Breaking News

NDA శిక్షణ పూర్తిచేసుకున్న 17 మంది మహిళా క్యాడెట్లు

Published on Fri, 05/30/2025 - 15:47

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) 148వ కోర్సు నుండి తొలి బ్యాచ్ మహిళా క్యాడెట్లు రికార్డ్‌ సృష్టించారు. కఠినమైన  తమ శిక్షణనువిజయవంతంగా పూర్తిచేశారు.  శుక్రవారం ఉదయం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత 17 మంది మహిళా క్యాడెట్లు జోష్ పుష్-అప్‌లతో ఔరా అనిపించారు. 300 మందికి పైగా పురుష క్యాడెట్లతో పాటు పదిహేడు మంది మహిళా క్యాడెట్లు అకాడమీ నుండి  గ్యాడ్యుయేట్‌   కావడం విశేషం.

పుణేలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఆర్మీ చీఫ్ , మిజోరాం ప్రస్తుత గవర్నర్ జనరల్  వీకే సింగ్ పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్ష అధికారిగా ఉన్నారు. అకాడమీ క్యాడెట్ కెప్టెన్ ఉదయవీర్ నేగి 148వ కోర్సు కవాతుకు నాయకత్వం వహించారు. "ఈ రోజు అకాడమీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన రోజు, ఎన్‌డిఎ నుండి మహిళా క్యాడెట్ల తొలి బ్యాచ్  శిక్షణను పూర్తి చేసుకుందని, ఇదిమరింత మంది మహిళలు  చేరడానికి, వారి  సాధికారత వైపు సాగేలా చారిత్రాత్మక మైలురాయి లాందని  జనరల్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు.వీరు "నారి శక్తి"కి బలమైన చిహ్నం, ఇది మహిళల అభివృద్ధిని మాత్రమే కాకుండా మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని కూడా ప్రతిబింబిస్తుందన్నారు. అంతేకాదు ఇది ఈ క్యాడెట్ల అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానన్నారు.  
 

తమకు జెండర్‌ అనేది తమకు ఎపుడూ అడ్డంకి కాలేదనీ క్యాడెట్ ఇషితా శర్మ  సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికొకరం కష్టనష్టాల్ని పంచుకుంటూ అచంచలమైన విశ్వాసం, వైఖరితో ఐక్యతా స్ఫూర్తిని స్వీకరించా మన్నారు. 

2021లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యుపీఎస్‌సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) మహిళలు డిఫెన్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించిన తర్వాత ఎన్‌డీఏలో మహిళా అభ్యర్థుల ప్రవేశానికి మార్గం సుగమం అయింది. 2022లో మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ 2022లో ఎన్‌డిఎ  148వ కోర్సులో చేరిన సంగతి తెలిసిందే.  ప్రవేశ పరీక్ష ద్వారా  ఈ మహిళా అభ్యర్థులు ఎంపిక  ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు NDA లో మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందుతారు. శఙక్షణ అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ఎంపిక చేయబడతారు. 

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)