Breaking News

ఈ గ్రామాల్లో హోలీ వేడుకలు ఎలా ఉంటాయంటే..?

Published on Sat, 03/23/2024 - 08:18

తీర్థయాత్రలు చేస్తారు కొందరు. వర్ణయాత్రలు కొందరికి ఇష్టం. మన దేశంలో హోలి చాలా హుషారైన పండగ. బహుశా దీపావళి తర్వాత చిన్నా పెద్దా అందరూ కేరింతలతో పాల్గొనే పండగ ఇదే. రొటీన్‌ వితంలో రంగులను నింపుకోవడం బాగుంటుంది. అయితే కొందరికి ఇంట్లోనో, అపార్ట్‌మెంట్‌ ప్రాగణంలోనో, వీధిలో, ఏరియా చౌరస్తాలోనో ఆడే హోలీ పెద్దగా ఆనదు. వారికి భారీ హోలి వేడుక చూడాలనిపిస్తుంది. అలాంటి వారి కోసం హోలి డెస్టినేషన్స్‌ ఉన్నాయి. మన దేశంలో. ఈ హోలీకి వెళ్లగలిగితే వెళ్లండి.

మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో హోలి వేడుకలు చూడటం అంటే కృష్ణ రాధలు ఆడే హోలిని చూసినట్టే. ఇక్కడి బర్సానాలో స్త్రీలు గోపికల్లా, పురుషులు గోపబాలురలా అలంకరించుకుని హోలి ఆడతారు. రంగులు చల్లడానికి వచ్చిన గోపబాలురను స్త్రీలు సరదాగా బడితెలతో బాది దూరం తరుముతారు. అందుకే దీనిని ‘లాత్‌మార్‌ హోలి’ అంటారు.

ఉదయ్‌పూర్‌: ఇక రాచరికస్థాయిలో హోలి చూడాలంటే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లాలి. అక్కడి సిటీ ప్యాలెస్‌లో రాజ వంశీకుల హాజరీలో అద్భుతమైన హోలి వేడుకలు జరుగుతాయి. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజస్థానీ జానపద కళల ప్రదర్శన ఉంటుంది. టూరిస్ట్‌లు ఈ వేడుకలు చూడటానికి తెగబడతారు.

బృందావన్‌: ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళితే అక్కడి బన్‌కె బిహారి ఆలయంలో పూలు, రంగులు కలిపి చల్లుకుంటూ కోలాహలంగా హోలి నిర్వహిస్తారు. అందుకే దీనిని ‘ఫూల్‌వాలోంకి హోలి’ అంటారు. ఇక్కడ ఒకరోజు రెండు రోజులు కాదు... వారం రోజులపాటు హోలి వేడుకలు జరుగుతునే ఉంటాయి. చుట్టుపక్కల పల్లెలు రంగులతో తెల్లారి రంగులతో అస్తమిస్తాయి. ఈ అద్భుతమైన వేడుకలను చూడానికి టూరిస్ట్‌లు వస్తారు.

హంపి: తుంగభద్ర నది ఒడ్డున రంగుల పండగ ఎలా ఉంటుందో చూడాలంటే హంపి వెళ్లాలి. ఇక్కడ హంపి సందర్భంగా భారీగా అలంకరించి నిర్వహించే రథయాత్ర చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఈ సాంస్కృతిక క్షేత్రంలో హోలీ ఒక విచిత్ర భావన కలిగిస్తుంది. నగర ప్రజలు డోళ్లు మోగిస్తూ హోలి వేడుకల్లో విశేషంగా పాల్గొంటారు. విరూపాక్ష ఆలయం ఈ సందర్భంగా కళకళలాడిపోతుంది. దక్షిణాదివారు హోలీ సెలవు హంపిలో గడిపి ఆనందించవచ్చు.

శాంతినికేతన్‌: పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో హోలి అయితే నయనానందమూ శ్రవణానందమూ కూడా. ఎందుకంటే అక్కడ హోలి అంటే రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు... నృత్యాలు, సంగీతం, కవిత్వం... అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మనోహరంగా హోలి జరుపుకుంటారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మొదలెట్టిన  ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇక్కడకు వెళ్లి హోలి చూసినవారి హృదయం కచ్చితంగా రంగులతో నిండిపోతుంది.

ఆనంద్‌పూర్‌ సాహిబ్‌: పంజాబ్‌లోని ఈ ఊళ్లో హోలీ రంగులకు కళ్లు చెదురుతాయి. నిహాంగ్‌ సిక్కులు ఇక్కడ హోలి సమయంలో యుద్ధ విద్యలు ప్రదర్శిస్తారు. ఉత్తుత్తి పోరాటాలు ఇరు జట్ల మధ్య జరుగుతాయి. డోళ్లు తెగ మోగుతాయి. ఆట పాటల అట్టహాసం చూడతగ్గది.

ఇవి చదవండి: పిచ్చుకా క్షేమమా..ఐ లవ్‌ స్పారోస్‌!!

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)