ఆమె నమ్మకమే కాపాడింది..! తృటిలో బయటపడ్డ పహల్గామ్‌ పర్యాటకుడి ఫ్యామిలీ

Published on Wed, 04/30/2025 - 13:28

ఆ పహల్గాం దారుణ ఘటన ప్రత్యక్షంగా చూసిన పర్యాటకులెవ్వరికీ కంటిమీద కునుకుపట్టనివ్వడం లేదు. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టి..బతికే ఉన్నామా..! అనే ఆందోళనలకు లోనవ్వుతున్నారు. ఆ ఘటనలో తమవాళ్లను తమ కళ్ల ముందే చంపేస్తున్న హృదయవిదారక దృశ్యాలు కనులముందు మెదులుతూనే ఉన్నాయంటున్నారు కొందరు బాధితులు. వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలు వింటున్న మనకే గుండె తరుక్కుపోతుంటే..ఇక ఆ బాధితులకు బాధ వర్ణనాతీతమే. ఇప్పట్లో దాన్నుంచి బయటపడటం కూడా కష్టమే. అయితే ఇదే దుర్ఘటనలో వెంట్రుకవాసిలో ఓ కుటుంబం సురక్షితంగా బయటపడింది. వాళ్ల భయానక అనుభవం వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ స్టోరీ ఏంటో చకచక తెలుసుకుందామా..!

కర్ణాటక చెందిన ప్రదీప్ హెగ్డే,అతని భార్య శుభ హెగ్డే, వారి కుమారుడు సిద్ధాంత్ ఏప్రిల్‌ 21న శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఆ మరుసటి రోజు పహల్గామ్‌కు బయలుదేరారు. ఆ కుటుంబం టూర్‌లో 'మినీ స్విట్జర్లాండ్'గా ప్రసిద్ధి చెందిన బైసరన్ ఉంది. అందుకోసం మూడు గుర్రాలు అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు రోడ్డంతా భయానకంగా, బురదగా జారేలా ఉండటంతో. పైకి చేరుకోవడానికి ఒక గంట 15 నిమిషాలు పట్టేసిందట వారికి. అయితే అప్పటికే కొంతమంది పర్యాటకుల గుంపు ఉంది. 

ఇక ప్రదీప్‌ హెగ్డే కుటుంబం కూడా వారితో జాయిన్‌ అవ్వాలనుకున్నారు. అయితే రైట్‌సైడ్‌ జిప్‌లైన్ ప్రారంభమయ్యే చోట ఖాళీ ప్రాంతం ఉండటంతో అక్కడే పోటోలు తీస్తూ.. గడిపిందట ఆ కుటుంబం. ఆ తర్వాత కొంతసేపటికి లోయలోని సాహస కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతం వైపు  ఉన్న స్టాళ్లువై పుగా సాగారు. సరిగ్గా అప్పటికే మధ్యాహ్నం 1.45 అయ్యింది. వాళ్ల కుమారుడు సిద్ధాంత్‌ ఆకలిగా ఉందని గొడవ చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు ప్రదీప్‌. 

నచ్చచెబుతున్నా.. వినకపోవడంతో చేసేదేమి లేక ఇక అక్కడ ఓ స్టాల్‌ వద్ద మ్యాగీ ఆర్డర్‌ చేశామని అన్నారు. ఇక తన భార్య ఈలోగా వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చిందన్నారు. సరిగ్గా ఆ టైంలోనే ఒక రౌండ్‌ కాల్పులు వినిపించాయి. అప్పుడే టీ కూడా ఆర్డర్‌ చేసినట్లు తెలిపారు ప్రదీప్‌. 

అయితే అవి క్రాకర్ల శబ్దాలు కావచ్చని దుకాణ యజమాని చెప్పడంతో తేలిగ్గా తీసుకున్నామని చెప్పారు ప్రదీప్‌. పైగా అవి బుల్లెట్‌ శబ్దాలని మాకస్సలు తెలియదని అన్నారు. ఇక సుమారు 15-20 సెకన్ల తర్వాత, పెద్ద తుపాకులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులను చూశామన్నారు. అందులో ఒక ఉగ్రవాది లోయ దిగువ భాగం వైపు వెళ్తుండగా, మరొక ఉగ్రవాది తమ వైపుకి దూసుకు వస్తున్నాడంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు ప్రదీప్‌. 

వెంటనే తమ కుటుంబం అంతా నేలపై పడుకుని ఉన్నాం. ఇంతలో తన భార్య టేబుల్‌పై తమ ఐడెంటిలన్నీ ఉన్న బ్యాగ్‌ని తీసుకునేందుకు పైకి లేచింది. అంతే ఒక తూటా ఆమె కుడి చెవి నుంచి దూసుకుపోయింది. అయితే ఆమె వంగడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. 

ఇక ప్రదీప్‌ భార్య శుభ హెగ్డే కూడా మాట్లాడుతూ..తన వెంట్రుకలను రాసుకుంటూ ఏదో వెళ్తున్నట్లు అనిపించిందన్నారు. ఏంటా అని పక్కకు చూసేంతవరకు తెలియలేదు అది బుల్లెట్‌ అని అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఒక్క క్షణం అసలేం జరగుతుందో అర్థంకానీ భయాందోళన ఎదురైంది. ఇంతలో ఎవరో గట్టిగా అరిచి గేటువైపుకి పరిగెత్తమని చెప్పారు. 

నూరుశాతం చనిపోతామనే అనుకున్నాం..
అదంతా చూశాక కచ్చితంగా తన కుటుంబం అంతా చనిపోతుందనే అనుకున్నానని అన్నారు ప్రదీప్‌. అయితే తన భార్య మాత్రం ఏం జరగదు  అని ధైర్యం చెబుతూనే ఉంది. నిజానికి ఆమె నమ్మకమే మమ్మల్ని కాపాడింది. అక్కడున్న పర్యాటకులంతా ఒకేసారిగా గేటు వద్దకు వచ్చేయడంతో తమ కొడుకు కింద పడిపోయాడన్నారు. 

అలా బయటకు వచ్చాక ఎటు వెళ్లాలి అనేది తెలియని గందరగోళానికి గురయ్యాం. గుర్రపుస్వారీ సైనికులు కనిపంచడంతో వాళ్లని రక్షించమని ప్రాధేయపడినట్లు చెప్పుకొచ్చారు. వాళ్లు మాకు రెండు గుర్రాలని అందించి కిందకు వచ్చేందుకు సహాయం చేశారంటూ ఆ బాధకరమైన అనుభవాన్ని వివరించారు ప్రదీప్‌ హెగ్డే. 

ఆ  పర్యాటకుడి అనునభవం విపత్కర పరిస్థితుల్లో మసులుకోవాల్సిన విధానం తోపాటు..ఒకరు భయపడుతుంటే మరొకరు ఎలా సానుకూలంగా వ్యవహరించాలో చెబుతోంది. ఆ పరిస్థితుల్లో శుభా హెగ్డేలా ఏదో రకంగా ధైర్యం చెప్పాలే కానీ బ్యాలెన్స్‌ తప్పకూడదు. ఆ దృక్పథమే మనల్ని ఆపద నుంచి గట్టేక్కేలా చేస్తుందనడానికి ఆ పర్యాటకుడి కుటుంబమే ఓ ఉదహరణ. 

(చదవండి: పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)