Breaking News

వయసు పైబడితే..నీళ్లు తాగేటప్పుడు జర భద్రం..!

Published on Thu, 07/16/2026 - 17:29

ఒక అరవై ఏళ్లుపై బడ్డ సీనియర్ సిటిజన్ రాత్రి 11:00 గంటలకు ఒక గ్లాసు నీళ్లు తాగుతూ ఊపిరాడక అవస్థ పడ్డాడు. సకాలంలో ఆస్పత్రికి తరలించినప్పటికీ..ఆయన మరణించారు. ఇలాంటివి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకు గల కారణం, ఎలాంటి జాగ్రత్తు తీసుకుంటే మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

ఇలాంటి ఘటనలు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే వయసు పైబడిన వారు జీవితంలో ఏ పని చేసినా, ముఖ్యంగా ఈ రెండు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అవేంటంటే..

పడకుండా జాగ్రత్తపడటం (Prevent Falling)
​గొంతుకు అడ్డం పడకుండా (దండుపోకుండా) చూసుకోవడం (Prevent Choking)

​60 ఏళ్లు దాటితే..ఈ అలవాట్లను అలవర్చుకోవాలి..

​నీళ్లు తాగేటప్పుడు:
​మిగతా పనులన్నీ పక్కన పెట్టి, పూర్తి శ్రద్ధతో నీటిని నెమ్మదిగా, జాగ్రత్తగా తాగాలి. వృద్ధులలో గొంతు మింగడానికి సహాయపడే కండరాలు బలహీనపడటం వల్ల గొంతుకు అడ్డం పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 

అలాగే ​నీరు, పాలు, సూప్ వంటి ద్రవపదార్థాలు గొంతుకు అడ్డం పడటం వల్ల వృద్ధులలో 'ఆస్పిరేషన్ న్యుమోనియా' (Aspiration Pneumonia) వచ్చే అవకాశం చాలా ఎక్కువ.

ఇంట్లో వృద్ధులు ఉంటే గమనించాల్సిన ముఖ్య విషయాలు:

స్ట్రా (Straw) ఉపయోగించండి: వీలైనంత వరకు నీళ్లు తాగడానికి స్ట్రా ఉపయోగించండి. అలాగే నీటిని మింగేటప్పుడు తల కొద్దిగా దించి (క్రిందికి వంచి) మింగాలి.

చిక్కటి సూప్‌లు ఇవ్వండి: పల్చటి సూప్‌ల కంటే చిక్కటి (Thick) సూప్‌లు ఇవ్వడం మంచిది. పల్చటి ద్రవాలు నోట్లోకి వేగంగా ప్రవహిస్తాయి, దీనివల్ల శ్వాస తీసుకోవడంలో స్వల్ప తేడా వచ్చినా వెంటనే గొంతుకు అడ్డం పడతాయి.

నోట్లో ఆహారం ఉన్నప్పుడు నీళ్లు వద్దు: నోట్లో ఘనపదార్థం (అన్నం లేదా టిఫిన్) నములుతున్నప్పుడు లేదా నోట్లో ఆహారం ఉన్నప్పుడు ద్రవపదార్థాలు తాగకూడదు. నీరు నోటిలో ఎక్కువసేపు ఉండిపోతే, అది తెలియకుండానే శ్వాసనాళంలోకి (Trachea) వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

మాట్లాడటం లేదా తల తిప్పడం చేయకూడదు: నోట్లో అన్నం లేదా నీళ్లు ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు, అలాగే అటు ఇటు తల తిప్పకూడదు.

శారీరక బలం తక్కువగా ఉంటుంది: యువకులకు ఉన్నంత శారీరక శక్తి, తట్టుకునే సామర్థ్యం వృద్ధులకు ఉండవు.

ఒకవేళ ఏదైనా ద్రవం లేదా ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లి, దాన్ని బయటకు దగ్గడానికి ప్రయత్నించినప్పుడు ముఖం ఎర్రగా మారిపోతుంది. అలాగే రక్తపోటు (Blood Pressure) అకస్మాత్తుగా పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ ఊపిరి ఆడకపోవడం ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల వయసు పెరుగుతున్న కొద్దీ నీటిని నెమ్మదిగా, శ్రద్ధగా, జాగ్రత్తగా తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 
​(చదవండి: Sanjay Dutt: వైరల్‌ ఫ్లూలా భావించి..కేన్సర్‌తో పోరాడా..!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)