Breaking News

వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..?

Published on Tue, 04/28/2026 - 12:10

ఇంట్లో స్వయంగా వండుకునే వృద్ధుల్లో మతిమరుపు సమస్యలు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని జపాన్‌  శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వంట చేసేటప్పుడు కూరగాయలు తరగడం, సరైన మోతాదులో ఉప్పు, కారం, మసాలాలు వేయడం, వంటకాలకు తగ్గట్టుగా కావాల్సిన పదార్థాలను సరైన సమయానికి  జోడించడం వంటి మల్టీ టాస్కింగ్‌ ఉంటుందని.. ఇది మెదడుకు వ్యాయామంలా పనిచేసి దాన్ని చురుగ్గా ఉంచుతుందని  శాస్త్రవేత్తలు గుర్తించారు.

మెరుగైన మెదడు పనితీరు..: 
జపాన్‌ జెరోంటాలాజికల్‌ ఎవాల్యుయేషన్‌ స్టడీలో పాలుపంచుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 11,000 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఎంత తరచూ వారు ఇంట్లో వంట చేస్తారు? వంట సామర్థ్యంపై వారికున్న అంచనాలు, ఎంత మందికి మతిమరుపు వచ్చింది వంటి సమాచారాన్ని సేకరించారు. ఆ వివరాలను విశ్లేషించగా ఏమాత్రం వంట చేయని వృద్ధులతో పోలిస్తే రోజూ గరిట తిప్పే వృద్ధుల్లో డిమెన్షియా వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని గుర్తించారు. వంట నైపుణ్యం మెరుగైన మెదడు పనితీరుకు సంకేతమని ఈ అధ్యయనం తేల్చింది.

జీవనశైలి మార్పుల ద్వారా..: 
వారానికి కనీసం ఒక్కసారైనా ఇంట్లో వంట చేసే వారిలో డిమెన్షియా రిస్క్‌ తగ్గినట్లు అధ్యయ­నాలు వెల్లడించాయి. క్రమం తప్పకుండా వంట చేసే పురు­షుల్లో 23%, స్త్రీలలో 27% తక్కువ ప్రమాదం ఉండగా.. కొత్తగా వంట చేయడం ప్రారంభించిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు 67% తక్కువగా ఉన్నాయి. ‘2020 లాన్సెట్‌ నివేదిక ప్రకారం ఆహారం, శారీరక శ్రమ వంటి జీవనశైలి మార్పుల ద్వారా సుమారు 40% డిమెన్షియా కేసులను నివా­రించవచ్చని తేలింది. 

అందుకే ఇంటి వంటపై దృష్టి సారించాం’ అని అధ్యయన సహ రచయిత, టోక్యో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ యుకాకో తాని చెప్పారు. అయితే వంట చేయడం ద్వారానే మతిమరుపు ముప్పు తగ్గుతుందని ఈ అధ్యయనం కచ్చితంగా నిరూపించలేదు. 

ఇది కేవలం ఇంటి వంటకు, మతిమరుపు ముప్పు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే వెలుగులోకి తెచ్చింది. అంటే వంట చేసే అలవాటు ఉన్న వారిలో ఈ రిస్క్‌ తక్కువగా ఉందని మాత్రమే గుర్తించింది. పైగా ఈ పరిశోధన కేవలం జపాన్‌కు చెందిన వృద్ధులపైనే నిర్వహించారు. ‘మతిమరుపు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ఖరీదైన చికిత్సల కంటే వంట చేయడం వంటి చిన్నచిన్న మార్పులు అందరికీ అందుబాటులో ఉండే పరిష్కారాలు, మెదడు పనితీరును కాపాడుకోవడం ఈ అలవాట్ల ముఖ్య ఉద్దేశం’ అని యుకాకో తాని వివరించారు.

మెదడుకు వ్యాయామం..

ప్రణాళిక: ఏం వండాలి, ఎలా వండాలి అని ప్రణాళిక రచించడం.
ఎంపిక: సరైన పదార్థాలను ఎంచుకోవడం.
పద్ధతి: వంటకాల తయారీ పద్ధతిని పాటించడం.

ప్రయోజనాలు..

పోషకాహారం: మంచి డైట్‌ లభిస్తుంది.
శారీరక శ్రమ: వంట చేసేటప్పుడు కదలడం వల్ల వ్యాయామం అవుతుంది.
మానసిక శక్తి: ఆలోచించి వండటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నేషనల్‌ డెస్క్‌

(చదవండి: విమానం గాల్లో ఉండగానే ప్రసవం..! అయితే..)
 

Videos

ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

తిరుమలలో కొత్త జంట సందడి

మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు

ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన

విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!

Photos

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)

+5

తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)

+5

ఎపిక్.. మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)

+5

అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)