Breaking News

వణికించే చలి...వేడినీటితో స్నానం... ఎవరు చేయవచ్చు? ఎవరు చేయకూడదు?

Published on Fri, 11/28/2025 - 12:30

శీతాకాలంలో, చాలా మంది వెచ్చని నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు,ఎందుకంటే ఇది వెచ్చగా హాయిగా అనిపిస్తుంది.  కానీ వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని వారికి తెలీదు.  నీటి ఉష్ణోగ్రత  ఆరోగ్యంలో పాత్ర పోషిస్తుంది. కొన్ని లాభాలు ఉన్నప్పటికీ... నష్టాలు మరింత ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు చెబుతున్న ప్రకారం... వేడి నీటి స్నానం వల్ల కలిగే లాభాలు, నష్టాలను ఒకసారి పరిశీలిద్దాం...

ప్రయోజనాలున్నాయి...
వేడీ నీటి స్నానం వల్ల నష్టాలు అనేకం ఉన్నప్పటికీ... కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేడి నీరు బిగుతుగా ఉన్న కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి  వాటికి ఉపశమనం అందించేందుకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా అది రక్తనాళాలను విస్తరించి తద్వారా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి  సహాయపడుతుంది. 

రోజు మొత్తం ఏర్పడిన పని ఒత్తిడిని తగ్గించడానికి  ఒక మార్గంగా కూడా పనిచేస్తుంది. సీజనల్‌ సమస్యలు ఎదుర్కునే వారు, శీతాకాలపు నొప్పులు లేదా అలసటను అనుభవించే వ్యక్తులకు అవి దూరం చేసేందుకు అనువైనది  అలాగే శ్వాసకోశ ఆరోగ్యం సరిగా లేని లేదా తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేని వారికి మేలు చేస్తుంది. వేడి నీటి నుంచి వచ్చే ఆవిరి నాసికా భాగాలను క్లియర్‌ చేయడంలో, స్రవించే ముక్కును నియంత్రించడంలో సహాయపడుతుంది

దుష్ప్రభావాలెన్నో...
చాలా మందికి ఈ సీజన్‌లో  అసౌకర్యంగా ఉండవచ్చు గానీ నిజానికి చల్లటి నీటి స్నానం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేడి నీరు అలవాటు అయితే ఆ లాభాన్ని కోల్పోతాం. అంతేకాదు వేడి నీటికి ఎక్కువసేపు గురికావడం వల్ల చర్మం నుంచి సహజ నూనెలు కోల్పోతుంది. ఇది శీతాకాలంలో చర్మం పొడిబారడాన్ని మరింత తీవ్రతరం చేసి  దురదకు దారితీస్తుంది. వేడి నీరు చర్మం  బయటి పొరను కూడా దెబ్బతీస్తుంది  తేమను నిలుపుకునే సామర్ధ్యాన్ని,  పర్యావరణ సమస్యల నుంచి కాపాడుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. 

అలాగే తామర లేదా సోరియాసిస్‌ వంటి కొన్ని పరిస్థితులను మరింత దిగజార్చవచ్చు  రక్తపోటు పెరిగేకొద్దీ వెచ్చని నీటితో స్నానం చేయడం  గుండెపై ఒత్తిడి పెంచుతుంది.  వెచ్చని నీటితో స్నానం వల్ల్ల ఊపిరితిత్తులలో వాపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా శ్వాస తీసుకోవడం కష్టమై అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వేడి నీటితో స్నానం  తలపై కేశాల మూలాలను బలహీనపరుస్తుంది, జుట్టు విరిగిపోవడానికి రాలడానికి దారితీస్తుంది.

అంతేకాదు గుండె జబ్బులు,  ఆర్థరైటిస్‌ లేదా కండరాల సంబంధిత సమస్యలు ఉండే వారికి మంచిది  కాదు.  

నష్టాలు ఉన్నప్పటికీ.. కఠినమైన చలిని నివారించడానికి ప్రతిరోజూ వెచ్చని నీటితో స్నానం చేయకుండా ఉండడం అంత  సులభం కాదు.. మరి ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు అవసరం?

ఏం చేయాలి?

నీటి ఉష్ణోగ్రత వీలైనంత తక్కువగా ఉంచడం. అలాగే వేడినీటిలో ఎక్కువ సేపు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

శీతాకాలంలో వెచ్చని నీటిలో స్నానం గోరువెచ్చని నీటితో మాత్రమే చేయాలి. జుట్టు రాలడాన్ని నివారించడానికి  మాయిశ్చరైజింగ్‌ హెయిర్‌ కండిషనర్‌ను అప్లై చేయాలి.

పనిని బట్టి చేసే శారీరక శ్రమని బట్టి 2 పూటలా కాకుండా ఒక్క పూటకు పరిమితం చేయడాలి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)