Breaking News

తాజ్‌మహల్‌ సాక్షిగా, వేదమంత్రాల నడుమ.. ఇటలీ జంట కళ్యాణం..!

Published on Thu, 11/05/2026 - 14:25

శాశ్వత ప్రేమకు చిహ్నంగా చూసే తాజ్‌మహల్‌ ఏళ్లుగా లెక్కలేనన్ని ప్రేమ కథలకు సాక్షిగా నిలిచింది. కానీ ఈసారి ఈ ఇటలీ ప్రేమికులకు భారతీయ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకునేందుకు కారణమైంది. అది కూడా ఆ తాజమహల్‌నే సాక్షిగా చేసుకుని ఒక్కటవ్వడం విశేషం. ఆ విదేశీ జంట పెళ్లితో..మన భారత సంస్కతి, దాని వైభవం, ఆధ్యాత్మిక విలువల గొప్పదనాన్ని మరోసారి ఈ ప్రపంచానికి నొక్కి చెప్పాయి. జస్ట్‌ భారత్‌ పర్యటనలే.. విదేశీయలను అంతలా ఏమార్చి మన ఆధ్యాత్మికత, సంస్కృతివైపు నడిపించగల మహత్తు ఉందని రుజువు చేసే అద్భుత ఘట్టం ఇది. 

ఆ దంపతులే ఇటలీలోని లిగురియా ప్రాంతానికి చెందిన మాటియో, కాటెరినా చాలా ఏళ్లుగా కలిసి ఉన్నారు. ఈ జంట ఎక్కువగా వివిధ దేశాలు పర్యటిస్తుంటారు. అలా భారత్‌లో పర్యటించి..అక్కడ సంప్రదాయాలు, సంస్కృతిపై మనసుపారేసుకున్నారు. వాళ్లు భారత్‌లో పర్యటించినప్పుడే..ముఖ్యగా ఆగ్రాలో ప్రేమకు చిహ్నమైన ఆ తాజ్‌మహల్‌ని చూసినప్పుడే..ఇక్కడ భారత సంప్రదాయ పద్ధతిలో పరిణయమాడాలని నిశ్చయించుకున్నారు. 

అయితే ఆ కల ఈ తాజా పర్యటనలోనే సాధ్యపడింది. గతంలో ఎన్నో సార్లు వచ్చినా కుదరలేదు. ఈసారి ఆ డ్రీమ్‌ నెరవేర్చుకుని అందర్నీ ఆకర్షించారు. ఆ దంపతులు భారత పర్యటనలో హరిద్వార్‌ని సందర్శించి అక్కడి గంగా నదిలో స్నానం చేశారు. ఆ తర్వాత వారణాసికి ప్రయాణించి కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. ఈ అనుభవాలు భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయల గురించి తెలుసుకునే అవకాశాన్ని కల్పించడమే గాక..ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించిన ఆచారాలు తమను మరింత కట్టిపడేశాయన్నారు. 

అయితే ఆగ్రా వాళ్లకేమి కొత్త కాదు. పలుమార్లు భారత పర్యటనలో ఈ నగరాన్ని, ఈ స్మారక చిహ్నాన్ని(తాజ్‌మహల్‌) సందర్శించారు. అయితే వారి తాజా పర్యటనలో ఆ స్మారక చిహ్నాన్ని దర్శించడం తోపాటే చాలా ఏళ్లుగా అనుకుంటున్న కలను కూడా సాకారం చేసుకున్నారు. అదే హిందూ వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకోడం. ఈ తాజా పర్యటనలో ఒక హోటల్‌లో బస చేసి ఆ తాజ్‌మహల్‌ని సందర్శించి..దాని వెనుకున్న కథను తెలుసుకున్నారు. దాంతో తమ ప్రేమకథ గుర్తుగా ఈ తాజమహల్‌ ఉన్న ఆగ్రాలోనే సనాతన వివాహ పద్దతిలోనే ఒక్కటవ్వాలని కోరుకున్నారు. 

ఆ విషయాన్ని తమ టూర్‌ కంపెనీకి తెలియజేయగా..వాళ్లు ఒక పండితుడిని ఏర్పాటు చేసి, హిందూ వైవాహిక పద్ధతిలో వేదమంత్రాలు, అగ్నిసాక్షి నడుమ ఘనంగా వివాహం జరిపించారు. అంతేగాదు ఆ పండితుడు ఆ వేదమంత్రాల అర్థాన్ని ఆంగ్ల భాషలో వివరించి మరి తంతు నిర్వహించాడు. ఈ వేడుకలో కేటరీనాతో సింధూరం ధరింప చేయడం, మంగళ సూత్రం కట్టడం వంటి ముఖ్యమైన ఆచారాలు జరిగాయి కూడా. మన సంస్కృతి, ఆధ్యాత్మికత ఒక విదేశీ జంట మనసుదోచుకోవడమే కాదు..అనుసరించేలా ఆకట్టుకోవడం అత్యంత విశేషం కదూ..!.
 

ఇదీ చదవండి: భారత ఆటో రిక్షాపై ప్రేమతో ఆ బ్రిటన్‌ దంపతులు ఏం చేశారంటే..?!

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)