Breaking News

మధుమేహం మందులకు ప్రత్యామ్నాయంగా కాకరకాయను వాడొచ్చా..!?

Published on Mon, 06/29/2026 - 16:50

చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ దీర్ఘకాలిక వ్యాధి డయాబెటిస్‌ బారిన పడుతుండటం బాధకరం. ముఖ్యంగా సరైన ఆహరపు అలవాట్లు, జీవనశైలి లేమి కారణంగానే అధిక సంఖ్యలో ఈ వ్యాధి బారినపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇదంతా ఎందుకంటే చాలామంది మధుమేహానికి కారకరకాయ విరుగడని చాలామంది ఆయా మందులు తీసుకోవడం మానేస్తుంటారు. దీనిలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం ఉందని బలంగా విశ్వసిస్తారు చాలామంది. ఇదంత నిజమేనా అంటే..కాదనే చెబుతున్నారు ఏఐసి-ఎస్ఆర్ఎస్-ఐసిఎఆర్-ఎన్డిఆర్ఐ ఫౌండేషన్ డైరెక్టర్‌ ఆదర్శ గౌడ. మరి వాస్తవం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచగల సామర్థ్యం కాకరకాయకు ఉందని, ఇది గ్లూకోజ్‌ని ప్రాసెస్‌ చేసే విధానం అత్యంత విభిన్నంగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు ఆదర్శగౌడ. కానీ కొన్ని అధ్యయన ఫలితాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. మరి  ఏ కారణంగా కాకరకాయని షుగర్‌కు విరుగుడు అని ఎందుకు అంటున్నారంటే..

ఇందులో ఏం ఉంటాయంటే..

  • విటమిన్ సి

  • పీచుపదార్థం (ఫైబర్)

  • ఫోలేట్

  • పొటాషియం

  • యాంటీఆక్సిడెంట్‌లు

ఈ కాకరకాయలోని సమ్మేళనాలు గ్లూకోజ్‌ జీవక్రియపై ప్రభావవంతంగా పనిచేయడమే ప్రధాన కారణమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

కలిగే లాభాలు..
ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను కాపాడటంలో సహాయపడుతుంది
యాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థం అందిస్తుంది
సంపూర్ణ పోషణకు తోడ్పడుతుంది
తక్కువ కేలరీలు
సమతుల్య భోజనంలో సులభంగా చేర్చుకోవచ్చు

ఎలా తీసుకోవాలంటే..
సమతుల్య భోజనంలో భాగంగా, కాకరకాయను గుడ్లతో కలిపి వేయించుకుని, సూప్‌లలో కలుపుకుని, లేదా ఉల్లిపాయలు, వెల్లుల్లితో తేలికగా వేయించుకుని ఆస్వాదించొచ్చు.

అయితే కాకరకాయ శరీరంలో ఇన్సులిన్‌లాగా పనిచేయదని తేల్చి చెబుతున్నారు నిపుణులు. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ మధుమేహ మందులకు ప్రత్యామ్నాయంగా వాడకూడదు.

మధుమేహం ఉన్నా లేదా రక్తంలో చక్కెరను తగ్గించే మందులు వాడుతున్నా, కాకరకాయను రోజూ వాడే ముందు వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించి..తీసుకోవాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

(చదవండి: నెయిల్‌ ఆర్టిస్ట్‌గా నెలకు రూ. 10 లక్షలు..! కట్‌చేస్తే కొద్ది నెలల్లోనే..)

 

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీ‌వారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు)