Breaking News

Health: ఆహారంలో ఉప్పు తగ్గిస్తేనే... లేదంటే ఈ ముప్పు తప్పదు!

Published on Mon, 02/06/2023 - 09:58

వృద్ధాప్యంలో తామెవరో తమకే తెలియకుండా పోవడం... తమ సొంతవాళ్లను మాత్రమే కాదు... సొంత ఇంటినీ మరచిపోవడం ఎంత దురదృష్టకరం. అయితే ముందునుంచీ జాగ్రత్తపడితే అలాంటి దురవస్థ రాకుండా కాపాడుకోవడం అంత కష్టం కాదు. చాలా ఈజీగా అనుసరించదగిన ఈ కింది సూచనలు పాటిస్తే చాలు... 

బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవాలి
బ్లడ్‌ప్రెషర్‌ను తరచూ చెక్‌ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు రక్తపోటు ఎక్కువగా ఉండటం అన్న అంశం మతిమరపు(డిమెన్షియా)ను పెంచుతుంది. అది పరోక్షంగా అల్జీమర్స్‌కు దారితీయవచ్చు. అందుకే నిత్యం మన బీపీని అదుపులో ఉంచుకోవడం మేలు.

బ్లడ్‌ ప్రెషర్‌ నియంత్రణతో పాటు అల్జీమర్స్‌ నివారణకూ ఆహారంలో ఉప్పు తగ్గించడం చాలా ఉపకరిస్తుంది. కండరాల కదలికలు చురుగ్గా ఉన్నవారితో పోలిస్తే... మందకొడి కదలికలు ఉన్నవారిలో అల్జీమర్స్‌ వచ్చే అవకాశాలు 60 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనంలో తెలిసింది.

నడక మంచిదే
రోజూ 30 – 45 నిమిషాల పాటు నడక అల్జీమర్స్‌నే కాదు... ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచి చేస్తుంది. అందుకే ఇమ్యూనిటీని పెంచి ఎన్నో వ్యాధుల నివారణలతో పాటు పూర్తి ఆరోగ్యానికి దోహదం చేసే నడకను రోజూ కొనసాగించడం చాలా మంచిది.

వ్యాయామం శరీరానికి మాత్రమే కాదు... మనసుకు కల్పించడం కూడా అల్జీమర్స్‌ నివారణకు తోడ్పడుతుంది. అందుకే రోజూ పత్రికల్లో లేదా సోషల్‌ మీడియాలో కనిపించే పజిల్స్, సుడోకూ, గళ్లనుడికట్టు వంటి మెదడుకు మేత కల్పించే అంశాలు ప్రాక్టీస్‌ చేస్తుండటం మేలు.

సృజనాత్మకంగా ఆలోచిస్తే..
సృజనాత్మకంగా ఆలోచించేవారికి అల్జీమర్స్‌ అవకాశం కాస్త తక్కువ. అందుకే మంచి ఊహాకల్పనలతో సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉండటం... ఆహ్లాదంగా, ఆనందంగా ఉంచడంతో పాటు అల్జీమర్స్‌నూ నివారిస్తుంది. అందుకే ఇష్టమైన,  అభిరుచి ఉన్న కళలను ప్రాక్టీస్‌ చేస్తుండటం ఎంతో మేలు. 
నోట్‌: ఇది ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి మాత్రమే అందించిన కథనం. వైద్యుడిని సంప్రదిస్తే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది.

చదవండి: ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే..
తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)