Breaking News

Heat : మహిళల్లో పెరుగుతున్న యూరిన‌రీ ట్రాక్ట్ ఇన్ఫెక్ష‌న్లు (UTI)

Published on Thu, 05/29/2025 - 17:01

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీల సెల్సియ‌స్ దాట‌డంతో..  మ‌హిళ‌ల్లో యూరిన‌రీ ట్రాక్ట్ ఇన్ఫెక్ష‌న్లు (urinary tract infection) (యూటీఐ) పెరుగుతున్నాయి. బ‌య‌ట విప‌రీత‌మైన వేడి, డీహైడ్రేష‌న్‌, జీవ‌న‌శైలి అల‌వాట్ల నేప‌థ్యంలో ఇలాంటి ఇన్ఫెక్ష‌న్లు త‌ర‌చు సంభ‌విస్తున్న‌వారు ఆరోగ్యాన్ని ఆయా సీజ‌న్ల‌లో జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ)కు చెందిన మ‌హిళా యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ సారికా పాండ్యా తెలిపారు.

“ఈ సీజ‌న్‌లో ప్ర‌తి 10 మంది మ‌హిళ‌ల్లో ముగ్గురికి యూటీఐ బారిన పడుతున్నారు. ఇదే సంవ‌త్స‌రం మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే ఇది ఎక్కువ‌గానే ఉంది” అని డాక్ట‌ర్ సారిక చెప్పారు.

వేస‌వితో సంబంధ‌మేంటి
శారీర‌కంగా చూసిన‌ప్పుడు మ‌హిళ‌ల‌కు మూత్ర‌నాళం చిన్న‌గా ఉండ‌డంతో వారికి యూటీఐ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌. అయితే వేస‌విలో ముప్పు కార‌కాలు మ‌రింత అధికంగా ఉంటాయి. “డీహైడ్రేష‌న్ ప్ర‌ధాన కార‌ణం. మ‌హిళ‌ల‌కు చెమ‌ట‌లు ఎక్కువ‌గా ప‌డుతుంటాయి, అదే స‌మ‌యంలో త‌గినంత నీళ్లు తాగ‌రు. దానివ‌ల్ల మూత్రం బాగా చిక్క‌గా అవుతుంది. ఇది ఒక‌ర‌క‌మైన తేమ వాతావ‌ర‌ణాన్ని సృష్టించి, బ్యాక్టీరియా పెరిగేందుకు కార‌ణ‌మ‌వుతుంది. ఈత‌కొల‌నులో ఎక్కువ‌సేపు త‌డి దుస్తుల‌తో ఉండ‌డం, బాగా బిగుతుగా ఉండే దుస్తులు ధ‌రించ‌డం, ప్ర‌యాణాలు లేదా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మూత్రం వ‌చ్చినా ఎక్కువ‌సేపు ఆపుకోవ‌డం వ‌ల్ల యూటీఐ లాంటి ఇన్ఫెక్ష‌న్లు పెరుగుతాయి” అని డాక్ట‌ర్ పాండ్యా వివ‌రించారు.

గ‌మ‌నించాల్సిన ల‌క్ష‌ణాలు
“యూటీఐ ల‌క్ష‌ణాల‌లో ముఖ్యంగా మూత్ర‌విస‌ర్జ‌న స‌మ‌యంలో మంట‌పుట్ట‌డం, త‌ర‌చు మూత్రానికి వెళ్లాల‌నిపించ‌డం, మూత్రం దుర్వాస‌న రావ‌డం, పొత్తిక‌డుపులో అసౌక‌ర్యం, నీర‌సం లాంటివి ఉంటాయి. ఈ ల‌క్ష‌ణాలు ఏమైనా ఒక రోజుకంటే ఎక్కువ ఉంటే సొంత మందులు వాడ‌కుండా వెంట‌నే వైద్యుల వ‌ద్ద‌కు వెళ్లాలి. ముంద‌స్తు ల‌క్ష‌ణాలను నిర్ల‌క్ష్యం చేస్తే కిడ్నీ ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి. ముఖ్యంగా మ‌ధుమేహ బాధితులు, రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు మ‌రింత జాగ్ర‌త్త‌ప‌డాలి” అని ఆమె చెప్పారు.

వేస‌విలో జీవ‌న‌శైలి స‌మ‌స్య‌లు
వేస‌వికాలంలో కొన్నిర‌కాల ప్ర‌వ‌ర్త‌న‌ల వ‌ల్ల యూటీఐ ముప్పు పెరుగుతంద‌ని డాక్ట‌ర్ సారికా పాండ్యా అన్నారు. “ప్ర‌ధానంగా.. ఈత‌దుస్తుల్లో ఎక్కువ‌సేపు ఉండిపోతే బ్యాక్టీరియా పెరుగుతంది. బిగుతుగా ఉండే దుస్తులు ధ‌రిస్తే ముఖ్యంగా లోప‌లి భాగాల్లోవేడి, చెమ‌ట ఎక్కువ‌వుతాయి. మ‌హిళ‌లు బ‌య‌ట ఉండే మ‌రుగుదొడ్లు ఉప‌యోగించ‌రు. మూత్రాన్నిఎక్కువ‌సేపు ఆపుకోవ‌డం ప్ర‌మాద‌క‌ర‌మైన అల‌వాటు. కాట‌న్ లోదుస్తులు ధ‌రించ‌డం, త‌ర‌చు మూత్రానికి వెళ్ల‌డం, ముఖ్యంగా లైంగిక చ‌ర్య త‌ర్వాత‌, అలాగే ఎక్కువ‌సేపు బ‌య‌ట ఉన్న త‌ర్వాత వెళ్ల‌డం అవ‌స‌రం” అని వివ‌రించారు.

నీళ్లు తాగ‌డం, ప‌రిశుభ్ర‌త‌, ఆహారం
యూటీఐని నివారించ‌డానికి సుల‌భ‌మైన మార్గం.. నీళ్లు తాగ‌డ‌మేన‌ని డాక్ట‌ర్ పాండ్యా చెప్పారు. “తాగ‌గ‌లిగిన‌న్ని ద్ర‌వాలు తాగండి. దానివ‌ల్ల మూత్రం రంగు సాధార‌ణంగా ఉంటుంది. తీపి పానీయాలు, కెఫిన్ వాడ‌కూడ‌దు. అవి తాగితే బాగున్న‌ట్లు అనిపిస్తుంది గానీ, బ్లాడ‌ర్‌ను అవి ఇరిటేట్ చేస్తాయి. ఆహారంలో కూడా యూటీఐని నియంత్రించేవి తీసుకోవాలి. క్రాన్‌బెర్రీ జ్యూస్ లేదా టాబ్లెట్ల వ‌ల్ల బ్లాడ‌ర్ గోడ‌ల‌కు బ్యాక్టీరియా అతుక్కోకుండా ఉంటుంది. అవి రాకుండా ఆపుతాయి. ఒక‌సారి ల‌క్ష‌ణాలు మొద‌ల‌య్యాక వాటిమీద ఆధార‌ప‌డ‌కూడ‌దు” అన్నారు.  

చికిత్స‌, దీర్ఘ‌కాల నిర్వ‌హ‌ణ‌
త‌ర‌చు ఇన్ఫెక్ష‌న్లు వ‌చ్చే మ‌హిళ‌ల‌కు త‌క్కువ మోతాదులో యాంటీబ‌యాటిక్స్, మెనోపాజ్ ద‌శ దాటిన మ‌హిళ‌ల‌కు వెజైన‌ల్ ఈస్ట్రోజ‌న్ ఇస్తామ‌ని, అలాగే.. త‌గిన స‌మ‌యానికి మూత్ర‌విస‌ర్జ‌న చేయ‌డం చాలా ముఖ్య‌మ‌ని డాక్ట‌ర్ సారిక తెలిపారు. కొంద‌రికి లైంగిక చ‌ర్య త‌ర్వాత యాంటీబ‌యాటిక్స్ వేసుకోవ‌డం, లేదా సొంత మందుల‌తో కొంత ఉప‌శ‌మ‌నం ఉండ‌చ్చు. కానీ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే మందులు వాడాలి. యాంటీబ‌యాటిక్స్‌తో త‌గ్గించ‌డం కంటే దీర్ఘ‌కాలం పాటు రాకుండా చూసుకోవ‌డం, శ‌రీర ల‌క్ష‌ణాలు గ‌మ‌నించ‌డం ముఖ్యం” అని ఆమె సూచించారు.

అవ‌గాహన ముఖ్యం
యూటీఐల విష‌యంలో చాలామందిక అవ‌గాహ‌న ఉండ‌ట్లేద‌ని, పైగా అపోహ‌లు ఉంటున్నాయ‌ని డాక్ట‌ర్ సారికా పాండ్యా తెలిపారు. “హైద‌రాబాద్‌లో చాలామంది మ‌హిళ‌లు లైంగిక‌చర్య వ‌ల్లే యూటీఐ వ‌స్తుంద‌నుకుంటున్నారు. ఇంటి చిట్కాల‌తో దాన్ని క‌డిగేయొచ్చ‌ని కూడా భావిస్తున్నారు. మ‌రికొంద‌రు దానిగురించి బ‌య‌ట‌కు మాట్లాడేందుకు ఇబ్బంది ప‌డుతున్నారు. పాఠ‌శాల‌లు, క్లినిక్‌ల లాంటిచోట్ల ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ముఖ్యం. మ‌నం పోష‌కాహారం గురించి, రుతుక్ర‌మ శుభ్ర‌త గురించి మాట్లాడిన‌ట్లే యూరిన‌రీ ఆరోగ్యం గురించి చ‌ర్చ‌ను కూడా సాధార‌ణం చేయాలి” అని చెప్పారు.
 

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)