Breaking News

మందిరా బేడి ఫిట్‌నెస్‌ మంత్ర..! 30 ఏళ్ల వయసులో కంటే ఇప్పుడే..

Published on Tue, 02/24/2026 - 12:19

ఫ్యాషన్‌ డిజైనర్‌, నటి, టీవీ వ్యాఖ్యాత మందిర బేడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో ఆమె హవా మాములుగా లేదు. ఆమె స్వరం, నటనతో వేలాది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ మందిరా బేడి. ఐదు పదుల వయసులోనూ యువ హీరోయిన్‌ మాదిరి ఆహార్యంతో..ఆకర్షణీయమైన లుక్‌తో అలరిస్తుంటుందామె. ఇంతలా హెల్దీగా, యంగ్‌గా ఉండటానికి గల రీజన్‌ గురించి హెర్బాలైఫ్ పాడ్‌కాస్ట్‌ వెల్లడిస్తూ..తన బ్యూటీసీక్రెట్‌ని షేర్‌ చేసుకున్నారామె.మరి అవేంటో తెలుసుకుందామా..!.

మందిరా తన వయసు గురించి చెప్పడానికి అస్సలు భయపడనని, కానీ ఆహార్యం పరంగా యంగ్‌గానే కనిపిస్తానని అన్నారామె. అందరు కదలిక ఓ మెడిసిన్‌, వ్యాయామం ఓ ఔషధ అని అంటుండటం వినేదాన్ని. కానీ అది తన విషయంలో నిజమైందని అంటోందామె. వ్యాయామం ఒక్కటే ప్రజలను అనారోగ్యం బారినపడకుండా చేస్తుందని, అదొక సప్లిమెంట్‌గా అభివర్ణించింది. అన్ని సమస్యలకు వ్యాయామం అద్భుతమైన నివారిని అని నమ్మకంగా చెబుతోందామె. 

అంతేగాదు 50లలో అధిక బరువు శిక్షణ తప్పనిసరి అని అంటోందామె. ఎందుకంటే..ఆ సమయంలో వృద్ధాప్యం మనలోకి ఎంటర్‌ అవుతుంటుంది. కాబట్టి ఆ టైంలో ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం, అదీగాక శారీరక క్షీణతకు దారితీసే సమయం కూడా అదే. అందువల్ల బలశిక్షణ శరీరానికి ఎంతో అవసరమని అన్నారు. ఇది మనకు శక్తిమంతమైన మార్పుతో పాటు, మన కండరాలను బలోపేతం చేస్తాయని చెబుతోంది. 

అంతేగాదు వర్కౌట్‌లు శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యద్భుతమైనవని అన్నారు. దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో హెల్ప్‌ అవుతాయని అన్నారు. అయితే దీన్ని తీవ్రంగా భయపెట్టేలా చెయ్యొద్దని చెప్పారామె. ఇష్టంతో..స్వాంతన చేకూరేలే చేయాలి. అప్పుడే వృద్ధాప్యాన్ని ధీమాగా తిప్పికొట్టగలమని అన్నారామె. అంతేగాదు ఈ ఏజ్‌లో నిరంతర సంరక్షణ, నిబద్దతతో చేసే రోజువారీ వ్యాయామాలు మన ఆయుష్షుకి శ్రీరామరక్ష అని చెబుతున్నారు మందిరా బేడి. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్‌ పేరెంటింగ్‌ స్టైల్‌)
 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)