Breaking News

రోజూ కాఫీ తాగుతున్నారా? కేన్సర్‌ వైద్యుడు చెప్పే షాకింగ్‌ విషయాలివే..

Published on Wed, 10/21/2026 - 17:11

పొద్దుపొద్దునే కప్పు కాఫీ కడుపులో పడితే గానీ బండి నడవదు. ఇలా ఉదయం పూట కాఫీ తాగితే అది మనల్ని యాక్టివ్‌ చేయడమే గాక, తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నాడు కేన్సర్‌ వైద్యుడు. తాను ప్రతిరోజు ఉదయం కాఫీ తాగుతానని చెప్పారు కూడా. చాలా అధ్యయనలు కాఫీ దీర్ఘాయువులో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించాయని పేర్కొన్నారు. కానీ మితంగా తాగితేనే ఈ ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. అలాంటి ప్రయోజనాలు పొందాంటే ఎలా తాగాలో, ఏవిధంగా ఎప్పటికీ తాగకూడదు సవివరంగా వెల్లడించారు.  

కాఫీ ఎందుకు తాగాలంటే..
క్రమం తప్పకుండా కాఫీ తాగితే  ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అలాగే ఇది కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి కాలేయాన్ని రక్షిస్తుంది.  

కాఫీలో శక్తివంతమైన పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం 8% తగ్గుతుంది, 2 కప్పులు తాగితే 15%

కాఫీ తాగే మహిళలకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా  ఉంటుందట. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను డీఎన్‌ఏ నుంచి రక్షిస్తాయి. కాఫీ ఈస్ట్రోజెన్ జీవక్రియ జరిగే విధానాన్ని మారుస్తుంది, తద్వారా రక్తప్రవాహంలో ప్రసరించే ఫ్రీ ఈస్ట్రోజెన్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది

కాఫీలోని ఇతర సమ్మేళనాలు పార్కిన్సన్స్‌ వ్యాధి ప్రమాధాన్ని తగ్గిస్తాయట. కెఫీన్‌కు మెదడు ఆరోగ్యానికి తోడ్పడే న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలు ఉంటాయట. అందువల్ల దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 37% తగ్గుతుందంటున్నుఆరు.

కాఫీలోని పాలిఫెనాల్స్ ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఎదుర్కొని, దీర్ఘకాలిక మంటను తగ్గిస్తాయి, తద్వారా గుండె పనితీరు మెరుపడుతుందట. అంతేగాదు గుండె వైఫల్యం, అరిథ్మియాస్‌ ప్రమాదం కూడా తగ్గుతుందట. అలాగే పక్షవాత మరణాలు 19% తగ్గుతాయి

ఎప్పటికీ తాగకూడని ఒక పద్ధతి
పొయ్యి మీద నుంచి తీసిన వెంటనే దాన్ని ఎప్పుడూ తాగవద్దు. చల్లగా ఉంటేనే సురక్షితం. 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండే వేడి పానీయాలు అన్నవాహిక కేన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. 
పాటించాల్సిన 3 కాఫీ నియమాలు

మరీ వేడిగా ఉండకూడదు

మరీ తీపిగా ఉండకూడదు

మరీ ఆలస్యంగా ఉండకూడదు(మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అంత మంచిది కాదు)

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం మంచిది. 

 

ఇదీ చదవండి: స్టేజ్‌ 4 నోటి కేన్సర్‌ నుంచి 80 కేజీల బరువు ఎత్తే వరకు..! ఆ కొడుకు ప్రేమే..

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)