Breaking News

నెలసరి పోరాటం

Published on Sat, 02/21/2026 - 06:12

నెలసరి... ప్రకృతి సిద్ధమైన ప్రక్రియే అయినప్పటికీ నేటి ఆధునిక జీవనశైలిలో అది లక్షలాది మంది మహిళలకు ఒక అగ్నిపరీక్షగా మారుతోంది. శారీరక పరమైన సమస్యలే కాకుండా, సామాజిక వివక్ష, మౌలిక సదుపాయాల లేమి, హార్మోన్ల అసమతుల్యత యువతులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. ఇటీవల వెలువడిన తాజా నివేదికలు ఈ సమస్య తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.

21వ అధికరణం
నెలసరి ఆరోగ్యం అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం.. అనే దాని నుంచి ప్రాథమిక హక్కు స్థాయికి చేరింది. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన ఈ చారిత్రాత్మక తీర్పు కొత్త విప్లవానికి నాంది పలికింది. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం నెలసరి ఆరోగ్యం–పరిశుభ్రత  మహిళల గౌరవప్రదమైన జీవన హక్కులో ఒక భాగమని కోర్టు స్పష్టం చేసింది.

612 
దేశంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 6–12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ అందించాలని, విడిగా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

33.4%
25 ఏళ్లలోపు యువతుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి అంటే 33.4% మందికి తమ గురించి సరైన అవగాహన లేదు.

23 మిలియన్లు
 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 23 మిలియన్ల మంది బాలికలు పీరియడ్స్‌ ప్రారంభమైన తర్వాత చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు.

32% 
15–24 ఏళ్ల యువతుల్లో సుమారు 77.3% మంది పరిశుభ్రమైన పద్ధతులు పాటిస్తున్నారు. అయితే బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ఇది కేవలం 32% ఉండటం ఆందోళనకరం.

1022%
 భారత్‌లో 10% నుంచి 22% మంది యువతులు పీసీఓఎస్‌ వంటి నిశ్శబ్ద శత్రువుతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10% నుంచి∙13% మంది మహిళలు ఇబ్బందిపడుతున్నారు. పీసీఓఎస్‌ వంటి హార్మోన్ల సమస్యలు ఉన్నవారిలో 70% మందికి అసలు తమకు ఆ సమస్య ఉందన్న విషయమే తెలియదు.

50%
 పీసీఓఎస్‌ ఉన్న మహిళల్లో 50% కంటే ఎక్కువ మంది ఆందోళన, నిరాశ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

6584%
 పీరియడ్స్‌ సమయంలో సుమారు 65% నుంచి 84% మంది విద్యార్థినిలు తీవ్రమైన కడుపు నొప్పితో (డిస్మెనోరియా) బాధపడుతున్నారు. సగటున ఒక విద్యార్థిని ప్రతినెల 3 నుండి 5 రోజులు పాఠశాలకు దూరమవుతోంది.

2.3 కోట్లు 
ఇప్పటికీ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 2.3 కోట్ల మంది బాలికలు ప్రతి సంవత్సరం నెలసరి సమయంలో పాఠశాలకు వెళ్లడం మానేస్తున్నారు.

79.7%
 రాజస్థాన్ లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, కడుపునొప్పి కారణంగా 79.7% మంది విద్యార్థినులు క్లాసులకు హాజరు కాలేకపోతున్నారు.

50% 
పీరియడ్స్‌ సమస్యలు ఉన్న మహిళల్లో 50% మంది మాత్రమే వైద్యుని సంప్రదిస్తున్నారు. చాలామంది దీనిని సాధారణం అని నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.

68.9%
 తీవ్రమైన పీరియడ్‌ నొప్పితో బాధపడే వారిలో 68.9% మందికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు.

38% 
పీరియడ్స్‌ సమయంలో 38% మంది మహిళలు తమ రోజువారీ పనులను సరిగ్గా చేసుకోలేకపోతున్నారు.

7885% 
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం, 15–24 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో దాదాపు 78% నుంచి 85% మంది పీరియడ్స్‌ సమయంలో ఆరోగ్యకరమైన ఉత్పత్తులను (శానిటరీ ప్యాడ్స్, కప్స్‌ మొదలైనవి) వాడుతున్నారు.

12% 
సుమారుగా 12% మంది మహిళలకు ప్యాడ్లు కొనే స్తోమత లేకపోవడం, అపరిశుభ్రమైన బట్టలు వాడటం వల్ల వారిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.

ఐదుగురిలో 1 బాలిక
నెలసరి మొదలయ్యాక ప్రతి ఐదుగురిలో ఒక బాలిక చదువు మానేస్తుంది. మౌలిక సౌకర్యాల లేమి, బాల్య వివాహాలు, అవగాహన లోపం వల్ల పాఠశాల మానేస్తున్నారు. 

1.13
 భారతదేశం ఏటా సుమారు 1.13 లక్షల టన్నుల శానిటరీ ప్యాడ్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. వీటిని పర్యావరణానికి హాని కలగకుండా నిర్వీర్యం చేయడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.

సమాజంలో పీరియడ్స్‌ గురించి ఉన్న అపోహలు ఇంకా తొలగిపోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థినిలు, యువతులలో ఈ సమస్యలు వారి చదువు, మానసిక స్థితి, దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కేవలం శానిటరీ ప్యాడ్స్‌ పంపిణీ చేస్తే సరిపోదని, పాఠశాల స్థాయి నుంచే లింగ–సమగ్ర విద్య అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)