ఫ్యాటీలివర్‌తో బీకేర్‌ఫుల్‌..!

Published on Sun, 02/08/2026 - 15:45

ఆల్కహాల్‌తో ఫ్యాటీలివర్‌ ముప్పు ఉందన్న విషయం తెలిసిందే. అయితే  నిత్యం తాగేవారిలోనే ఈ ఫ్యాటీ లివర్‌ ముప్పు ఎక్కువ అనే అ΄ోహ గతంలో ఉండేది. తాజా తార్కాణాలూ, అనేక అధ్యయనాల ప్రకారం ఎప్పుడో ఒకసారి (అకేషనల్‌గా) తాగేవారికీ ఫ్యాటీలివర్‌ ముప్పు తప్పదని తెలుస్తోంది. దీనికి తోడు మగవాళ్లకు దీటుగా తాము ఆల్కహాల్‌కు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న మహిళల్లో ఈ ముప్పు మరింత ఎక్కువ అంటూ పేర్కొంటున్నారు అధ్యయనవేత్తలు. సోషల్‌ డ్రింకింగ్, వీకెండ్‌ కాక్‌టెయిల్‌ పార్టీస్‌ అంటూనో లేదా ఇంట్లోనైనా ఎప్పుడో ఒకసారి అంటూ తాగేవారికి సైతం ఫ్యాటీలివర్‌ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దాం...

చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. అదేమిటంటే... చాలా కొద్దిమోతాదులో అంటే ప్రతిరోజూ 30 మి.లీ.కు మించకుండా ఆల్కహాల్‌... అందులోనూ రెడ్‌వైన్‌ తీసుకునేవారిలో గుండెజబ్బులు నివారితమవుతాయనీ, రక్తనాళాల్లోని కొవ్వు కొట్టుకు΄ోతుందనీ, అంత తక్కువ మోతాదులో ఆల్కహాల్‌ తీసుకుంటే అది  ఫ్యాటీలివర్‌కు దారితీయదనీ... ఇలాంటి అ΄ోహలు ఎక్కువే ఉన్నాయి. అవన్నీ వాస్తవం కాదంటూ ఇటీవలి అనేక అధ్యయనాల్లో తేలింది. 

ఆల్కహాల్‌ ఎంత తక్కువ మోతాదులో తాగినా... అది కూడా చాలా అడపాదడపా(అకేషనల్‌గా)   తీసుకున్నప్పటికీ ఫ్యాటీలివర్‌ ముప్పు తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఇటీవలే మన దేశంలోని మహిళలూ ఆల్కహాల్‌కు దగ్గరవుతున్న నేపథ్యంలో వాళ్లలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్యాటీలివర్‌ అంటే?
మన రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తి కోసం రక్తంలోని చక్కెర ఉపయోగపడుతుంది. అటు తర్వాత మిగతా చక్కెర కొవ్వురూపంలో కాలేయంలో నిల్వ అవుతుంటుంది. ఒకవేళ మనం తీసుకున్న ఆహారం కంటే మన రోజువారీ కార్యకలాపాలు తగ్గుతూ పోతున్న కొద్దీ ఈ కొవ్వు నిల్వలు అలా పేరుకుపోతూ ఉండటంతో పాటు కాలేయ కణాలూ కొవ్వు కణాల్లా మారుతూ ఉంటాయి. ఇలా కాలేయ కణాల్లో కొవ్వు మోతాదులు పెరుగుతూ పోవడాన్ని ‘ఫ్యాటీ లివర్‌’ అంటారు. 

ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు కారణమవుతాయి. అందులో మొదటిది ఆల్కహాల్‌ వినియోగం. రెండోది ఆల్కహాల్‌ కాకుండా ఇతరత్రా అంశాలు ఫ్యాటీలివర్‌కు కారణం కావడం. ఈ కారణాలను బట్టి ఫ్యాటీలివర్‌లోని రకాలివి... 

ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌ డిసీజ్‌ (ఏఎఫ్‌ఎల్‌డీ) : ఆల్కహాల్‌ వినియోగం వల్ల కాలేయంలో కొవ్వు చేరి ‘ఫ్యాటీలివర్‌’కు దారితీయడం. 

నాన్‌ ఆల్కహాలివ్‌ ఫ్యాటీలివర్‌ డిసీజ్‌ (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ) :  దీనికి ఆల్కహాలిక్‌ ప్రధాన కారణం కాదు. అయితే జీవక్రియల తేడా కారణంగా వచ్చే వ్యాధులు (మెటబాలిక్‌ సిండ్రోమ్స్‌), స్థూలకాయం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వంటి కారణాల వల్ల ఈ ఫ్యాటీలివర్‌ సమస్య వస్తుంది.

నిర్ధారణ 

బాధితుల స్థూలకాయం, పొట్ట (సెంట్రల్‌ ఒబేసిటీ) చూసి డాక్టర్లు పరిస్థితిని కొంత తెలుసుకోగలరు. 

కొన్ని రక్తపరీక్షలు, వాటితోపాటు డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ మోతాదులు, ట్రైగ్లిజరైడ్‌ స్థాయులు పెరిగాయా అన్నది చూడాలి. 

అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌లో ఫ్యాటీలివర్‌ కండిషన్‌ బయటపడుతుంది. 

కొందరిలో లివర్‌ బయాప్సీ (అంటే కాలేయం తాలూకు చిన్న ముక్కను సేకరించి చేసే) పరీక్ష అవసరం. లివర్‌ బయాప్సీతో ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీలో అది నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌ (ఎన్‌ఏఎఎఫ్‌ఎల్‌) కండిషనా, లేక నాన్‌ ఆల్కహాలిక్‌ స్టియటో–హెపాటిక్‌ (నాశ్‌) కండిషనా అన్నది నిర్ధారణ చేయవచ్చు. 

ఇప్పుడు ‘ఫైబ్రోస్కాన్‌’ అనే వైద్యపరీక్ష ద్వారా లివర్‌లో ఏ మేరకు కొవ్వు పేరుకుంది, ఫైబ్రోసిస్‌ ఎంత ఉందన్న విషయంతో పాటు, మూడు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, కొవ్వు మోతాదులు పెరిగాయా, తగ్గాయా కూడా తెలుసుకోవచ్చు.  

మహిళల్లో మరింత ఎక్కువ ముప్పు ఎందుకంటే... 
ఆల్కహాలిక్‌ ఫాటీలివర్‌ ముప్పు మహిళల్లో మరింత ఎక్కువ. ఎందుకంటే వీళ్లలో పురుషులతో ΄ోలిస్తే వాళ్ల కాలేయం సైజు తక్కువ. అలాగే వాళ్ల ఒంట్లోని నీటి మోతాదులు కూడా తక్కువే. ఇక మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్‌ కారణంగా ఆల్కహాల్‌ వాళ్ల రక్తంలో చాలా ఎక్కువగా గాఢతతో చాలాసేపు ఉంటుంది. అలా అరుదుగానే అప్పుడప్పుడూ తాగినా ఆ ఇంటర్‌మిట్టెంట్‌ ఆల్కహాల్‌ వల్ల ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ పెరగడం, కొవ్వులు పేరుకుపోవడంతో పాటు ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌ కూడా పెరుగుతుందని ఈ అంశాలన్నీ మహిళల్లో ఫ్యాటీలివర్‌ను పెంచడంతోపాటు లివర్‌ ఫైబ్రోసిస్‌ ముప్పునూ చాలా ఎక్కువగా పెంచేస్తాయి. 

అందుకే 20 – 35 ఏళ్లున్న మహిళల్లో వాళ్ల ఆల్కహాల్‌ తీసుకునే మోతాదు ఎంత తక్కువైనప్పటికీ లివర్‌ ఫైబ్రోసిస్‌ రేటు చాలా పెరిగి΄ోతోంది. అందుకే పురుషులూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్లలో ΄ోలిస్తే మహిళలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్‌ దుష్ప్రభావాలు మహిళల్లో కేవలం కాలేయాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ల రుతుక్రమం దెబ్బతినడం, హార్మోనల్‌ బ్యాలెన్స్‌ అతలా కుతలం కావడం, సంతానలేమి వంటి అనేక సమస్యలకు దారితీయవచ్చు.

లక్షణాలు 

  • ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌లో పొట్ట బాగా పెరిగిపోతుంటుంది. 

  • ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌లో ఇలా కొద్దిమేరకు లక్షణాలు కనిపించవచ్చేమోగానీ...

  • నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌లో చాలావరకు లక్షణాలు కనిపించవు.

  • అయితే కొన్ని అంశాలు నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌ను సూచిస్తాయి. 
    ఉదాహరణకు వీళ్లలోనూ పొట్ట బాగా పెరిగి, సెంట్రల్‌ ఒబేసిటీతో ముందుకు వచ్చి కనిపిస్తుంది. ∙ కొద్దిమందిలో కుడివైపు పొట్ట పైభాగంలో (ఉరఃపంజరం / రిబ్‌కేజ్‌ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. 

  • క్రమంగా కాలేయం పెరుగుతుండటం వల్ల ఇలా జరుగుతుంటుంది.  

నివారణ / చికిత్స

ఆల్కహాల్‌ అలవాటును పూర్తిగా మానేయడం. 

డైట్‌ : ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం. ఇందులో చక్కెర, కొవ్వుల మోతాదులను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవడం, షుగర్‌–స్వీటెన్‌డ్‌ డ్రింక్స్‌ వంటి కూల్‌డ్రింక్స్‌ దూరంగా ఉండటం. అలాగే పొట్టుతో ఉండే ధాన్యాలూ (హోల్‌గ్రెయిన్స్‌), తాజా పండ్లు, కూరగాయల వంటి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం. 

వ్యాయామం : రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. దేహానికి వారంలో కనీసం 150 నిమిషాల వ్యాయామాన్ని ఇవ్వడం. 

నివారణ నియమాలు పాటించడంతో పాటు ఫ్యాటీ లివర్‌ దశను బట్టి డాక్టర్లు సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది. 

పైన పేర్కొన్న జాగ్రత్తలతోపాటు క్రమం తప్పకుండా అవసరమైన వైద్య పరీక్షలు (అల్ట్రా సౌండ్, మెటబాలిక్‌ మార్కర్‌ పరీక్షలు) చేయించుకుంటూ ఉండటం. 

చివరగా... సోషల్‌ డ్రింకింగ్‌ లేదా వీకెండ్‌ పార్టీస్‌ అంటూ పార్టీ కల్చర్‌ పేరిట పరిమితంగా ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల దేహానికి అత్యంత కీలకమైన భాగమైన కాలేయంపై పడే దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, ఈ అవగాహనను అందరిలోనూ కల్పించడం అన్నది ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతైన అవసరమని గుర్తించాలి. 
డాక్టర్‌ పవన్‌ కె. అడ్డాల, సీనియర్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో  ఎంటరాలజిస్ట్‌ 

(చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!)

Videos

తప్పు ఒప్పుకున్న చంద్రబాబు.. ఫైన్ కట్టిన హెరిటేజ్

Perni Nani: మీరు మనుషులా.. రాక్షసులా..? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు

గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు

చిరు పక్కన సారా అర్జున్.. కృతి శెట్టి కథ కంచికేనా..?

సౌందర్య, మోహన్ బాబు వివాదంపై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్

జాతిపిత ఎవరు? కేసీఆర్, జయశంకర్, శ్రీకాంతాచారి

గతంలో బూతు బొమ్మలు & బూతు పుస్తకాల కోసం చాలా కష్ట పడేవాళ్ళం.. కానీ ఇప్పుడు..!

వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలు

డొల్ల కంపెనీలతో బిగ్ స్కామ్.. OTP లేకుండానే 5 వేల కోట్లు..

లక్షను 40 లక్షలు చేసిన స్టాక్.. జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు..

Photos

+5

గ్లామర్‌తో పడేస్తున్న శ్రద్ధా దాస్‌.. నెట్టింట ఫోటోలు వైరల్‌

+5

హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక శోభ (ఫొటోలు)

+5

కుటుంబ వివాహ వేడుక.. తమిళనాడు ప్రముఖులకు వైఎస్‌ జగన్‌ ఆత్మీయ పలకరింపు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్‌, తేజ సజ్జా (ఫోటోలు)

+5

వివాహ వేడుకలో వైఎస్‌ జగన్‌.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్‌ 2026 (ఫొటోలు)

+5

టి20 వరల్డ్‌ కప్‌ ప్రారంభ వేడుక అదుర్స్‌ (ఫొటోలు)

+5

సాక్షి మీడియా గ్రూప్‌, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)