Breaking News

నేరేడు పండ్లు తింటున్నారా?

Published on Sat, 06/13/2026 - 10:27

నేరేడు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ఆయుర్వేద పరంగా అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇలాంటి సమస్యలు ఉంటే తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు వైద్యులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే నేరేడు పండ్లు తీసుకోకూడదో తెలుసుకుందామా.!.

నేరేడు పండ్లు ఇపుడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు, అందరికీ మేలు చేయకపోవచ్చు. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్‌ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. అయితే, డయాబెటిస్‌ కోసం మందులు వాడుతున్న వారు వీటిని అధికంగా తీసుకుంటే, రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్ళు తిరగడం, విపరీతంగా చెమటలు పట్టడం, కంగారు, గుండె వేగం పెరగడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

ఈ పండ్లలో సహజంగానే ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రంలోని క్యాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు లేదా ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు నేరేడు పండ్లను పరిమితంగానే తినాలి. 

నేరేడు పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదే. కానీ, ఒకేసారి వీటిని అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, లేదా కడుపు తిప్పడం వంటి సమస్యలు రావచ్చు. ∙ఈ పండ్లను అతిగా తింటే బ్లడ్‌ షుగర్‌ హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల గర్భిణులు నేరేడు పండ్లను తినే ముందు డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. 

అలర్జీ హిస్టరీ ఉన్నవారు ఈ పండును మొదటిసారి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరికి నేరేడు పండ్ల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది.

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)