Breaking News

‘డ్రై ఐస్‌ సిండ్రోమ్‌’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..

Published on Sun, 02/15/2026 - 14:12

కంటతడిపై ‘కన్నే’యండి!
కొందరిలో కళ్లనిండా నీళ్లు ఉండటం... కళ్లు చెమ్మగిల్లినట్టుగా ఉండటం కనిపిస్తుండేదే. ఇందుకు చాలా అంశాలు కారణమవుతాయి. ఇలా కళ్లలో నీరు ఉన్నట్లు కనిపిస్తుండటం, చెమ్మగిల్లుతూ ఉండటానికికారణాలేమిటో తెలుసుకుందాం.

కారణాలు...
కళ్లలో ఏదైనా ఇన్‌ఫ్లమేషన్‌ లేదా ఇన్ఫెక్షన్‌తో కళ్లుమండుతూ ఉన్నప్పుడు 

దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి అంశాలతో అలర్జీ వల్ల 

కళ్లకలక (కంజంక్టివైటిస్‌) వంటి ఇన్ఫెక్షన్లతో 

కళ్లలో నీళ్లూరేందుకు ఉండే డక్ట్స్‌ మూసుకుపోవడంతో కన్నీళ్లు బలవంతంగా రావడానికి ప్రయత్నించడం 

‘డ్రై ఐస్‌ సిండ్రోమ్‌’ ఉన్నవాళ్లలో. ఇక్కడ ఒక సందేహం కలగడం సాధారణం. అంటే డ్రై ఐస్‌ సిండ్రోమ్‌లో కళ్లు పొడిబారాలి కదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి ఈ సిండ్రోమ్‌లో కళ్లుకు ఇన్‌ఫ్లమేషన్‌ వస్తుంది. దీన్నే ‘డ్రై ఐస్‌ సిండ్రోమ్‌’ అంటారు. ఈ ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల కళ్లలో నీరు ఎక్కువగా ఊరుతుంది.

నివారణ, చికిత్స...
∙చిన్నపిల్లల కళ్లల్లో ఇలా నీరూరుతున్నప్పుడు లేదా కళ్లలోకి దుమ్మువెళ్లినప్పుడు పాతకాలపు పెద్దవాళ్లు ఓ మెత్తటి టవల్‌ లేదా మెత్తటి గుడ్డను ఉండగా చేసి, దానిపై నోటితో గాలి ఊది దాన్ని కొద్దిగా వెచ్చబడేలా చేసి కంటిపై అద్దడం అన్నది కాస్తంత మధ్యవయస్కులకూ, పెద్దవాళ్లకు తెలిసిందే. 

అలా కాస్తంత గోరువెచ్చని ఆవిరితో గుడ్డను ఉండగా చేసి కళ్లపై అద్దడం వల్ల మంచి రిలీఫ్‌ వస్తుంది 

అలర్జీ వల్ల ఇలా జరిగినప్పుడు డాక్టర్‌ల సూచన మేరకు యాంటిహిస్టమైన్‌చుక్కల మందు వాడాలి. అలాగే ఇన్ఫెక్షన్‌ వల్ల ఇలా జరిగితే డాక్టర్లు యాంటీబయాటిక్‌ చుక్కల మందును సూచిస్తారు 

మాటిమాటికీ కళ్లను తాకకుండా ఉండాలి ∙ఇంతకు మించి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కళ్ల డాక్టర్‌ను సంప్రదించాలి.

ఉబ్బు కళ్లు...
కొందరిలో ఉబ్బుకళ్లు కనిపిస్తుంటాయి. పొద్దున్నే నిద్రలేవగానే కొద్దిసేపటి వరకు ఉబ్బుకళ్లు కనిపించడం మామూలే. కానీ కొందరిలో ఇవి చాలాసేపు అలాగే ఉండి΄ోతాయి. ఈ సమస్యను ఇంగ్లిష్‌లో ‘పఫ్ఫీ ఐస్‌’ అంటుంటారు. సాధారణంగా చాలామందిలో ఇది తాత్కాలిక సమస్యే. కళ్లు బాగా అలసి΄ోవడం (ఫెటీగ్‌) వల్ల కూడా ఇలా జరగవచ్చు.

కారణాలు...
∙రాత్రి ఎక్కువసేపు నిద్ర΄ోకుండా ఉండటం లేదా నిద్రలేమి కారణంగా ∙క్రితం రాత్రి ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం  కొందరిలో ఉప్పుకారాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత ∙ఇక చాలామందిలో ఇలా కళ్లు ఉబ్బినట్టుగా ఉండటం లేదా కళ్ల కింద చర్మం జారినట్టుగా ఉండటమన్నది వయసు పెరుగుతుండటం (ఏజింగ్‌) వల్ల జరగవచ్చు ∙మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలోనూ, రక్తంలో ్ర΄ోటీన్‌ తక్కువగా ఉండటం వల్ల, అలాగే రక్తహీనత (అనిమియా) సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లలోనూ ఇలా ఉబ్బుకళ్లు కనిపిస్తాయి.

నివారణ / చికిత్స...

మెత్తటి టవల్‌ లేదా మెత్తటి గుడ్డను చల్లటి నీటిలో ముంచి కళ్లపై అద్దడం (కోల్డ్‌ కంప్రెస్‌)

ఆహారంలో ఉప్పుకారాల  మోతాదును తగ్గించడం  కంటినిండా గాఢంగా నిద్ర΄ోవడం.

డాక్టర్‌ రవికుమార్‌ రెడ్డి సీనియర్‌ కంటి వైద్య నిపుణులు 

ఈ సూచనలు పాటించండి

కళ్ల జాగ్రత్తల్లో 20 – 20 – 20 అనేది ఓ మంచి సూచన. అంటే... ప్రతి 20 నిమిషాలకోసారి మనం దృష్టిని కేంద్రీకరించి ఉన్న అంశంపైనుంచి (కంప్యూటర్‌ / ఫోన్‌) దృష్టి మరల్చి 20 ఫీట్ల దూరంలో ఉన్న మరో వస్తువును 20 సెకన్ల పాటు చూస్తుండటం. ఏకాగ్రతతో ఏదైనా పనిచేస్తున్నా లేదా వృత్తిరీత్యా కంప్యూటర్‌ స్క్రీన్‌ గానీ, టీవీ స్క్రీన్‌నుగానీ తదేకంగా చూస్తున్నప్పుడు ఇలా చేయడం మంచిది. 

టీవీ, కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ఇలా ఏదైనప్పటికీ ఆ స్క్రీన్‌ టైమ్‌ను గణనీయంగా తగ్గించడం ∙తరచూ కన్రెప్పలను కదిలిస్తూ / మూస్తూ ఉండాలి. (అంటే బ్లింకింగ్‌ చేస్తూ ఉండాలి). ఫలితంగా కన్నీరు కంటిపైన సమంగా అలముకుని కంటిని పొడిబారకుండా కాపాడుతుంది 

ఇంట్లో లేదా ఆఫీసులో ఏసీ చాలాసేపు నడుస్తుంటే అక్కడి వాతావరణంలోని గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇలా చాలాసేపు ఏసీలో ఉన్నవారు కాసేపు మామూలు వాతావరణంలోనూ కిసేపు గడపాలి 

కళ్లజోడు తాలూకు గ్లాసెస్‌ లేదా కాంటాక్ట్‌ లెన్సులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. పవర్‌ మారిందని తెలుసుకోగానే తగిన పవర్‌ ఉన్న అద్దాలను మార్చుకోవాలి. ఈ కొద్ది΄ాటి జాగ్రత్తల తర్వాత కూడా కంటికి సంబంధించిన అసౌకర్యం తగ్గక΄ోతే వెంటనే కంటి డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. 
నిర్వహణ యాసీన్‌ 

(చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్‌..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..)

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు