Breaking News

భార్యకు సర్‌ఫ్రైజ్‌ ఇవ్వబోయి పేలిపోయాడు..కట్‌చేస్తే అతడు..!

Published on Sun, 08/11/2024 - 14:03

హనీమూన్‌ను గుర్తుండిపోయేలా చేద్దాం అనుకుని భార్యకు ఓ పీడకలను అందించాడు. ఇలాంటి సర్‌ఫ్రైజ్‌ ఏ భర్తి ఇంతవరకు ఇచ్చి ఉండడేమో..!. కానీ ఇలాంటి భయానక పరిస్థితి ఏ భార్యకు ఎదురుకాకూడదు. ఈ ఆ ఘటన నుంచి ఆ భార్య ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు కూడా. 

అసలేం జరిగిందంటే..కెనడాకు చెందిన నూతన వధూవరులు లెవీ స్టాన్‌ఫోర్డ్, భార్య అమీ హనీమూన్‌కు వెళ్లారు. అతను తన కుటుంబంలోని ఆరుగురు సభ్యులతో కలిసి మంచి మంచి ప్రదేశాలను చూడటానికి వెళ్లాడు. 23 ఏళ్ల లెవీ తన హనీమూన్‌  గుర్తుండిపోయేలా చేయడానికి, భార్య అమీని ఆకట్టుకోవడానికి  చక్కటి ప్లాన్‌ వేశాడు. ఐతే లెవీ చిన్నతనంలో గ్రామంలో పెరగడంతో అతడికి పేలుడు పదార్థాలు జీవితంలో ఓ భాగం కూడా. అందువల్ల ఒక పరికరాన్ని సిద్ధం చేశాడు. 

ఇది సరస్సులో పేలి ఒక అందమైన నీటి ఫౌంటైన్‌ని సృష్టిస్తుంది. అదే చేద్దాం అనుకున్నాడు లెవీ. అంతేగాదు ఆ పేలుడు శబ్దాన్ని రికార్డు చేయమని తన సోదరుడకి కూడా చెప్పాడు. అతను పరికరాన్ని నీటిలోకి విసిరేద్దాం అనుకుంటుండగా..ఇంకా 60 సెకన్లు ఉందనంగా దురదృష్టవశాత్తు..చేతిలోనే అది పేలిపోయింది. లెవీ ఆ భయానక ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయాడు. రక్తంలో తడిసిపోయి బట్టలన్నీ ఊడిపోయాయి. చచ్చిపోతున్నంత బాధను అనుభవించాడు. శరీరమంతా గాయలమయం అయిపోయింది. కోలుకోవడానికి సంవత్సరం పట్టింది. ఆ తర్వాత మునుపటిలా ఆర్బరిస్ట్‌గా పనిచేయలేకపోయాడు. 

అయితే అతడి ప్రియురాలు, అమీ మాత్రం అతడిని వదిలి వెళ్లిపోలేదు. ఈ చేదు ఘటన తర్వాత వాళ్ల మధ్య ప్రేమ రెట్టింపు అయ్యింది. ఈ ఘటనలో లెవీ ఎడమ చేయి కోల్పోవడమే గాక చాలా భాగాలకు తొడ చర్మాన్ని కత్తిరించి అతికించడం జరిగింది. చెప్పాలంటే శరీరం అంతా గాయాలతో చిందరవందరగా ఉంది. అయినా అతడి భార్య లెవీ వెన్నంటే ఉండి కంటికి రెప్పలా కాచుకుంది. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో చూపించింది అమీ. అయితే ఈ చేదు ఘటన తర్వాత ఇరువురు వాదులాడుకోలేదని, భగవంతడు ప్రసాదించిన రెండో జీవితాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేశామని ఆత్మవిశ్వాసంగా చెప్పాడు లెవీ. 

ఇప్పుడు ఆ  జంటకు నలుగురు పిల్లలు కూడా. ప్రస్తుతం అతడు ఈ ఘటనతో మోటివేషనల్ స్పీకర్, కమెడియన్, ఎంటర్‌టైనర్‌గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కోసారి మరుపురాని జ్ఞాపకంగా మార్చుకుందామని చేసే పనులు మర్చిపోలేని పీడకలలా విధి మార్చేసినా..తట్టుకుని నిలబడి తమ బాంధవ్యాన్ని స్ట్రాంగ్‌గా చేసుకుంది ఈ జంట. పైగా పరిపూర్ణమైన వ్యక్తులుగా నిలిచి ఎందరిగో స్ఫూర్తినిచ్చారు. ప్రతికూలతలను సానుకూలంగా మార్చుకుని జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడం అంటే ఏంటో తెలియజెప్పింది ఈ జంట. 

(చదవండి: సారా అలీఖాన్‌ వెయిట్‌ లాస్‌ జర్నీ..96 కిలోల నుంచి..!)

 

#

Tags : 1

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)