Breaking News

‘ఫాస్ట్‌’గా స్లిమ్‌ కాకండి!

Published on Tue, 12/10/2024 - 10:51

చాలామంది టీనేజర్లు స్లిమ్‌గా ఉండాలని అనుకుంటారు. అయితే అందుకోసం తమలోని కొవ్వులను దహింపజేసుకోకుండా... కడుపు మాడ్చుకుని తమ కండరాలను (మజిల్‌ మాస్‌ను) కోల్పోతారు. ఇలా ఫ్యాట్‌ను కోల్పోకుండా మజిల్‌ మాస్‌ను కోల్పోవడం వల్ల చూడ్డానికి సన్నగా, స్లిమ్‌గా అనిపించినప్పటికీ, ఆరోగ్యపరంగా చేస్తే అది మంచి పరిణామం కాదు. అలా జరగకుండా ఉండాలంటే ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.  

స్లిమ్‌గా మారి ఆరోగ్యకరమైన సన్నటి దేహాకృతిని పొందాలనుకునేవారు తాము రోజూ తీసుకునే క్యాలరీలను బాగా తగ్గించుకుంటారు. ఇందుకోసం వాటర్‌థెరపీ, ఫ్రూట్‌థెరపీ, క్యారట్‌ థెరపీ, జీఎమ్‌ డైట్‌ వంటి అనేక ప్రక్రియలను ఫాలో అవుతుంటారు. ఈ డైట్‌ రెజీమ్‌లతో తమ ఆహారంలో తీసుకోవాల్సిన  పిండిపదార్థాలను బాగా తగ్గించుకుంటారు. 

దీనివల్ల తాము బాగా బరువు తగ్గుతున్నామని అనుకుంటుంటారుగానీ... తాము తమ కండరాల పరిమాణాన్నీ (మజిల్‌ మాస్‌)ను / కండరాల శక్తినీ కూడా కోల్పోతున్నామని గుర్తించరు. కండరాలను కోల్పోతుంటే, దాంతోపాటు ఎముక సాంద్రత (బోన్‌ డెన్సిటీ) ని కూడా కోల్పోతున్నారని కూడా అర్థం. ఇదెంతో ప్రమాదం. 

ఆరోగ్యంగా సన్నబడాలంటే... 
మంచి సౌష్ఠవంతో కూడిన శరీరాకృతిని పొందాలంటే దహించాల్సినది కొవ్వులను మాత్రమే. మన దేహపు అవసరాలకు పనికి వచ్చాక మన పొట్ట చుట్టూ పేరుకుపోయి ‘సెంట్రల్‌ ఒబేసిటీ’ని కలిగించే కొవ్వులను మాత్రమే. తక్కువ  పోషకాలతోనే మెటబాలిజమ్‌ జరిగేలా దేహానికి అలవాటు చేయడమూ సరికాదు... 

కొన్నిసార్లు సన్నబడాలనే తీవ్రమైన కోరికతో చాలా తక్కువ క్యాలరీలతోనే జీవక్రియలు కొనసాగేలా దేహానికి అలవాటు చేస్తే... అప్పుడు ఆ కొద్దిపాటి ఆహారంతోనే మెటబాలిక్‌ యాక్టివిటీస్‌ అన్నీ నిర్వహించుకునే సామర్థ్యాన్ని దేహం పొందుతుంది. ఏళ్ల తరబడి అలా చేశాక కొద్దిపాటి అదనపు ఆహారం తీసుకున్నా అది శరీర బరువును విపరీతంగా పెంచేస్తుంటుంది. 

దీన్నే ‘రెసిస్టెంట్‌ ఒబేసిటీ’ అని అంటారు. ఈ రెసిస్టెంట్‌ ఒబేసిటీ వల్ల దీర్ఘకాలం పాటు చాలా చాలా అందంగా కనిపించిన హీరో, హీరోయిన్లు... కెరియర్‌కు దూరంగా ఉన్నప్పుడు కొద్ది వ్యవధిలోనే ఒకేసారి లావెక్కిపోయినట్లుగా కనిపించడం చాలామంది సెలబ్రిటీల్లో కనిపిస్తుంటుంది. 

కండరాలను కోల్పోకుండానే కొవ్వులను దహించడం ఎలా? 
సన్నబడి మంచి శరీరాకృతి (స్లిమ్‌ బాడీ) పొందాలంటే ప్రణాళికాబద్ధంగా కండరాలను (మజిల్‌ మాస్‌ను) కోల్పోకుండా, అదనపు కొవ్వులను మాత్రమే  దహించే విధంగా, ఆరోగ్యకరంగా సన్నబడాలి. స్లిమ్‌గా ఉండాలంటూ భోజనాన్ని మానేస్తే ఒక్కోసారి అనొరెక్సియా నర్వోజా, బులీమియా లాంటి మానసిక సమస్యలూ రావచ్చు. 

అందుకే బాగా తింటూనే మంచి ఆరోగ్యం కోసం దేహానికి కాస్త కష్టం కలిగించే వ్యాయామాలు చేస్తుండాలి. అయితే అంతగా మంచి ఫిట్‌నెస్‌ లేనివారు మాత్రం దేహానికి విపరీతమైన శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామం చేస్తూ... క్రమంగా ఫిట్‌నెస్‌ను సాధించాలి. ఆ తర్వాత స్టామినాను క్రమంగా  పెంచుకుంటూపోవాలి. 

(చదవండి: పిల్లోలు.. పరుపు ఎలా ఉండాలంటే...)
      

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)