Breaking News

చీకట్లో ఉరిమిన చిరు స్వరం

Published on Sat, 08/17/2024 - 11:49

ఒక్క పిలుపు ఇవ్వగానే వేలాదిమంది మహిళలు అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆమె ప్రఖ్యాత ఉద్యమ నాయకురాలు, రాజకీయ నాయకురాలు కాదు. సాధారణ మహిళ. కోల్‌కత్తాలోని జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై 29 ఏళ్ల రిమ్‌జిమ్‌ సిన్హా ఫేస్‌బుక్‌ పోస్ట్‌ వైరల్‌ కావడమే కాదు అర్ధరాత్రి వేళలో ఉద్యమ స్వరమై ప్రతిధ్వనించింది...

కోల్‌కత్తా, ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌తో పాటు ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది మహిళలు ఆగస్ట్‌ 14 అర్ధరాత్రి  వీధుల్లోకి వచ్చారు. ‘రీక్లెయిమ్‌ ది నైట్‌: ది నైట్‌ ఈజ్‌ అవర్‌’ కాప్షన్‌తో రిమ్‌జిమ్‌ సిన్హా  ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ సంచలనంగా మారింది. అర్ధరాత్రి వేళ మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన గళం వినిపించేలా చేసింది.

‘మహిళల కొత్త స్వాతంత్య్ర పోరాటం’గా  ‘రీక్లెయిమ్‌ ది నైట్‌’  క్యాంపెయిన్‌ను అభివర్ణించింది రిమ్‌జిమ్‌ సిన్హా. రీక్లెయిమ్‌ ది నైట్‌’ చిహ్నమైన నెలవంక పట్టుకున్న ఎర్ర చేతి పోస్టర్‌ వైరల్‌ అయింది.

రిమ్‌జిమ్‌ సిన్హా కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సోషల్‌సైన్స్‌ రిసెర్చర్‌. జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన నన్ను బాధ పెట్టడమే కాదు అభధ్రతాభావానికి గురి చేసింది. నగరాల్లో మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారు? అని ఆలోచిస్తేనే భయంగా ఉంది. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు కోరుతూ ఆగస్ట్‌ 14 అర్ధరాత్రి నిరసన ప్రదర్శన చేయాలనుకున్నాను. రాత్రిపూట బయటకు వెళ్లే హక్కు మహిళలకు ఎందుకులేదు?’ అంటున్న రిమిజిమ్‌ సిన్హా  సోషల్‌ మీడియా 
వేదికగా ఎంతో మంది మహిళలను ఐక్యం చేసింది.

మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలపై రిమ్‌జిమ్‌ సిన్హా మండిపడింది. ‘జూనియర్‌ డాక్టర్‌ ఒంటరిగా సెమినార్‌ హాల్‌కు ఎందుకు వెళ్లింది?’ అని ఆయన ప్రశ్నించాడు.

‘బాధితురాలిపై నిందలు మోపే కుసంస్కారాన్ని అంగీకరించబోము. రాత్రివేళ బయట ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు’ అంటుంది సిన్హా. తన పిలుపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుందని, దేశవ్యాప్తంగా వేలాది మంది అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వస్తారని ఆమె ఊహించలేదు.

‘వందమంది వరకు వస్తారనుకున్నాను. ఒకవేళ ఎవరూ రాకుంటే నేను ఒక్కదానినే బయటికి రావాలనుకున్నాను. ఇంతమంది మహిళలు అర్ధరాత్రి ఇల్లు దాటి బయటికి వస్తారని నేను ఊహించలేదు. వారి స్పందన నాకు సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది సిన్హా. రిమ్‌జిమ్‌ సిన్హా పేరు సంచలనం కావడం మాట ఎలా ఉన్నా ఎంతోమంది రాజకీయ నాయకులకు టార్గెట్‌గా మారింది. ‘రీక్లయిమ్‌ ది నైట్‌’ ఉద్యమ చిహ్నానికి రకరకాలుగా భాష్యం చెబుతూ విమర్శిస్తున్నవారు కూడా ఉన్నారు.

‘అర్ధరాత్రిపూట బయటకు వస్తున్నారు. మీకేమైనా అయితే పూచీ మాది కాదు’ అంటున్న రాజకీయ నాయకులు ఉన్నారు. జాదవ్‌పూర్‌లోని 8బీ బస్‌స్టాండ్‌కు దగ్గర జరిగిన సభకు హాజరమైన రిమ్‌జిమ్‌ సిన్హా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన గురించి మాత్రమే కాదు రాత్రివేళలో మహిళలకు ఎదురయ్యే ట్సాన్స్‌పోర్ట్‌ సమస్యలు, పని ప్రదేశంలో మహిళలకు సెపరేట్‌ టాయిలెట్‌లు, బడులలో లింగ సమానత్వంపై ΄ాఠ్యాంశాలు, రాత్రి విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులకు సురక్షితమై విశ్రాంతి గదులు... మొదలైన వాటి గురించి మాట్లాడింది. ‘రీక్లయిమ్‌ ది నైట్‌: ది నైట్‌ ఈజ్‌ అవర్స్‌’ను దృష్టిలో పెట్టుకొని ‘ఇది మహిళల కొత్త స్వాతంత్య్ర ΄ోరాటం’ అంటున్న రిమ్‌జిమ్‌ సిన్హా ఆ ΄ోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)