Breaking News

కలర్‌ఫుల్‌.. సిబ్లింగ్స్‌ వాక్‌..!

Published on Wed, 04/23/2025 - 14:41

సాక్షి, సిటీబ్యూరో: ఎన్ని బంధాలున్నా తోబుట్టువుల అనుబంధం, ప్రేమ ప్రత్యేకమైనవి. జన్మతో సహా కలిసొచ్చే బంధం ఇది. ఇంతటి గొప్ప అనుబంధాన్ని, ఆప్యాయతను అంతే చక్కగా ప్రదర్శించింది కూకట్‌పల్లి అశోక వన్‌ మాల్‌ వేదికగా నిర్వహించిన ది సిబ్లింగ్స్‌ కిడ్స్‌ ఫ్యాషన్‌ వాక్‌. అశోక డెవలపర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో ఆత్మవిశ్వాసంతో, అందమైన నడకతో, ఆకర్షణీయమైన దుస్తులను ధరించి తమ విశిష్టతను ప్రదర్శించారు పలువురు చిన్నారులు. ఈ కార్యక్రమం ఫ్యాషన్‌ భాగస్వామి అయిన రిలయన్స్‌ ట్రెండ్స్‌.. ఫ్యాషన్‌ వాక్‌లో పాల్గొన్న పిల్లలందరికీ ఆకర్షణీయమైన దుస్తులను అందించింది. అదనంగా మేక్‌ మై హోమ్, డెకథ్లాన్‌ సంస్థతో కలిసి ఈ చిన్నారులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా అశోక డెవలపర్స్‌ అండ్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.జైదీప్‌ రెడ్డి మాట్లాడుతూ.. తమ పరిసరాల్లోని కుటుంబాలతో బంధం ఏర్పరచుకోడానికి, షాపింగ్‌ చేయడానికి, ఆనందించడానికి అవకాశాలను సృష్టించడానికి అశోక వన్‌ మాల్‌ సిబ్లింగ్స్‌ కిడ్స్‌ ఫ్యాషన్‌ వాక్‌ నిర్వహించామని, ఈ కార్యక్రమం తోబుట్టువుల సంబంధాల గొప్పతనాన్ని ప్రదర్శించిందని అన్నారు.

నెహ్రూ జూలాజికల్‌ పార్కులో  సమ్మర్‌ క్యాంప్‌
చార్మినార్‌: వేసవి సెలవులను పురస్కరించుకుని మే నుండి జూన్‌ వరకూ నెహ్రూ జూలజికల్‌ పార్కులో సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మర్‌ క్యాంపులో పాల్గొనడానికి ఔత్సాహికులైన విద్యార్థులు రూ.1000 రిజి్రస్టేషన్‌ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌ వన్యప్రాణుల జూ ఉత్సాహవంతులైన పిల్లలను వేసవి శిబిరంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తోందన్నారు. ప్రతి రోజూ బ్యాచ్‌ల వారీగా నిర్వహించే ఈ వేసవి క్యాంపులో ప్రతి బ్యాచ్‌కూ 15 నుండి 20 మంది విద్యార్థులు ఉంటారన్నారు. 

ఈ వేసవి శిబిరంలో జూ పార్కుకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు జూ టూర్, జూ పార్కులోని జంతువుల చరిత్ర, సమాచారం తెలుసు కోవడం, సరీసృపాలపై అవగాహన సెషన్, రాత్రి గుహ సందర్శన, ఇతర సరదా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనుభవజ్ఞులైన వన్యప్రాణుల విద్యావేత్తల నేతృత్వంలో ప్రతి బ్యాచ్‌కూ ప్రతి రోజూ అవగాహన  కల్పించనున్నట్లు తెలిపారు.  రిజిస్ట్రేషన్‌ ఛార్జీల కింద చెల్లించే రూ.1000లో స్నాక్స్, శాఖాహార భోజనంతో పాటు అభ్యర్థులకు క్యాప్, క్యాప్, నోట్‌ ప్యాడ్, జూ బ్యాడ్జ్, హైదరాబాద్‌ జూ లోగోతో కూడిన కిట్‌ అందిస్తారన్నారు. ఈ సమ్మర్‌ క్యాంపులో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకూ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌  అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలన్నారు. 040–2447 7355లో గానీ, 92810 07836 వాట్సాప్‌ నెంబర్‌లో గానీ సంప్రదించాలన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)