Breaking News

కోపానికి టాటా చెప్పేద్దాం!

Published on Sat, 02/28/2026 - 17:51

కోపం వలన గుండె సంబంధిత జబ్బులు రావచ్చని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. చిన్నపాటి కోపమైనా సరే అది రక్తనాళాలను ప్రభావితం చేయడం వల్ల రక్తప్రసరణపై ప్రభావం పడి గుండెపోటు లేదా స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆధునిక జీవన శైలి వలన ఇప్పటికే పలు రకాల గుండె జబ్బులు వస్తున్నాయి. సీటులో నుంచి కదలకుండా ఒకేచోట స్థిరంగా కూర్చోవడం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వలన గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అనుకోకుండా వచ్చే కోపం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

కేవలం ఎనిమిది నిమిషాల పాటు ఉండే కోపం అనే భావోద్వేగం వల్ల రక్త నాళాలు విస్తరించే సామర్థ్యం దాదాపు సగానికి తగ్గిపోతుంది. అంతే కాదు కేవలం 8 నిమిషాల పాటు వచ్చే కోపం వలన దాని ప్రభావం 40 నిమిషాల వరకు ఉంటుందని గుర్తించారు. దీనితో పాటు ఎక్కువ కోపంగా ఉండటం వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.

పరిశోధనలో అసలేం తెలుసుకున్నారు?
అమెరికాలోని వివిధ సంస్థల నిపుణులు చేసిన పరిశోధనలో దాదాపు 300 మంది ఆరోగ్యంగా ఉన్నటువంటి పెద్దవయస్సు వారిని ఎనిమిది నిమిషాల పాటు కోపంగా ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవాలని కోరుతూ అధ్యయనం చేశారు. దీని ద్వారా వారు పొందిన ఫలితాలను బట్టి ఈ అధ్యయనం చేశారు. అయితే, విచారం లేదా ఆందోళన వంటి భావోద్వేగాలు గుండె ఆరోగ్యంపై ఇలాంటి ప్రభావాన్ని చూపలేదు.

కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే...
బాగా కోపం వచ్చినప్పుడు లోతుగా డీప్‌ బ్రీత్‌ తీసుకోవడం లేదా 10 వరకు అంకెలు లెక్కపెట్టడం బెటర్‌. 
కోపం కలిగించే వ్యక్తులకు, పరిస్థితులకు దూరంగా ఉండాలి.
రెగ్యులర్‌గా వాకింగ్, ఎక్సర్‌సైజ్‌ చేయండి.
రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు మంచి నిద్ర, విశ్రాంతి అవసరం.  
స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ధ్యానం లేదా యోగా రెగ్యులర్‌గా చేయడం అలవాటు చేసుకోవాలి. 
మీ కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ మేనేజ్‌ చేసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోండి. 

చ‌ద‌వండి: ముప్పై ఏళ్ల‌కే ఎముక‌లు గుల్ల‌బారుతున్నాయి 

#

Tags : 1

Videos

పెన్షన్ ఎవరిచ్చారు... జగన్ బాబు.. మంత్రి ముందే చంద్రబాబు పరువు తీసిన అవ్వ

ఇరాన్ కు అంత బలముందా.. ప్రపంచంపై యుద్ధం ప్రభావం ఏంటి?

ఈ యుద్ధం ఎక్కడ ఎందుకు మొదలైంది..

యుద్ధం ఆపేది లేదు.. ఇరాన్ డిమాండ్స్

దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం

మా వరకు ఎందుకు మీ ఎమ్మెల్యేలు చాలు సోషల్ మీడియాని కంపు చేయడానికి

వద్దురా అంటే వినలేదు.. వద్దురా అంటే వినలేదు.. కాకినాడ ప్రమాదం బాధితుల కన్నీటి పర్యంతం

కాకినాడ ప్రమాదంలో 22 మంది సజీవ దహనం

ఆకాశంలో అద్భుతం...మార్చి 3న రక్తంతో ఉండబోయే చంద్రుడు!

కల్తీ పాలు తాగి మనుషులు చనిపోతుంటే మీకు క్రికెట్ ఆటలు కావాలా..?

Photos

+5

వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా (ఫొటోలు)

+5

లుక్ మార్చేసిన శ్రీముఖి.. అందంతో మెరిసిపోతుందిగా! (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మృణాల్ (ఫొటోలు)

+5

జగద్గిరిగుట్ట నాగార్జున హైస్కూల్లో సైన్స్ ఫెస్ట్ (ఫోటోలు)

+5

విజయ్‌ పెళ్లిలో ఈషా రెబ్బ‌, తరుణ్‌ భాస్కర్‌ అట్రాక్షన్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్ లో హీరోయిన్ త్రిష.. ఎందుకో తెలియదు (ఫొటోలు)

+5

ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్‌' జోడీ (ఫొటోలు)

+5

వరంగల్‌ : నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–2026 (ఫొటోలు)

+5

తిరుపతి ఐఐటీలో ఉత్సాహంగా తిరుత్సవ్‌–2026 (ఫొటోలు)