మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
ఎంపీ సుప్రియా సూలే ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..! 50 ఏళ్ల వయసులోనూ..
Published on Fri, 09/04/2026 - 14:30
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే రాజకీయంగా సభలు,సమావేశాతో ఎంత బిజీగా ఉన్నా..తన పిట్‌నెస్‌కి సమయం కేటాయిస్తానని ఆమెనే స్వయంగా చెప్పారు. ఒక్కోసారి తన ఫిట్‌నెస్ మంత్రాని బ్రేక్ చేస్తానని కూడా నవ్వుతూ చెప్పారు. తను ఒక నాయకురాలిగా ఇంతలా బిజీగా ఉన్న అలసట అన్నది తన దరి చేరదని, ఎల్లప్పుడూ చురుకుగా ఉంటానని అన్నారామె. మరి అంతలా ఫిట్‌గా ఉండే ఆమె ఆరోగ్య రహస్యం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా
తాను బయటకు వెళ్లేటప్పుడు హాయిగా నడిచేలా షూ ధరిస్తానని చెప్పారామె. అలాగే బయటకు వెళ్లేటప్పుడు మరిగించిన వేడి నీళ్లు రెండు లీటర్లు తప్పనిసరి అని అంటున్నారామె. తనకు వీలు కుదిరితే సైక్లింగ్, యోగా తప్పనిసరి అని అన్నారామె. ఇవేమి కుదరదు అనుకుంటే వేగంగా నడుస్తానని చెప్పారామె. 50 ఏళ్ల వయసులోనూ ఆమె తరుచుగా చీరలోనే సైకిల్ తొక్కుతానని అన్నారామె. ఐదేళ్లక్రితం వరకు జిమ్‌కి వెళ్తుండేదాన్ని అన్నారు. కానీ ఇప్పుడు బయట ప్రదేశాల్లో వాకింగ్, జాగింక్‌కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే తనకొక చెడ్డఅలవాటు కూడా ఉందన్నారు. సదా ప్రచారాలు, బహిరంగ సమావేశాల కారణంగా తన పిట్‌నెస్ లక్ష్యం దెబ్బతింటుంటుందని అన్నారామె. ఆ ఒత్తిడిలో ఎక్కువగా తినేస్తుంటానని అన్నారామె. డైట్ కోక్ తాగనిదే రోజు గడవదని అన్నారు. అది తన బలహీనతగా పేర్కోన్నారు. అలాగే తాను ఇంటి నుంచి తీసుకెళ్లిన భోజనం తినని, సాధ్యమైనంత వరకు కార్యకర్తల ఇళ్లల్లోలేదా ధాబాలో భోజనం చేస్తుంటానని అన్నారు. తన భోజనంలో ఎక్కువుగా కూరగాయలు, మటన్ లేదా చికెన్, జోన్న భక్రీలు తీసుకుంటానని చెప్పారు.
అల్పాహరంగా పళ్లు, బాదం పప్పులు, చిరుతిండిగా రెండు రకాల బిస్కెట్లు తింటుంటానని అన్నారు. అలాగే తనకు వేయించిన ఆహారాలు మహా ఇష్టమని అన్నారు. అయితే టీ,కాఫీలకు మాత్రం బానిస కాలేదన్నారు. అలాగే తాను మంచి ఆహార ప్రియురాలినని, ఎంతలా అంటే మహారాష్ట్రలో ఎక్కడెక్కడ అద్బుతమైన ఫుడ్ దొరకుతుందో ఈజీగా చెప్పేయగలను, ఆ ప్రాంతాల్లో ఏం దొరుకుతుందో ఠక్కున చెప్పేస్తానని ధీమాగా చెబుతున్నారామె. అయితే తన దినచర్యలో నాణ్యమైన నిద్ర లేకపోవడం పెద్ద లోపమని అన్నారామె.
ఎందుకంటే ఇద్దరు పిల్లల తల్లిగా ఎప్పుడు ఎక్కువసేపు హాయిగా నిద్రపోయిన రోజు లేనే లేదని అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన ఆరోగ్య సూత్రాల ప్రకారం కూడా పెద్దలకు కనీసం ఏడు నుంచి 9 గంటలు నిద్ర ఉండాలని సూచించింది. ఇది నిజంగానే ఆమె ఎదుర్కొంటున్న కీలక లోపంగా పేర్కొన్నారు ఆరోగ్య నిపుణులు. ఫిట్‌నెస్ పరంగా మిగతావన్నీ సవ్యంగా ఉన్నా..నిద్ర అత్యంత కీలకమైనదని, దీనిపై మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
(చదవండి: ఆ కారణంతో బారత్‌లో జరగాల్సిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రద్దు..! వెల్లువెత్తున్న విమర్శలు)
Tags : 1