Breaking News

50 తర్వాత ఇంట్లోనే చేసే వెయిట్‌లాస్‌ వ్యాయామాలు..!

Published on Sat, 02/07/2026 - 10:00

50 ఏళ్లు దాటాక ఇదివరకటిలా అధిక ప్రభావ వ్యాయామాలు చేయడం కష్టం. మోకాలి నొప్పి, గాయం వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. పైగా ఒంట్లో మునుపటి ఎనర్జీ ఉండదు. అందువల్ల ప్రజలు సులభమైన తక్కువ ప్రభావ వ్యాయామాలు ఎంచుకుంటే మంచిది. అలాగే ఓ వయసు వచ్చాక బరువు తగ్గించే వ్యాయామాలకు శరీరం కూడా సహకరించదు. అలాంటప్పుడు ఇంట్లో సులభంగా చేసే ఈ కొద్దిపాటి వ్యాయామాలు చేస్తే మంచిదని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అవేంటో చూద్దామా..!.

మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉపయోగకరంగా ఉండే ఈ వ్యాయామాలు 80,90 లేదా వంద కిలోలు బరువుతో ఉండే వాళ్లకు అత్యంత ఉపయుక్తమైనవి. చాలా తేలిగ్గా చేసుకునేవి.

మడమ నుంచి తుంటి వరకు నిలబడటం..
ఒక కాలు వంచి తుంటికి తాకే ప్రయత్నం చేయాలి. అలాగే చేతులు నిటారుగా ఉంచాలి. ఈ వ్యాయామం మోకాళ్లను సురక్షితంగా ఉంచుతూ తొడలు, పిరుదులను సక్రియం చేయడానికి హెల్ప్‌ అవుతుంది.

తక్కువ-ప్రభావ జంపింగ్ జాక్
ఇది మోకాలికి అనుకూలమైన వెర్షన్‌. పక్కపక్కలకు కాళ్లను కదుపుతూ చాలా తక్కువ మోతాదులో జంప్‌ చేయడం. ఇది హృదయ స్పందన రేటుని సున్నితంగా పెంచుతుంది. కేలరీలను బర్న్‌ చేస్తుంది. కీళ్లపై ఒత్తిడి పడకుండా సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.

ఒక వైపు నుంచి ఒక వైపుకి..
నియంత్రిత పద్ధతిలో ఒక వైపు నుంచి ఒక వైపు నడక. చాలా ఈజీగా చేసే వ్యాయామం. ఇది తుంటి కండరాలను బలోపేతం చేయడానికి, స్థిరత్వాన్నిఇ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 

ఈ మూడింటిని 20 సార్లు చేసి, ఐదు సెట్లు పునరావృతం చేస్తే చాలని అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. స్థిరత్వంపై దృష్టి పెడుతూ..తేలికైన ఈ కదలికలు బాడీని ఫిట్‌గా ఉంచడంలో చాలా హెల్ప్‌ అవుతాయి. ఇలా ప్రతీరోజు చేయడం వల్ల బరువు తగ్గడమే గాక, మోకాళ్ల గాయాలు గానీ,  సమస్యలు ఎదురవ్వవని అంటున్నారు. 

 

(చదవండి: తస్మాత్‌ జాగ్రత్త..! ఎల్లప్పుడూ.."మంచి" ఆరోగ్యానికి ముప్పు..!)
 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)