Breaking News

HMPV : మళ్లీ మాస్క్‌ వచ్చేసింది.. నిర్లక్ష్యం వద్దు!

Published on Mon, 01/06/2025 - 13:05

హ్యూమన్​మెటాప్ న్యుమో వైరస్(HMPV) భయం లేదు.. ఆందోళన లేదు అనుకుంటూ ఉండగానే మాయదారి వైరస్‌ మన దేశంలోకి కూడా ప్రవేశించింది.

ప్రస్తుతం చైనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న  వైరస్‌  క్రమంగా ఇండియాతోపలు పలు దేశాల్లోతన ఉనికిని చాటుకుంటోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. 

ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్‌ ఆరోగ్య అధికారులు నొక్కి చెప్పారు. అలా ప్రకటించారో లేదో ఇలా  హెచ్ఎంపీవీ వైరస్ తొలి కేసు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైంది. ఈవైరస్‌ బారిన  శిశువుకు వైద్యం చేస్తుండగానే మరో   చిన్నారికి కూడా ఇలా మూడు కేసులు నమోదు కావడంతో దేశంలో అందోళన మొదలైంది.  

కొత్తది కాదు 
మనదేశంలో విస్తరించకుండా ఉండాలేంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. HMPV వైరస్ కొత్తతేదీ  కాదు. న్యుమోవిరిడే కుటుంబానికి చెందిన మెటాప్న్యూమోవైరస్ ఒక సాధారణ శ్వాసకోశ వైరస్.  శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటే జలుబుకు కారణమవుతుంది. శీతాకాలంలో సాధారణంగా వచ్చే జలుబు..శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్, ఫ్లూ  లాంటిదే అంటున్నారు వైద్యులు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

టీకా లేదు
అయితే ప్రస్తుతానికి దీనికి టీకా అందుబాటులో లేదు కనుక కొన్ని కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్‌, శానిటైజేషన్, హ్యాండ్‌ వాష్‌‌, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి.   వైరస్‌బారిన  పడిన వారు సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటించడం ఉత్తమం.

ఎలా వ్యాపిస్తుంది
HMPV సోకిన వ్యక్తిదగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.  వైరస్-కలుషితమైన వాతావరణాలకు గురికావడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది.

మాస్కే మంత్రం!
మాస్క్‌ కచ్చితంగా ధరించాలి
చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.  
సామాజిక దూరాన్ని  పాటించాలి.
పదే పదే కళ్ళు, ముక్కు , నోటిని తాకడం మానువాలి.  
అనారోగ్యంగా అనిపిస్తే లేదా దగ్గు, గొంతు నొప్పి లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, చికిత్స తీసుకోవాలి.
వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండాలి
డోర్‌ నాబ్‌లు, లైట్ స్విచ్‌లు , స్మార్ట్‌ఫోన్‌లు వంటి కలుషితమైన ఉపరితలాలను క్రమం తప్పకుండా శానిటైజ్‌ చేయాలి.
అనారోగ్యం సంకేతాలను చూపించే వ్యక్తుల నుండి సురక్షితమైన దూరం  పాటించాలి.
ఈ వైరస్‌ ఎక్కువగా, పిల్లలు, వృద్ధుల్లో   కనిపిస్తోంది కనుక వీరి పట్ల మిగిలిన కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి.
వేడి నీటిని తాగుతూ, ఆహార పదార్థాలను వేడి వేడిగా తింటూ ఉండాలి.
బయటి ఫుడ్‌కు  ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.

హెచ్ఎంపీవీ లక్షణాలు

  • దగ్గు, జ్వరం. జలుబు,

  • గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం

  • ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. 

  •  లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)గా మారవచ్చు.


నోట్‌: జలుబు, ఫ్లూ లక్షణాలు కనిపిస్తే అందోళన పడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.  లక్షణాలున్నవారు ఐసోలేషన్‌గా ఉంటే  ఇంకా మంచిది. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారు మాస్క్‌, హ్యాండ్‌ వాష్‌, స్వీయ శుభ్రత పాటించాలి.   

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)