Breaking News

చలికాలం... ఫుడ్‌ విషయంలో జాగ్రత్త!

Published on Wed, 12/24/2025 - 11:32

గజగజలాడించే చలికాలంలో... ఎప్పుడూ వేడివేడిగా, మసాలాలు బాగా దట్టించిన ఫుడ్‌ తినాలని అనిపిస్తూంటుంది. చలి కాబట్టి దాహం కూడా అనిపించదు.  చాలామంది వేడివేడి కాఫీ, టీలతోనే గడిపేస్తూంటారు. అయితే చలికాలంలో ఇలాంటి అలవాట్లు అస్సలు మంచివి కావంటున్నారు వైద్యులు. గరం గరం ఆహారం, కాఫీ, టీలు.. జిహ్వ రుచికి హాయినిచ్చినా.. ఆరోగ్యానికి మాత్రం అస్సలు సరిపడవని అంటున్నారు. అందుకే ఈ వింటర్‌ సీజన్‌లో ఫుడ్‌ విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో చూద్దామా..

ఈ చలికాలంలో సమతుల్య ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు ఈ కాలంలో తీసుకునే ఆహారం, రోగనిరోధక వ్యవస్థను, జీర్ణక్రియ, చర్మపరిస్థితి, శక్తిస్థాయిలు, హార్మోన్‌ సమతుల్యతకు అనుగుణమైన పోషకవంతమైన ఆహారమే తీసుకోవాలని చెబుతున్నారు. 

తప్పనిసరిగా తినాల్సినవి..

  • ఈ కాలంలో సూప్‌లు, కిచిడి, పప్పులు, తృణధాన్యాల గంజి, తదితరాలు శరీరాన్ని వెచ్చగా ఉండచడమే కాకుండా, తగిన ఫైబర్‌ కూడా పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు. 

  • అల్లం, పసుపు, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి సుగంధద్రవ్యాలు పోషకవిలువను తగ్గించవు, వణికించే చలిని తట్టుకునేందుకు ఉపకరిస్తాయి కూడా. 

  • చలికాలం అని చాలామంది పండ్లు, కూరగాయల వినియోగాన్ని పరిమితం చేస్తారు. ఇది మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, పోషకాల కొరతకు దారితీస్తుందట. నిజానికి ఈ కాలంలో లభించే పళ్లను తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందట

  • తేలికగా వేయించిన ఆకుకూరలు, కాల్చిన దుంపలు, పండ్లు తదితరాల్లో ఫైబర్‌లు, యాంటిఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. పైగా జీర్ణక్రియకు మద్దతిస్తాయి. 

  • అంతేకాకుండా ఈ కాలంలో సిట్రస్ పండ్లు, ఆపిల్స్, జామ వంటవి రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా ఉంచడంలో హెల్ప్‌ అవుతాయట

  • ఇక 30 ఏళ్ల దాటిన మహిళలు, పెద్దల్లో కండరాల అలసట, ఆకలి పెరగడం, జుట్టు రాలడం, జీర్ణక్రియ నెమ్మదించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి తీసుకునే ఆహారం కచ్చింగా పోషకవంతమైనేద తీసుకుంటే మేలు. 

  • పప్పులు, పన్నీర్, గుడ్లు, టోఫు, పెరుగు, నట్స​, చేపలు,  లీన్ మాంసాలు తదితరాలు ఆరోగ్యానికి మంచివే కాకుండా పోషక స్థిరత్వాన్ని అందించి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా చేస్తాయట. 

  • ఈ కాలంలో హైడ్రేషన్‌ సమస్య ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఈ కాలంలో దాహం వేయదు, అందులోనూ చలికాలం కావడంతో పరిమితంగానే నీటిని తీసుకుంటారు అందువల్ల ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు. 

  • ఈ సీజన్‌లో స్వీట్స్‌ ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు, మానసిక స్థితిపై గట్టి ప్రభావం చూపిస్తాయట. 

  • స్వీట్స్‌కి ప్రత్యామ్నాయంగా సహజంగా లభించే తియ్యటి పండ్లు, ఖర్జురం, బెల్లం లేదా డార్క్‌ చాక్లెట్లు తీసుకుంటే మేలు

  • చాలామంది కొవ్వులను అనారోగ్యకమరని తప్పుగా అపోహపడుతుంటారు. అయితే వింటర్‌లో ఆరోగ్యకరమైన కొవ్వలు హార్మోన్ల ఉత్పత్తికి, చర్మపరిస్థితికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రకు ముఖ్యమైనవట. 

  • ఈ సమయంలో నెయ్యి, ఆలివ్‌ నూనె, నట్స్‌, అవకాడోలు, కొవ్వుచేపలను పరిమిత క్వాంటిటీలో తీసుకుంటే మంచిదట. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మంచివని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: Best Brain Boosting Foods: బ్రెయిన్‌కు మేలు చేసే ఆహారాలు..!)

 

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)