Breaking News

ఒక్కసారి సిజేరియన్‌..మళ్లీ అదేనా?

Published on Sun, 08/30/2026 - 11:28

నా మొదటి ప్రసవం సిజేరియన్‌ ద్వారా జరిగింది. ఇప్పుడు నాకు తొమ్మిదో నెల నడుస్తోంది. ఈసారి సాధారణ ప్రసవం అయితే త్వరగా కోలుకుంటానని, ఇద్దరు పిల్లలను చూసుకోవడం కూడా సులభంగా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉందా?
– రాధిక, నెల్లూరు. 

ఒకసారి సిజేరియన్‌  జరిగినంత మాత్రాన, తర్వాతి ప్రసవం కూడా తప్పనిసరిగా సిజేరియన్‌ ద్వారానే జరగాలనే నియమం లేదు. సరైన పరిస్థితులు ఉంటే, తర్వాతి గర్భంలో సాధారణ ప్రసవానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ ఇది ఒకే విధంగా సాధ్యం కాదు. మొదటి సిజేరియన్‌  ఎందుకు చేయాల్సి వచ్చింది, గర్భాశయంపై ఎలాంటి కోత పెట్టారు, ప్రస్తుతం తల్లికి లేదా బిడ్డకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా, మొదటిసారి సిజేరియన్‌  అయిన మహిళలు ఈసారి గర్భం చివరి దశలో సహజంగానే ప్రసవ నొప్పుల్లోకి వెళితే, కొందరిలో సాధారణ ప్రసవం విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. 

ఈ అవకాశం ఉండాలంటే మొదటి సిజేరియన్‌కు కారణం ఏమిటి, ప్రస్తుతం బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, తల్లికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నాయా, శరీర బరువు సరైన స్థాయిలో ఉందా వంటి అంశాలను పరిశీలిస్తారు. అయితే కొన్ని పరిస్థితుల్లో సాధారణ ప్రసవానికి ప్రయత్నించడం మంచిది కాదు. ఉదాహరణకు బిడ్డ ఎదుగుదలలో తీవ్రమైన సమస్యలు ఉండటం, తల్లికి అధిక రక్తపోటు లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండటం, బిడ్డ అడ్డంగా లేదా తల కిందికి కాకుండా వేరే స్థితిలో ఉండటం, మాయ కిందకు ఉండటం వంటి పరిస్థితుల్లో వైద్యులు సిజేరియన్‌ను సూచించవచ్చు. 

గర్భం ముప్పై ఎనిమిది వారాలు దాటిన తర్వాత తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా పరిశీలిస్తారు. బిడ్డ కదలికలు, గుండె స్పందన, ఎదుగుదల, ఇతర పరీక్షల ఫలితాలు అన్నీ సంతృప్తికరంగా ఉంటే కొంతకాలం వేచి చూసే అవకాశం గురించి వైద్యులు నిర్ణయిస్తారు. అయితే నిర్ణీత సమయానికి సహజంగా ప్రసవ నొప్పులు ప్రారంభం కాకపోతే, తదుపరి మార్గాల గురించి వైద్యులు వివరంగా చర్చిస్తారు. ఒకసారి సిజేరియన్‌ అయినవారిలో మందులు లేదా ఇంజెక్షన్ల ద్వారా ప్రసవ నొప్పులను ప్రారంభించడం కొన్ని సందర్భాల్లో ప్రమాదాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా గర్భాశయం చిట్లిపోయే ప్రమాదం ఉన్నందున, ప్రతి మహిళకు ఈ విధానం సరిపోదు. 

పరీక్షలో ప్రసవానికి అవసరమైన మార్గం అనుకూలంగా ఉంటే, మందులు కాకుండా ప్రత్యేక పద్ధతుల ద్వారా ప్రసవాన్ని ప్రారంభించే అవకాశాన్ని వైద్యులు పరిశీలించవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ సాధారణ ప్రసవానికి ప్రయత్నించడం సురక్షితం కాదని తేలితే, ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వారాల మధ్య ముందస్తుగా ప్రణాళిక ప్రకారం సిజేరియన్‌ చేయవచ్చు. తల్లి ఆరోగ్యంగా, ఇతర సమస్యలు లేకుండా ఉంటే కోలుకునే ప్రక్రియ కూడా సాధారణంగానే ఉంటుంది.

ముఖ్యంగా, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సౌకర్యాలు ఉన్న ఆసుపత్రిలోనే చేయాలి. ప్రసవ సమయంలో బిడ్డ గుండె స్పందనను నిరంతరం గమనించడం చాలా అవసరం. కాబట్టి మీ పరిస్థితిని బట్టి మీ వైద్యులతో అన్ని పరీక్షల ఫలితాలను చర్చించండి. సాధారణ ప్రసవం సాధ్యమేనా, లేక సిజేరియన్‌ సురక్షితమా అన్నది మీ ఆరోగ్యం, బిడ్డ పరిస్థితిని బట్టి నిర్ణయించాలి.
∙ 

Videos

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు

Photos

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)