Breaking News

రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్‌లో..

Published on Sun, 10/26/2025 - 12:36

వివిధ డిజైన్లలో కనిపించే ఉంగరాలు వేళ్లకు, చేతులకు ఎంత అందాన్ని తీసుకువస్తాయో మనకు తెలిసిందే. ఇదే ఆలోచనను టేబుల్‌ నాప్‌కిన్స్‌కు తీసుకువచ్చారు అలంకార ప్రియులు. నాప్‌కిన్‌ రింగ్‌ హోల్డర్లు నాప్‌కిన్లను నీటుగా ఉంచుతాయి. టేబుల్‌ అలంకరణకు ఆకర్షణను జోడిస్తాయి. వీటిని లోహం, కలప, పూసలు, వివిధ రకాల మెటీరియల్‌తో చేతితో తయారు చేసుకోవచ్చు. ఒకే డిజైన్, ఒకే పరిమాణంలో ఉన్న ఈ హోల్డర్లు విందు సమయాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.

వీటి వల్ల ప్రయోజనాలు ఏంటంటే... 
నాప్‌కిన్‌లు అస్తవ్యస్తంగా లేకుండా నీటుగా ఉంటాయి. టేబుల్‌ అందాన్ని, వ్యక్తిత్వాన్ని, సంపూర్ణతను జోడిస్తాయి. ఈ చిన్న ఉంగరాలు విలాసవంతమైన అనుభూతిని కలిగిస్తాయి.  

ఈ రింగ్స్‌ వల్ల నాప్‌కిన్‌లను  ఒక్కొక్కటి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. 

బంగారం, ఇత్తడి, స్టెయిన్‌లెస్‌ స్టీల్, కలప, ప్లాస్టిక్, వెదురు, జనపనార... ఇలా వివిధ రకాల మెటీరియల్‌తో రుమాలు ఉంగరాలను రూపొందించవచ్చు. 

సాధారణ బ్యాండ్ల నుండి బొమ్మలు, జంతువులు, ఆకులు... లెక్కలేనన్ని డిజైన్లలో ఈ రింగ్స్‌ లభిస్తాయి. 

వీటిని ఎలా ఎంచుకోవాలంటే...

భోజనాల గది సౌందర్యానికి అనుగుణంగా ఉండే డిజైన్స్‌ని ఎంచుకోవాలి.  

ఉపయోగించే నాప్‌కిన్‌లకు కాగితం లేదా క్లాత్‌ ఏదైనా, హోల్డర్‌ సరైన సైజులో ఉండేలా సరిచూసుకోవాలి.

సులభంగా విరిగిపోయేవి, పడిపోయేవి కాకుండా తగినంత బరువుతో ఉండేలా చూసుకోండి. రింగుల హోల్డర్లు గట్టిగా ఉండాలి కానీ, మరీ బరువుగా ఉండకూడదు. 

మరకలు లేదా తుప్పు పట్టకుండా ఉండే రింగ్‌ హోల్డర్లను ఎంచుకోవాలి.

రుమాలు ఉంగరాలకు చరిత్ర కూడా ఉంది. 1800 ప్రాంతంలో ఫ్రాన్స్‌లో ఈ మోడల్‌ మొదలైంది. ప్రత్యేక విందు కార్యక్రమాలలో కనిపించే వీటిని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునేవారు. వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్న నాప్‌కి  రింగ్‌ హోల్డర్లను అభిరుచికి తగినవి సన్నిహితులకు కానుకలుగా ఇవ్వడానికీ సరైన ఎంపిక అవుతుంది. 
ఎన్నార్‌ 

(చదవండి: కనిపెట్టింది మహిళలు.. క్రెడిట్‌ కొట్టేసింది పురుషులు..!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)