'ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫుడ్‌'..!

Published on Tue, 03/31/2026 - 11:36

సరదాగా చెప్పాలంటే...‘‘తినదగు నిపుణులు చెప్పిన తినినంతనే వేగిరపడక పోషక విలువలు 
తెలుసుకోదగన్‌...ఇలా నిజము దెలుసుకుని ‘పువ్వులనూ తినెడివాడే మనుజుడు మహిలో...’’ అంటే కాస్త వినోదంగానో, వెటకారంగానో ఉండవచ్చు. ఇక అచ్చతెలుగులో పువ్వుల్నీ తినవచ్చంటే కూడా కొద్దిగా ఇబ్బందిబ్బందిగానే అనిపించవచ్చుగానీ...నిజానికి పువ్వుల్లోనూ ఎన్నో పోషకవిలువలూ, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలంటాయంటున్నారు ఆహార నిపుణులు. ‘‘మొక్కమొక్కకో పువ్వు... మనుషులందరికీ హెల్తు’’ అంటూ   పువ్వులోని పోషక విలువలనూ ప్రయోజనాలనూ చెబుతున్న ఆ న్యూట్రిషనిస్టుల మాటలేమిటో తెలుసుకుందాం... 

కాలీఫ్లవర్‌లాంటి పువ్వులను కూరలకోసమే ఉపయోగిస్తామంటే సరే. అయితేమామూలుగానైతే కొన్ని పువ్వులూ తినడానికి పనికివస్తాయంటే వెంటనే నమ్మలేని పరిస్థితి. అయినప్పటికీ అది వాస్తవం. అలాంటి కొన్ని పువ్వులూ వాటి పోషక విలువలేమిటో చూద్దాం...

అరటిపువ్వు
అరటికాయను ‘కూర అరటి’గా పిలుస్తూ... కూర చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ అరటి పువ్వు (మొవ్వ)ను కూడా కూరగా వండటం ఓ సంప్రదాయంలా పాటించే కుటుంబాలు చాలా ఎక్కువే ఉన్నాయి. 

అరటి పువ్వు పోషక విలువలు 
ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్‌ ఈ సమృద్ధిగా ఉంటాయి. అరటిపువ్వులోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్‌ తగ్గించడానికి ఉపయోగపడతాయి. అరటిపువ్వు నుంచి సేకరించిన పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం చెబుతోంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణం కారణంగా అరటిపువ్వు ఫ్రీరాడికల్స్‌ను హరిస్తుంది. దాంతో క్యాన్సర్‌ నివారణా సాధ్యమవుతుంది. 

అంతేకాదు... ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వయసుపైబడే ప్రక్రియనూ ఆలస్యం చేసి ఏజింగ్‌ ప్రక్రియను మందకొడిగా జరిగేలా చేస్తాయి. అరటిపువ్వు రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తుంది. ఇందులో ఐరన్‌ ఎక్కువ కాబట్టి రక్తహీనత దూరం చేస్తుంది. ముఖ్యంగా ఇది మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. ఇక స్త్రీలలో రుతు సమస్యల నివారణకు అరటిపువ్వుల కూర బాగా మేలు చేస్తుంది. 

అరటిపువ్వుతో అనేక రుతుబాధలు దూరమవుతాయి. పీరియడ్స్‌ టైమ్‌లో ఎక్కువగా బ్లీడింగ్‌ కావడం తగ్గుతుంది. రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్‌ త్వరత్వరగా మారి΄ోవడం, కడుపునొప్పి వంటి అనేక లక్షణాలతో వ్యక్తమయ్యే పీ–మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎమ్‌ఎస్‌) తగ్గుతుంది. ఇందులోని మెగ్నీషియమ్‌ వల్ల యాంగై్జటీ తగ్గడంతో మూడ్స్‌ బాగుపడతాయి. బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో బాగా పాలు పడేలా చేస్తుంది అరటిపువ్వు.

గుమ్మడి పూలు
ఇటీవల కొందరు గుమ్మడిపూలను కొన్ని రకాల కూరగాయలతో కలిపి స్టఫ్‌ చేయడం, ఫ్రై చేయడంతోపాటు కూరగా వండటం పరిపాటి అయ్యింది. 

గుమ్మడి పూల పోషక విలువలు
ఇందులో విటమిన్లు ఏ, సీ లతోపాటు క్యాల్షియమ్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతున్నాయి. ఇక పీచుపదార్థాలూ (డయటరీ ఫైబర్‌) కూడా చాలా ఎక్కువ. అందుకే వీటిని ఆహారంగా తీసుకునేవారిలో ఆకలి త్వరగా తీరడం వల్ల స్థూలకాయం నివారితమవుతుంది. 

ఫలితంగా డయాబెటిస్, హైబీపీలు నివారితం కావడంతోపాటు డయటరీ ఫైబర్‌ వల్ల జీర్ణాశయ ఆరోగ్యం బాగుండటమూ, మలబద్ధకం వంటివి దూరం కావడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలూ చేకూరతాయి.

ఆవపూలు
కాస్తంత ఆవాల రుచితోనే ఉంటూ కొన్ని రకాల క్రిస్పీ వంటకాల్లోనూ, మరికొన్ని ఫ్రైలతోపాటు రుచి పెంపొందించడం కోసం, అలాగే కొన్ని రకాల వడల్లాంటి (ఫ్రిట్టర్‌) రూపంలో చేసే వంటకాల్లో ఆవపూలను ఒక రకమైన మంచి రుచి (ఫ్లేవర్‌) కోసం ఉపయోగించడమనేది పశ్చిమ బెంగాల్‌తోపాటు అక్కడి చాలా ప్రాంతాల్లో వాడుకగా ఉంది. కూర (సబ్జీ)గా వండటం కూడా మామూలే. 

ఆవ పూల పోషక విలువలు
ఆవపూలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి అనేక రకాల క్యాన్సర్లనుంచి కాపాడుతుంటాయి. అయితే వీటిల్లో యాంటీ సెప్టిక్‌ గుణాల వల్ల గాయాలను త్వరగా మాన్పివేస్తాయి. ఇందులోని విటమిన్‌ సి కూడా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది.

మునగ పూలు
మామూలుగానైతే మునక్కాడలని పిలిచే ఆ ములక్కాయలను కూర వండుకు తినేయడం చాలా సాధారణం. ఇటీవల కొందరు మునగాకును కూరగా వాడుతున్న సంగతీ తెలుసు. అయితే మునగాకుకు దీటుగా దాని పూలూ ఆహారంగా వాడుకునేవారూ ఉన్నారు. ఎందుకంటే సూపర్‌ ఫుడ్‌ అనే మాట నిజంగా మునగకే నప్పుతుంది. ఇందుకు కారణమూ ఉంది. 

మునగ పూల పోషక విలువలు
మునగ పూలను ఆహారంగా తీసుకుంటే ఇందులో విటమిన్లు ఏ, సీ, ఈ...లతో పాటు పొటాషియమ్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నారింజతో ΄ోలిస్తే ఇందులో విటమిన్‌ సీ 7 రెట్లు ఎక్కువ. ఇక క్యాల్షియమ్‌ మోతాదులు చాలా చాలా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో అనేక క్యాన్సర్ల నుంచి నివారణ. ఇందులోని పీచు మోతాదుల వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియను క్రమబద్దీకరించి, బరువును తగ్గిస్తుంది.

మందారపువ్వు
చాలా మంది దీన్ని పువ్వులను ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగడం గానీ లేదా ఆకర్షణీయమైన ఎరుపు రంగులో ఉండే మందారపువ్వులను పానియాల రూపంలో చేసుకుని తాగడం చాలా చోట్ల సంప్రదాయంగా కొనసాగే ప్రక్రియే. 

మందారలో పోషక విలువలు
మందారపువ్వులో చాలా శక్తిమంతమైన విటమిన్‌–సి ఉంటుంది. దీంతో మంచి వ్యాధినిరోధకత సమకూరడమే కాకుండా చాలా రకాల గుండెజబ్బులూ నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. కొద్దిగా మాత్రమే పులుపుగానూ, కాస్తంత ఘాటుగానూ ఉండే దీని రుచి (ఫ్లేవర్‌) కారణంగా దీన్ని తేనీటి రూపంలో తాగడం చాలా చోట్ల జరిగేదే. దీనిలోని పోషకగుణాల కారణంగా జీర్ణశక్తి మెరుగుపడుతుది. 

ఈ పూలతో చేసే పదార్థాలు రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీర జీవక్రియలు క్రమబద్ధం చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు ఉండే విటమిన్‌ సి వల్ల కాలేయ క్యాన్సర్‌తో పాటు అనేక క్యాన్సర్‌లు నివారితమవుతాయి. మందరపూలతో కాచిన టీతో రక్తపోటు, యాంగై్జటీ కూడా తగ్గుతాయి. అయితే ఈ మందార చాయ్‌ను పరిమితంగా తాగితేనే మేలన్నది న్యూట్రిషన్‌ నిపుణుల మాట.

బంతి / చేమంతి పూలు
ఇంగ్లిష్‌లో మేరీగోల్డ్‌ గా పిలిచే ఈ బంతి / చేమంతిలోని అనేక రకాల పూల రేకులను అనేక వంటకాల్లో వాడతారు. వీటిని ఎండబెట్టి పానీయాలుగా, కుంకుమపువ్వు (శాఫ్రాన్‌) తరహాలో గార్నిషింగ్‌ కోసం వాడుతుంటారు. ఇందులోనూ కాస్తంత పులుపు, వగరు, కారం కలగలసిన రుచి (సిట్రసీ, స్పైసీ, బిట్టర్‌–ట్యాంజీ ఫ్లేవర్‌) ఉండటం వల్ల దీన్ని అనేక వంటకాల్లో ఒక దినుసుగా ఉపయోగించడం కూడా పరిపాటి. 

ఇలా వంటల కోసం ఉపయోగించే మేరీగోల్డ్‌ మొక్కలపై ఎలాంటి రసాయన ఎరువులూ వేయకుండా పెంచుతుంటారు. దీని పూల రేకలను పైన అలంకరణగా (సీజనింగ్‌గా) వాడటంతో పాటు కొన్ని సందర్భాల్లో పసుపు పచ్చ రంగునిచ్చేందుకు కలరెంట్‌గా కూడా వాడతారు. కుంకుమపువ్వుకు ప్రత్యామ్నాయంగా వాడటమూ కొన్ని చోట్ల వాడుకలో ఉంది. దీని పూల రేకలను ఎండబెట్టి టీ రూపంలో వాడతారు. (ఇక మెడిసిన్‌ విలువలు ఉండటంతో క్యాలండ్యులా నుంచి తీసిన నూనెను చర్మంపైన గాయాలు మానేయందుకు పైపూత మందుగానూ ఉపయోగిస్తారు. 

బంతి / చేమంతులలోని  పోషక విలువలు
బంతి / చేమంతి (మేరీగోల్డ్‌) పూలలోని జీవరసాయనాలు తెల్లదోమ (వైట్‌ ఫ్లై) వంటి పరాన్నజీవులను దూరంగా ఉంచే గుణం ఉండటం వల్ల పూలతోటలలో కొన్ని రకాల పరాన్నజీవులనూ, తెగుళ్లను దూరంగా ఉంచేందుకూ ఈ మొక్కలను పెంచుతుంటారు. 

అంతేకాదు... ఈ ప్రజాతికి చెందిన క్యాలెండ్యులా వంటి పూలలో యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు ల్యూటిన్, బీటా ల్యూటిన్, ఫ్లేవోగ్జాంథిన్‌ వంటి కెరటనాయిడ్స్‌తోపాటు ఫ్లేవనాయిడ్స్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులోని ఓలియోనిక్‌ యాసిడ్, క్యాలెండిక్‌ యాసి వంటి ఫ్యాటీ యాసిడ్స్‌తోపాటు విటమిన్‌–సి ఉండటం వల్ల తన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణంతో గాయాలను త్వరగా మాని΄ోయేలా చేయడం, నొప్పులను తగ్గించడం వంటి ప్రయోజనాలనిస్తాయి. అందుకే దీన్ని ఓ ఔషధమొక్కగానూ, దీని పువ్వును ఔషధాల్లోనూ ఉపయోగిస్తుంటారు.

గులాబీ 
మన దగ్గర ఆహారంలో దీని ఉపయోగం చాలా తక్కువే అయినా చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే మన దగ్గర కూడా పాన్‌లో వేసే గుల్ఖంద్‌ అనే స్వీటెనర్‌ను గులాబీ పూల రేకలతోనే తయారు చేస్తారని ప్రతీతి. ఇక రోజాపువ్వు రేకులతో టీ కాచుకోవడం అనేది చాలా చోట్ల ఉన్న ఒక సంప్రదాయం. ఆరోగ్యానికి మంచిదంటూ కొందరు ఈ పూల రేకులను అలాగే తినేస్తుంటారు కూడా.  

గులాబీపూలలోని పోషక విలువలు : ఈ పూల రేకుల్లో ఫీనాలిక్స్‌ అనే పోషకాలు ఉన్నాయి. వాటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం వల్ల అవి గాయం వల్ల కలిగే మంటను తగ్గిస్తాయి. రోజాపువ్వు రేకులతో కాచే టీతో గుండెజబ్బు ముప్పు, క్యాన్సర్, డయాబెటిస్‌లనూ రిస్క్‌ తగ్గుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. కేవలం. 

రోజా అన్నది పూలలో రాజా వంటిది అనే ప్రతీతి దీని తాలూకు గాయాలు మాన్పే శక్తికీ వర్తిస్తుంది. ఇందుకే హీలింగ్‌ గుణంలో కూడా ఇది కింగ్‌ అంటూ దీనికి ఓ ప్రశస్తి ఉంది. దీన్ని టీ కాచుకోడానికీ లేదా ఫ్లేవర్‌గా పరిమితంగా ఉపయోగించడమే మంచిదనేది న్యూట్రిషనిస్టుల సలహా.

తామరపువ్వులు (కమలం పువ్వులు)
దీని గింజలను ‘మఖానా’ గింజలనీ, దీని పూలను ‘ఫూల్‌ మఖానా’ అంటూ పిలుస్తూ, ఈ పూలనూ ఆహారంగా తీసుకోవడం చాలా చోట్ల వాడుకలో ఉంది. తామరపూలతో చాలా మంది టీ కాచుకొని తాగుతుంటారు. 

అయితే ఆసియా ఖండంలోని చాలా ప్రాంతాల్లో అనేక మంది తామరతూళ్లను వంటకోసం ఉపయోగిస్తుంటారు. ఇటు మఖానా గింజలనూ, అటు ఫూల్‌ మఖానాను కూరలలో (కర్రీ), కొన్ని రకాల స్వీట్లలో, కొన్ని సందర్భాల్లో మసాలా దినుసుల మాదిరిగా కూడా వాడతారు. 

తామరపూల పోషక విలువలు
తామరపూలలో విటమిన్‌ ఏ, బీ, సి లు చాలా ఎక్కువ. విటమిన్‌ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక విటమిన్‌ బి కాంప్లెక్స్‌లో అనేక పోషకాలతోపాటు పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్‌ అయిన విటమిన్‌ సి వల్ల చాలా శక్తిమంతమైన వ్యాధి నిరోధక వ్యవస్థ రూపొందుతుంది. ఫలితంగా అనేక రకాల క్యాన్సర్‌లను ఈ పూలు నివారిస్తాయి. 

ఈ పూలలోని విటమిన్‌ బి కాంప్లెక్స్‌ అలాగే విటమిన్‌–సి కలగలసి దేహంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచి ఎన్నో వ్యాధులకు కవచంగా నిలుస్తాయి. వీటలోని క్యాల్షియమ్‌ వల్ల ఎముకలు బలంగా మారతాయి. రక్తపోటు (హైబీపీ)ని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెగ్నీషియమ్, ఐరన్, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజలవణాల వల్ల మంచి ఆరోగ్యం సమకూరుతుంది.

మొగలి పువ్వు (ఫ్రాగ్రెన్స్‌ స్క్రూపైన్‌ / కేవ్‌డా) 
మనదేశంలోని అనేక ్ర΄ాంతాల్లోని ప్రజలతో ΄ాటు దక్షిణ ఆసియాలోని అనేక మంది మొగలి పువ్వును వంటలో ఉపయోగిస్తుంటారు. దీన్ని రుచిని ఇచ్చే పదార్థంగా (ఫ్లేవరింగ్‌ ఏజెంట్‌గా) వాడుతుంటారు. దక్షిణ భారతదేశంలో మొగలిపూలతో కూర వండుకోవడమూ చాలా చోట్ల వాడకులో ఉన్న సంప్రదాయమే. 

ఇక రసగుల్లా, రస్‌మలాయ్‌ వంటి పాయసాల్లోనూ, కొన్ని రకాల పానీయాల్లో కొంత తియ్యటి రుచి / వాసన ఇచ్చేందుకు ఫ్లేవరింగ్‌ ఏజెంట్‌గా చాలా చోట్ల వాడుతుంటారు. దీన్ని ఔషధ మొక్కగానూ, దీని పువ్వును ఔషధాల్లోనూ వాడటమూ చాలా సాధారణంగా జరుగుతుండేదే. 
మొగలిపువ్వులోని పోషక విలువలు

ఈ పూలలో విటమిన్‌–సి వంటివీ అలాగే, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్‌ వంటి విటమిన్‌–బి కాంప్లెక్స్‌లోని విటమిన్లతోపాటు అనేక పోషకాలు ఉంటాయి. ఇక గాయాలను మాన్పించే, నొప్పులను తగ్గించే యాంటీసెప్టిక్, యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలూ ఈ పూలలో ఉంటాయి. ఇక ఇదొక ఔషధ మొక్క కూడా కావడం వల్ల దీనిలోంచి తీసే నూనెలను పైపూత మందుగా ఆర్థరైటిస్, రుమాటిక్‌ నొప్పులలో వాడుతుంటారు. 

దాదాపుగా అందరికీ తెలిసిన తినే పూలు

పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్‌)

దీని గింజల నుంచి తీసిన నూనెలో వంటల్లో విరివిగా వాడతారన్న విషయం తెలిసిదే. అయితే దీని ఆకులూ, వేళ్లతో పాటు పూల రేకులను సైతం కొన్ని రకాల సలాడ్స్‌లోనూ, వేయించిన పూలరేకులను కొన్ని ఫ్రై వంటకాల్లో, శ్నాక్స్‌లో క్రంచీగానూ వాడుతుంటారు. పూర్తిగా వికసించకముందే మొగ్గగా ఉన్నప్పుడే కోసిన పూలను పేలాల్లా (కార్న్‌లా) వేపి / వేగించి తినడంతో పాటు కొన్ని సలాడ్స్‌లో కలిపి వడ్డిస్తారు. 

పొద్దుతిరుగుడు పువ్వు పోషక విలువలు : ఈ పూలను పవర్‌΄్యాక్‌డ్‌ పవర్‌హౌజ్‌గా పరగణించడం పరిపాటి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు, కొవ్వులూ, పీచు (ఎడిబుల్‌ ఫైబర్‌), విటమిన్‌–ఈ వంటి విటమిన్లు, కాపర్, సెలేనియమ్, మ్యాంగనీస్, మెగ్నీషియమ్‌ వంటి ఖనిజాలు (మినరల్స్‌) పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌–ఈ అనేది చాలా శక్తిమంతమైన ఆంటీ ఆక్సిడెంట్‌ కావడంతో చాలా రకాల వ్యాధుల నుంచి క్యాన్సర్లనుంచి కా΄ాడుతుంది. ్ర΄ోటీన్ల కారణంగా కండరాలు శక్తిమంతం కావడంతో ΄ాటు కండరాల రిపేర్లకు ఇది సహాయపడుతుంది. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గించడానికి సెలేనియమ్‌ ఉపయోగపడుతుంది.

కాలీఫ్లవర్‌ 
గోబీ పువ్వు అని తెలుగులోనూ ఫూల్‌ గోబీ అని హిందీలోనూ పిలుచుకునే ఈ పువ్వు కూరలా అందరూ వండుకోడానికి ఉపయోగించేదే.  గోబీ పకోడీలంటూ శ్నాక్స్‌ రూపంలోనూ తింటుంటారు. 

కాలీఫ్లవర్‌ పోషక విలువలు : ఈ పువ్వు క్యాన్సర్‌ను నివారిస్తుంది. కాలీఫ్లవర్‌లోని సల్ఫోరఫేన్‌ వంటి వృక్షరసాయనాలు (ఫైటో కెమికల్స్‌) క్యాన్సర్లతో పోరాడతాయి.  సల్ఫోరఫేన్‌ అనే ΄ోషకం ఆటిజమ్‌ను నివారించడంలో కూడా తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 

కాలీఫ్లవర్‌లోని ఇండోల్‌–3–కార్బినాల్‌ అనే స్టెరాల్‌ కూడా  క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుందని తేలింది. ఇది ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్‌ క్యాన్సర్ల నివారణకు సమర్థంగా ఉపయోగపడుతుంది. దేహంలోని కణాలు క్యాన్సరస్‌గా మారి΄ోతున్న సందర్భాల్లో ఆ కణాల్లోనే అంతర్గతంగా క్యాన్సర్‌ తాలూకు విషాలను (సైటోటాక్సిన్స్‌)ను ఉత్పన్నమయ్యేలా పుట్టించి ఆ క్యాన్సర్లను ఈ పువ్వు నివారిస్తుంది. 

కుంకుమపువ్వు
కుంకుమపువ్వును చరిత్రపూర్వ యుగాల నుంచీ అనాదిగా మనమంతా ఓ  సుగంధద్రవ్యంగా వాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. బిర్యానీలోనూ, కశ్మీరీ వంటకాల్లోనూ ఈ పువ్వును ఉపయోగిస్తుంటారు.

కుంకుమపువ్వు పోషక విలువలు : కుంకుమపువ్వులో యాంటీసెప్టిక్, యాంటీడిప్రెసెంట్‌ గుణాలున్నాయి. క్యాన్సర్‌లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా ఉన్నాయి. కుంకుమ పువ్వు వాడటం వల్ల కడుపులోని బిడ్డ మంచి రంగుతో పుడుతుందన్న  నమ్మకం చాలామందిలో ఉంది. ఇది చాలావరకు అ΄ోహ మాత్రమే. అయితే కుంకుమపువ్వును ఒక హెర్బ్‌గా, సుగంధద్రవ్యంగా పరిమితంగా తీసుకుంటే మాత్రం దానితో చాలా రకాల న్యూట్రిటివ్‌ ప్రయోజనాలు ఒనగూరతాయి. 

కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రించి, మూడ్స్‌ త్వరత్వరగా మారి΄ోవడాన్ని అరికడుతుందని కొన్ని అధ్యయన ఫలితాల్లో తేలింది. ఇందులో  బీ–కాంప్లెక్స్‌ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్‌ అన్న విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్‌ అన్న హార్మోన్‌ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజం. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా గర్భవతులకు ఇది మేలు చేస్తుంది.  దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడమే సురక్షితం.

అపోహే కానీ... ప్రయోజనమూ ఉంది ఇలా... 
కుంకుమపువ్వు కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనేది శాస్త్రీయంగా నిర్ధారణ కాని అ΄ోహ మాత్రమే అయినప్పటికీ పాలలో చాలా పరిమితమైన మోతాదులో తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు సంపూర్ణాహారమైన పాలను గర్భవతులు తాగడం వాళ్లకు చాలా మేలుచేసే అంశం. 

అయితే గర్భధారణ సమయంలోని మొదటి మూడు నెలల పాటు తమ వేవిళ్లు, వికారం కారణంగా గర్భవతులు పాలు తాగడానికి అంతగా ఇష్టపడరు. అయితే కుంకుమపువ్వు కలిపిన పాలు మరింత రుచికరంగా, సుగంధభరితంగా ఉంటాయి. అందునా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. ఇక కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటలకు మరింత రుచిని ఆపాదిస్తారు. 
కుంకుమపువ్వు గురించి ఓ హెచ్చరిక  కుంకుమపువ్వునువాడే గర్భవతుల

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... పాలలో దీన్ని చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్‌  హెర్బ్‌ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. ఈ కారణంగా మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే దాంతో గర్భస్రావమూ అయ్యే ముప్పు కూడా ఉంటుందని తెలుసుకుని చిటికెడంటే చిటికెడే వాడటమే శ్రేయస్కరం.

బ్రాకలీ / బ్రోకలీ
ఒకప్పుడు అందరికీ అంతగా తెలియని బ్రాకలీ అనే ఈ పువ్వు ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద మాల్స్‌లోనూ లభ్యమవుతోంది. బ్రాకలీ అనేది నిజానికి ఇటాలియన్‌ పేరు. ఇటాలియన్‌ భాషలో ‘బ్రకోలో’ అంటే క్యాబేజీ తాలూకు పుష్ప శిఖరాగ్రం (ఫ్లవరింగ్‌ క్రెస్ట్‌ ఆఫ్‌ క్యాబేజీ) అని అర్థం. 

బ్రాకలీ పోషక విలువలు : ఇందులో విటమిన్‌ ఏ మోతాదులు చాలా ఎక్కువ. ఒంటి నిగారింపుకూ, మంచి కనుచూపుకూ ‘విటమిన్‌–ఏ’ బాగా ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. ఇందులోని పోషకాలు శరీరంలో దేహంలోని అనేక రకాల విషాలనూ వాటి ప్రభావాలను తొలగించే ‘డీ–టాక్సిఫైయర్స్‌’గా ఉపయోగపడతాయి.                

డాక్టర్‌ హరిత శ్యామ్‌, సీనియర్‌ డైటీషియన్‌

నిర్వహణ యాసీన్‌ 

(చదవండి: హీరో వరుణ్ ధావన్ కుమార్తెకు డీడీహెచ్‌..? ఎందువల్ల వస్తుందంటే..)

Videos

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్

వైఎస్ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు

బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

సినీ ఇండస్ట్రీ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!

అంబులెన్సును తోస్తున్న పోలీసులు

Photos

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)

+5

రాకాస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)

+5

బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)

+5

‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్‌ అబ్బవరం ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)