Breaking News

జస్పాల్ రాణా మృతి: గుండెపోటు విషయంలో బహుపరాక్‌!

Published on Tue, 06/16/2026 - 18:01

భార‌త దిగ్గ‌జ షూట‌ర్‌, కోచ్ జ‌స్పాల్ రాణా శుక్ర‌వారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. నిజానికి ఆయన ప్రయాణంలో ఉండగానే.. ఆసుపత్రికి చేరుకునే ముందు కూడా ఛాతీ నొప్పి కొనసాగింది. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని స్థిరీకరించినప్పటికీ, గుండె పంపింగ్‌ సామార్థ్యం ఫెయిలై మృతి చెందారు. అంతేగాదు వైద్యులు ఆయన మరణం భారతదేశంలో మధ్య వయస్కులలో పెరుగుతున్న గుండె సంబంధిత మరణాలపై ఆందోళన రేకెత్తించింది. చాలామంది తేలిగ్గా కొట్టిపారేయడంతోనే ఆ టైంలో గోల్డెన్‌​ అవర్‌ని పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత సమస్యలను గోల్డెన్‌ అవర్‌లోనే గుర్తించి ఎలా ప్రాణాలు రక్షించుకోవాలో సవివరంగా తెలుసుకుందామా.

ప్రముఖ భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా విషాద మరణం, గుండెపోటు కేవలం వృద్ధులకు, అనారోగ్యవంతులకు మాత్రమే వస్తుందనే అపోహపై చర్చలను లేవనెత్తింది. వైద్యుల ప్రకారం, రాణాకు తెలియకుండానే మూడు రోజుల పాటు గుండెపోటుతో బాధపడ్డట్టు సమాచారం. ఆ తర్వాత ఆయన వైద్య సహాయం తీసుకున్నారు. అక్కడికి రాణాకు అత్యవసర చికిత్స విజయవంతంగా అందించినప్పటికీ, ఆ ఆలస్యం చివరికి ప్రాణాంతకంగా మారింది. 

గుండెపోటు విషయంలో ప్రతి నిమిషం విలువైనదేనని ఆయన ఉదంతం గట్టిగా గుర్తుచేస్తుంది. సన్నగా, దృఢంగా, కండరాలతో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని హెచ్చిరిస్తున్నారు వైద్యులు. అంతేగాదు చాలామటుకు పలు కేసుల్లో 30 ఏళ్ల మగవారిలోనే ఈ గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇందుకు ఆహారం, జీవనశైలి వంటివే కారణాలని చెబుతున్నారు వైద్యులు.

ఇక్కడ జస్పాల్‌ రాణా కూడా విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడూ తీవ్రమైన ఛాతీ అసౌకర్యాన్ని అనుభవించాడు. కానీ ఆ లక్షణాలు ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ (జీర్ణకోశ సమస్య)కు సంబంధించినవిగా భావించాడు. పైగా ప్రయాణం కొనసాగించాడు. ఆ క్షణమే తక్షణ వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంది, కానీ ఆయన తీసుకోకపోవడంతో గుండె పనితీరు బలహీనమై వైఫల్యానికి దారితీసిందని చెబుతున్నారు వైద్యులు. 

నిజానికి రాణా మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా..ఆ తర్వాత ఆయన కార్డియాక్ రప్చర్ (గుండె పగిలిపోవడం) సంభవించిందని వైద్యులు తెలిపారు. ఇది తీవ్రమైన గుండెపోటు తర్వాత సంభవించే ఒక అరుదైన ప్రాణాంతక సమస్యగా పేర్కొన్నారు వైద్యులు.

గోల్డెన్ అవర్ ఎందుకు ముఖ్యం?
గుండెపోటు ప్రారంభమైన తర్వాత మొదటి 60 నిమిషాలను హృద్రోగ నిపుణులు  "గోల్డెన్ అవర్" అని పిలుస్తారు. ఈ సమయంలో, సత్వర చికిత్స గుండె కండరాల నష్టాన్ని గణనీయంగా తగ్గించి, మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుంది. గుండెపోటు సమయంలో ప్రతి నిమిషం విలువైనది. రోగులు మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, చికిత్సలో జాప్యం కోలుకోలేని గుండె నష్టం, ప్రాణాంతక సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ముఖ్యంగా కొన్ని గంటలకు మించి ఆలస్యం అయితే గుండెకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి రక్త సరఫరా నిలిచిపోతే, గుండె కండర కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. చికిత్సను ఎంత ఆలస్యం చేస్తే, గుండె వైఫల్యం, ప్రమాదకరమైన అరిథ్మియాలు, కార్డియోజెనిక్ షాక్, గుండె పగిలిపోవడం వంటి సమస్యల ప్రమాదం అంత తీవ్రంగా ఉంటుంది. అందుకే కీలకమైన ముందస్తు చికిత్స అందించడం వల్ల రోగిని అనేక సంభావ్య సమస్యల నుంచి కాపాడవచ్చు అని చెబుతున్నారు. 

కానీ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవ్‌..

గుండెపోటును తరచుగా గుర్తించలేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, దాని లక్షణాలు ఎల్లప్పుడూ తీవ్రమైన ఛాతీ నొప్పిగా కనిపించవు. సాధారణ హెచ్చరిక సంకేతాలు:

  • ఛాతీలో ఒత్తిడి, బరువుగా అనిపించడం, బిగుతుగా ఉండటం లేదా నొప్పి

  • చేయి, దవడ, మెడ, భుజం లేదా వీపుకు వ్యాపించే నొప్పి

  • ఆయాసం

  • అధికంగా చెమట పట్టడం

  • వికారం లేదా వాంతులు

  • తల తిరగడం లేదా అసాధారణమైన అలసట

  • ఎసిడిటీగా పొరబడే పై ​​పొట్టలో అసౌకర్యం

దాదాపు మూడింట ఒక వంతు గుండెపోటులను మొదట్లో అజీర్ణం, కండరాల ఒత్తిడి లేదా అలసటగా కొట్టిపారేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

యువకుల్లోనే అధికం ఎందుకంటే..
గతంలో కంటే ఇప్పుడు యువకులలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. నిశ్చల జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, పొగాకు వాడకం, సరిగా నిద్రపోకపోవడం, ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం, అధిక స్క్రీన్ సమయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తదితరాలే కారణమని చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో చిన్నవయసులోనే ఈ సమస్య బారిన పడినట్లయితే అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే శారీరకంగా దృఢంగా ఉండటం, లేదా సాధారణ శరీర బరువుని కలిగి ఉండటం అనేది హృదయ సంబంధ వ్యాధుల దరిచేరవని కాదు అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

తీసుకోవాల్సిన జాగ్రత్తులు..

  • క్రమం తప్పకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం పరీక్షలు చేయించుకోవడం

  • ధూమపానం, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండటం. 

  • వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం

  • పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవడం

  • ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పాటించడం

  • ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం

(చదవండి: ఏరోస్పేస్‌ ఉద్యోగాన్ని వదిలి కేఫ్‌..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..)

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)