Breaking News

జెన్‌ జీ పిల్లలూ మన పిల్లలే..!

Published on Fri, 02/27/2026 - 17:43

జెన్‌  జీ పిల్లలు ఏ వర్గం వారైనా ఇంటర్నెట్‌ లేని ప్రపంచం వాళ్ళకి తెలీదు. జెన్‌  జీ పిల్లలకి పది పన్నెండు యేళ్ళు వచ్చే సరికి ఫ్రీ మొబైల్‌ డేటా అందుబాటు లోకి వచ్చింది. దాని వల్ల ప్రపంచం వారి మునివేళ్ళ మీద తారాడటం మొదలుపెట్టి వారి జీవితంలోకి రాని సమాచారం కుప్పలు తెప్పలుగా ప్రవహించింది. ప్రవహిస్తూనే ఉంది. సమాచారాన్ని జ్ఞానంగా భ్రమించే ఈ తరం పిల్లలు సైక్లో స్టయిల్‌ అంటే అదేదో హెయిర్‌ స్టైల్‌ అనుకుంటారు. 

1983లో భోపాల్‌లో ఏం జరిగిందో, 1985లో కారంచేడులో ఏం జరిగిందో, 1992నాటి పరిస్థితులు ఏమిటో వీళ్ళకి కర్ణాకర్ణిగా కూడా తెలియదు. సోషల్‌ మీడియాకి విలువైన వినియోగదారులైన ఈ జెన్‌ జీ తరానికీ వారి కంటే ముందు తరానికీ మధ్య ఇంటర్నెట్‌ వినియోగం అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తోంది. జెన్‌  జీకి ముందుతరం వారికి సోషల్‌ మీడియా లేక΄ోయినా సామాజికంగా తెలియాల్సినవి తెలిశాయి. తెలియవలసిన పద్ధతిలో తెలిశాయి. జెన్‌ జీ ఇంటర్నెట్‌ వల్ల తెలుస్తున్నది తెలియవలసిన పద్ధతిలోనేనా అన్నది పెద్ద ప్రశ్న.

ప్రభుత్వ ఉద్యోగం జీవితానికి ఇచ్చే భద్రత తెలియని జెన్‌ జీ తరం ఏ రంగంలో ఉద్యోగమైనా అవుట్‌ సోర్సింగ్‌తో మాత్రమే చేస్తూ పెర్మనెంట్‌గా పని చెయ్యడంలోని స్టెబిలిటీకి అపరిచితంగా ఉన్నారు. దాంతో ఉద్యోగం చెయ్యడానికి ఒక సంస్థ నుండి మరో సంస్థకి సునాయాసంగా మారి΄ోగలిగే మానసిక స్థితి జెన్‌  జీకి వచ్చింది. ఈ స్థితి జీవితంలో మిగిలిన ముఖ్యమైన జీవన విధానాల మీద ప్రభావం చూపిస్తోంది. 

ప్రేమ... పెళ్లి... పెళ్లి స్థానంలో సహజీవనం... సిట్యుయేషన్‌  షిప్‌... ఇలా పలు రకాలుగా స్త్రీ పురుష సంబంధాలు సాగుతున్నాయి. కాని వీరిలో పూర్వీకుల రక్తం ఉంది. ఆ రక్తం తరతరాలుగా కొనసాగుతూ వచ్చిన భావోద్వేగాలను, జీవన విలువలను ఇచ్చింది. అయితే వర్తమాన ధోరణికీ ఆ గతానికీ లంకె జెన్‌  జీకి కనిపించడం లేదు. 

దాంతో అన్ని అనుబంధాలు, జీవన మార్గాలలో మానసికంగా వస్తున్న ఘర్షణను అడ్రస్‌ చెయ్యటానికి, దానిని బెటర్‌గా అర్థం చేసుకోవటానికి జెన్‌  జీ తరం చాలెంజ్‌ని ఎదుర్కొంటోంది. ఈ స్థితిని దాటడానికి తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తమ చుట్టూ ఉండే పెద్ద వాళ్ళపై ఆధారపడి వారితో పంచుకోవడం కంటే మానసిక వైద్యులతోనో... థెరపిస్టులతోనో... కౌన్సెలింగ్‌ ఇచ్చే వారితోనో పంచుకోవడానికి... చర్చించటానికే ప్రాధాన్యమిస్తున్నారు. పెద్దల మీద కంటే ఈ నిపుణుల మీదే జెన్‌  జీకి ఎక్కువ నమ్మకం... విశ్వాసం. 

ఈ నమ్మకం, విశ్వాసం సంగతి తెలియక, అర్థం కాక తల్లిదండ్రులు, పెద్దలు, చుట్టూ ఉండేవారు మాత్రం ఈ జెన్‌  జీ తరం తమతో ఏదీ పంచుకోవడంలేదనే ఆదుర్దాకి లోనవుతుండటం చూస్తుంటాము. అలా ఆందోళన పడటం కంటే ఈతరం పిల్లల స్వభావం ఇదని అర్థం చేసుకుంటే వారిలోని ఈ ఆదుర్దా వారి ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపించకుండా ఉంటుంది. 

వ్యవస్థ మీద పెద్దగా ఆశలు పెట్టుకోని జెన్‌  జీ తరం వాళ్లు సోషల్‌ కాజెస్‌కి ఇన్వాల్వ్‌ అయినా, ఒక డీప్‌ పర్సనల్‌ లెవెల్‌ కమిట్మెంట్‌తో సోషల్‌ మూమెంట్స్‌తో ఇన్వాల్వ్‌ అయినా తమకి ఓ సోషల్‌ కాంటాక్ట్‌ వస్తుందనే హోప్‌తో ఆ మేరకు మాత్రమే పని చేస్తున్నారు. 

అంతర్జాలమే వాళ్ళ పుట్టిన ఊరు. వారి జగత్తు, ఉనికి అదే. వాళ్ళ ఉనికిని ముందుగా తల్లిదండ్రులు, పెద్దలు అర్థం చేసుకుంటే ఈ పిల్లలు మన పిల్లలే... గ్రహాంతరవాసులు కారని తెలుస్తుంది. ఒక రకంగా వాళ్ళకి మన కన్నా ఎన్నో ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కనిపించినా నిజానికి మన తరాలకు ఉన్న భరోసాలు ఏవీ వాళ్ళకు లేవు. 

వాళ్ళు చూసిన తల్లిదండ్రులు అందరూ నయా ఆర్థిక విధానాలలో ఎదిగి అనేక అభద్రతలతో సతమతమైన వాళ్ళే. వాళ్ల కాలంలో వాళ్లు చూస్తూ ఉన్న ‘మీ టూ’, ‘కోవిడ్‌’, ‘ఇఅఅ’, ‘ఎల్‌జీబీటీక్యూ మూవ్‌మెంట్స్‌’.... వీటిని గుర్తు పెట్టుకుంటే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది. 

జెన్‌  జీ ఆడపిల్లలు తమ గుర్తింపు ప్రేమ, పెళ్లిలో మాత్రం చూసుకోవడం లేదనేది సుస్పష్టం. తమలోని తెలివి, తాము అందుకోగల అవకాశాలు, ఆకాంక్షలు... వీటి ఆధారంగా తమకు ఏ గుర్తింపు దక్కగలదో దానినే కోరుకుంటున్నారు. ఇది కూడా అర్థం చేసుకుంటే వారి దారిలో పెద్దలు తమను తాము ఎక్కడి వరకు పరిమితం చేసుకోవాలో కూడా తెలుస్తుంది. మన పిల్లలను అందుకోవాల్సింది మనమే. 
కుప్పిలి పద్మ

(చదవండి: టూత్‌పిక్‌తో టవర్‌ నిర్మించి రికార్డు సృష్టించాడు..!)

 

#

Tags : 1

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)