TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు
Breaking News
ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!
Published on Thu, 04/17/2025 - 09:06
మా ఆయనకు 52 సం‘‘లు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. వృత్తిలో పెద్దగా సమస్య లేదు. కాని ఈ మధ్య రాత్రి నిద్రలో తన కాళ్ళతో నన్ను కొడుతున్నాడు. నిద్రలో కాళ్ళను గట్టిగా కదిలించడం, అప్పుడప్పుడు కేకలు వేయడం, కలలో ఎవరితోనో పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఉదయాన్నే లేచిన తరువాత అడిగితే రాత్రి జరిగిన విషయాలు ఏమి గుర్తులేవని అనడమే కాక, అసలు అలా చేయనే లేదని చెప్తున్నారు. మా ఇద్దరి వైవాహిక జీవితంలో వేరే ఏ సమస్యా లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. నాపైన కోపంతో పగలు నన్నేం అనలేక రాత్రి నిద్రలో నన్ను ఇబ్బంది పెడ్తున్నారేమోనని అనిపిస్తుంది. దీనికి తగిన పరిష్కారం చెప్పగలరు.
– వరలక్ష్మి, మహబూబ్ నగర్
మీ భర్త విషయంలో మీరు వివరించిన లక్షణాలు రాత్రి నిద్రలో కాళ్ళతో తన్నడం, కేకలు వేయడం, చేతులు కదిలించడం, పొద్దున దాని గురించి అసలేం గుర్తు లేకపోవడం... ఇవన్నీ ‘రెమ్ స్లీప్ బివేవియర్ డిజార్డర్’ అనే నిద్రకు సంబంధించిన రుగ్మతను సూచిస్తున్నాయి. ఈ సమస్యలో ఆ వ్యక్తి నిద్రదశలో కలల్లో వచ్చే విషయాలకు అనుగుణంగా వారికి తెలియకుండానే ఆ విధంగా ప్రవర్తిస్తారు.
సాధారణంగా కలలు వచ్చే సమయంలో మన శరీర కండరాలు అచేతనమై ఉంటాయి. కానీ పైన చెప్పిన సమస్య ఉన్న వారిలో అలా జరగక΄ోవడం వల్ల వారు విపరీతంగా కదలడం, కాళ్ళతో చేతులతో కొట్టడం చేస్తారు. మీరు వెంటనే మీ భర్తను ఒక న్యూరాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్ళి ‘స్లీప్ స్టడీ’ చేయించి ఈ రుగ్మతను నిర్ధారించుకోవాలి. కొన్ని మంచి మందులతో ఈ లక్షణాలను పూర్తిగా తగ్గించవచ్చు.
చికిత్స మొదలయ్యే వరకు మీ భద్రత కోసం మీరు వేరే బెడ్‌పై లేదా వేరే గదిలో నిద్రిస్తే మంచిది. ఆయన నిద్ర΄ోయే ముందు మద్యపానం, కాఫీ, సిగరెట్ లాంటివి తీసుకోకుండా చూడండి. అన్నిటికీ మించి ఇది ఆయన అదుపులో లేని ఒక వైద్యసమస్య అని గుర్తించండి. ఆయన్ని కోపగించుకోకుండా, అర్థం చేసుకొని వైద్య చికిత్స చేయించండి! అన్నీ సర్దుకుంటాయి. ఆల్ ది బెస్ట్!
(చదవండి: మంచి పనిచేశా..! భారత్‌పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..)
Tags : 1