటి తీసుకునేవాడినన్నారు. 

విశ్వనాథ్‌ ఇష్టమైన కర్రీలను తీసుకున్నాను కానీ వాటిలో వెన్న లేదా నెయ్యి లేకుండా చూసుకున్నానని అన్నారు. భారతీయ ఆహరం సుగంధద్రవ్యాలతో అత్యంత రుచికరంగా ఉంటుంది. ఆ రుచిని ఆరోగ్యప్రదంగా తీసుకుంటే చాలు అని చెబుతున్నారు విశ్వనాథ్‌. అలాగే తన బరువు గణనీయంగా తగ్గడానికి బాగా ఉపయోగపడింది ఎనమిది వేల నుంచి పది వేల అడుగుల వాకింగ్‌ అని చెప్పారు. 

చాలామంది మాత్రం బరువు తగ్గడానికి విపరీతమైన వ్యాయామాలు, గంటలు కొద్ది జిమ్‌లో గడిపితే చాలనుకుంటారు. కానీ అది సరైంది కాదట. ఆహారపు అలవాట్లలో మంచి స్థిరమైన మార్పులే గణనీయంగా బరువు తగ్గేందుకు తోడ్పడతాయట.

వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌, ఫిట్‌నెస్‌..
జీవితం అనేది వ్యక్తిగత శ్రేయస్సు. దీన్ని వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే బ్యాలెన్సు చేయాలి.  వ్యాపారం లేదా ఉద్యోగం, కుటుంబం, ఫిట్‌నెస్ - ఇలా ప్రతిదానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. కానీ ఏ పనిపై ఉంటే దానిపై మొత్తం దృష్టిని కేంద్రీకరించాలి. 

ప్రస్తుతం డెస్క్‌ఉద్యోగాల వల్ల గంటలకొద్దీ కూర్చోవడం ఎక్కువైపుతోంది. అందువల్లే ఆరోగ్య సమస్యలు, అధిక బరువు వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. చిన్న సర్దుబాటుతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని అంటున్నారు విశ్వనాథ్‌. 

(చదవండి: అంతరిక్షంలోనే ఏడు నెలలు..నడక మర్చిపోయా..!)
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)