Breaking News

Holi 2025 యంగ్‌ హీరోయిన్ల ఫ్యావరేట్‌ కలర్స్‌ ఇవే!

Published on Fri, 03/14/2025 - 10:20

భువిపై విరిసే ఇంధ్రధనుస్సుఇంధ్ర ధనుస్సు నేలకు దిగి వచ్చిందా... అనిపించే రోజు హోలీ. సప్తవర్ణాలలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది.ఆ ఇష్టాన్ని తమ డ్రెస్సుల ద్వారా చూపుతుంటారు. సినిమా తెరపైన రంగు రంగుల దుస్తుల్లో కనిపించే తారలు తమకు ప్రత్యేకించి ఇష్టమైన రంగు గురించి ఈ హోలీ సందర్భంగా మనతో పంచుకుంటున్నారు. 

బ్లూ అండ్‌  పింక్‌ 
నాకు నచ్చిన రంగు పింక్‌. పెరుగుతున్న కొద్దీ అన్ని రంగులు నచ్చుతుంటాయి. కానీ, ఎక్కువ భాగం అయితే పింక్, బ్లూ కలర్స్‌ నా డ్రెస్సింగ్‌లోనూ చోటు చేసుకుంటుంటాయి.  – శివాత్మిక రాజశేఖర్‌

మల్టీ కలర్స్‌ 
నా జీవితంలో ఇంధ్రధనస్సు రంగులన్నీ ఉండాలనుకుంటాను. ఎందుకంటే, మనలోని భావోద్వేగాలను తెలియజేప్పేవే రంగులు. సప్తవర్ణాలన్నీ నాకు ఇష్టమైనవే. అందుకే నా డ్రెస్సులలో మల్లీ కలర్స్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకుంటాను. ఒక ప్లెయిన్‌ కలర్‌ శారీ లేదా డ్రెస్‌ వేసుకుంటే దాని మీదకు మల్టీకలర్‌ బ్లౌజ్, దుపట్టా ఉండేలా చూసుకుంటాను. – సంయుక్త మీనన్‌

చదవండి: Holi 2025 - నేచురల్‌ కలర్స్‌ ఈజీగా తయారు చేసుకోండిలా!

అన్ని రంగులను స్వాగతించే తెలుపు 
నాకు తెలుపు రంగు చాలా ఇష్టం. శాంతి, కొత్త ప్రారంభాలు, అంతులేని అవకాశాలకు చిహ్నం తెలుపు. రంగులతో నింపుకోవడానికి వేచి ఉండే ఖాళీ కాన్వాస్‌ లాంటిది తెలుపు. ఇది అన్నింటినీ స్వాగతించే రంగు. అందుకే ఈ రంగు నాకు స్ఫూర్తిమంతమైనది కూడా. ప్రేమ, దయ, ఆనందాన్ని వ్యాప్తి చేసే ఈ వేడుక సందర్భంగా తెల్లని మన హృదయాలపైన అందమైన రంగులను చిలకరించుకుందాం.  – వైష్ణవి చైతన్య

చదవండి: Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
 

గ్రీన్‌ అండ్‌ పర్పుల్‌
నాకు చాలా ఇష్టమైనది ఎల్లో. దీనిలోనే మరింత బ్రైట్‌గా ఉండే డ్రెస్సులను ఎంచుకుంటాను. దీంతో పాటు పర్పుల్, బ్లూ, గ్రీన్‌ కలర్స్‌ ఇష్టపడతాను. ఈ రంగులోనే పీచ్‌ కలర్‌ డ్రెస్సులు ధరించినప్పుడు ఉల్లాసంగా అనిపిస్తుంది. అవి నన్ను ప్రత్యేకంగా చూపుతాయి అనే భావన ఉంటుంది – రెజినా కసండ్రా

ప్రతి ఒక్కరికి కొన్ని రంగులు అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. అయితే, దుస్తుల విషయంలో మాత్రం కొన్ని రంగులు మాత్రమే వారి శరీరానికి నప్పేవిధంగా ఉంటాయి.  ఏ రంగు డ్రెస్‌ ఎవరికి నప్పుతుందంటే... సాధారణంగా చీరలు ఎంపిక చేసుకుంటున్నప్పుడు వాటిని మన మీద వేసుకొని, కలర్‌ బాగుంటుందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకొని తీసుకుంటుంటాం. 

  • కొంత మంది చర్మం ఫెయిర్‌గా ఉంటుంది. కానీ, డార్క్‌ కలర్స్‌ సెట్‌ అవవు. అలాంటప్పుడు లైట్‌ షేడ్స్‌ లేదా మల్టీకలర్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు. వీరు సేమ్‌ స్కిన్‌ టోన్‌ కలర్‌ డ్రెస్సులు ఈవెనింగ్‌ పార్టీలకు ధరిస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు 

  • డార్క్‌ స్కిన్‌ ఉన్నవారికి లేత రంగులు బాగుంటాయి అనుకుంటారు. కానీ, వీరికి డార్క్‌ కలర్స్‌ బాగుంటాటాయి.

  • తమకు నప్పే కలర్‌ డ్రెస్‌ ఎంపికకు డిజైనర్‌ సలహాలు తీసుకుంటారు. అలాంటి వారికి కలర్‌ కాన్సెప్ట్‌ గురించి వివరిస్తాం. వారి శరీర రంగు, సందర్భం, పార్టీ .. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని డిజైన్‌ చేస్తాం.  
     

  • రీ యూజ్‌... రంగులు చల్లుకున్నాక వేసుకున్న డ్రెస్‌ మల్టీకలర్‌తో నిండిపోతుంది. ఆ డ్రెస్‌ పైన ఏ కలర్‌ భాగం ఎక్కువుందో చూసుకొని, ఆ రంగుతో డైయింగ్‌ చేయించి, తిరిగి వాడుకోవచ్చు. -నవ్యశ్రీ మండవ, ఫ్యాషన్‌ డిజైనర్, హైదరాబాద్‌     

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)