Breaking News

అకాల వర్షాలు, అన్నదాతకు అంతులేని శోకం

Published on Fri, 05/09/2025 - 13:03

సాక్షి, ముంబై: జల్గావ్‌ జిల్లాలో మంగళవారం కురిసిన వడగళ్ల వానలు, తుఫానుల గాలులు, అకాల వర్షాల ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం 7,235 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, 4,279 హెక్టార్లలో విస్తరించి ఉన్న అరటి తోటలు నేలమట్టమయ్యాయి. తీవ్ర పంటనష్టంతో రైతులకు ఆరి్థకంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని జిల్లా వ్యవసాయ సూపరింటెండెంట్‌ కార్యాలయం తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, భారీ వర్షాలు జిల్లాలోని 14 తాలూకాలలో పంటలను ప్రభావితం చేశాయి. అమల్నేర్‌ మినహా మిగిలిన అన్ని తాలూకాల్లో వడగళ్ల వానలు బొప్పాయి, మొక్కజొన్న, జొన్న, మిల్లెట్, ఉల్లిపాయ, బీన్స్‌ పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క జల్గావ్‌ తాలూకాలోనే అత్యధికంగా 1,320 హెక్టార్లలో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. చోప్డాలో 663 హెక్టార్లు, రావర్‌లో 519 హెక్టార్లు, యావల్‌లో 436 హెక్టార్లు, ఎరండోల్‌లో 254 హెక్టార్లు, ముక్తాయ్‌నగర్‌లో 250 హెక్టార్ల మేర నష్టం వాటిల్లింది. అలాగే 717 హెక్టార్లలో మొక్కజొన్న, 507 హెక్టార్లలో మినుములు, 214 హెక్టార్లలో జొన్న, 301 హెక్టార్లలో ఉల్లిపాయ, 249 హెక్టార్లలో బొప్పాయి, 751 హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 

ఇక, ధరణగావ్‌ తాలూకాలోని ఎక్లగ్న బుద్రుక్‌ గ్రామంలో పిడుగుపాటుకు రెండు గేదెలు మతి చెందగా, చోప్డా తాలూకాలోని పుంగావ్‌ గ్రామంలో యువరాజ్‌ బావిస్కర్‌ అనే రైతు గేదెపై చెట్టు పడటంతో మరణించిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపరిహారం కోసం ప్రధాన్‌ మంత్రి ఫసల్‌ బీమా యోజన కింద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సూపరింటెండెంట్‌ ఖుర్బాన్‌ తడ్వి సూచించారు.

ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 14447 లేదా వాట్సాప్‌ నంబర్‌ 7065514447 ను సంప్రదించవచ్చని తెలిపారు.  

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)