Breaking News

కొబ్బరి నీళ్లు, సబ్జా గింజలు కలిపి తీసుకోవచ్చా..?

Published on Wed, 04/08/2026 - 17:24

సమ్మర్‌ మొదలైపోయింది. బయట వేడి ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. అదీగాక ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ సైతం ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ వంటి ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని ముందుగానే హెచ్చరించింది కూడా. అప్పుడే మే నెల రాక మునుపే సూర్యడి భగభగలు మాములుగా లేవు. ఈ సమయంలో అధికంగా తీసుకోవాల్సింది నీరు. ముఖ్యంగా శరీరం హైడ్రేషన్‌గా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఎక్కువ మంది కొబ్బరి నీళ్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అలాగే సబ్జా నీళ్లు కూడా తీసుకుంటుంటారు. అయితే కొందరు ఈ రెండిటిని కలిపి తీసుకుంటారు. అసలు ఇలా కలిపి తీసుకోవచ్చా..? ఆరోగ్యానికి మంచిదేనా..అంటే..

వేసవిలో చాలామంది డీహైడ్రేషన్‌కి గురై మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొంటుంటారని అంటున్నారు నిపుణులు. అందుకు కొబ్బరి నీళ్లు, సబ్జా రెండూ సమర్ధవంతంగా పనిచేస్తాయి. అసలు వేసవిలోనే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎందుకు అధికంగా ఉంటుందంటే..

రికార్డు స్థాయిలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు శరీర సాధారణ పనితీరుపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. దీనిని 'హీట్ స్ట్రెస్' లేదా వడదెబ్బ అంటారు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అధికంగా నీరు కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ సంభవించవచ్చు. మూత్రం కూడా చిక్కగా మారుతుంది, దాని రంగును బట్టి శరీరం ఎంత డీహైడ్రేషన్‌కు గురైందో తెలుస్తుంది. 

అలాంటి టైంలో మన తీసుకునే ఆహారం శరీరానికి వేడిచేసేవి అయితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ సమయంలో తగినంత నీరు తీసుకోవడంపై చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంతేగాదు శరీరంలో ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు, విటమిన్లు సమతుల్యంగా ఉండేలా చేసుకోవడానికి, వివిధ వనరుల ద్వారా నీటిని తీసుకోవడం అత్యంత అవసరం.

కొబ్బరి నీరు: 
ప్రకృతి అందించే సహజసిద్ధమైన ఔషధం.. కొబ్బరి నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లు, యు పొటాషియంను అందించే ఒక సహజ జల వనరుగా పేర్కొంటారు. అంతేకాకుండా, దీనికి నిర్విషీకరణ, బాక్టీరియా నిరోధక, పునరుజ్జీవనం, జీర్ణక్రియ, మూత్రవిసర్జన వంటి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. 

మూత్రపిండాల నుంచి లవణాలను బయటకు పంపడానికి తగినంత నీరు అందనప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి, కాబట్టి ఇది వాటిని నివారించగలదు. తరుచుగా కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల మూత్రం పలుచబడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

కొబ్బరి నీరు జీర్ణాశయ సంబంధిత సమస్యలు, రక్త విరేచనాలపై సానుకూల చికిత్సా ప్రభావాలను కలిగి ఉంటుంది. పిల్లలలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.

సబ్జా గింజలు:
సబ్జా గింజల్లోని నీటిని శోషించుకునే లక్షణం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫార్మా ఇన్నోవేషన్ జర్నల్ ప్రకారం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఖనిజాలను కలిగి ఉండే పోషక ప్రొఫైల్, మూత్ర సంబంధిత ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మూత్రపిండాల పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

కొబ్బరి నీరు సబ్జా గింజల కలయిక
కొబ్బరి నీరు, సబ్జా గింజల సరైన కలయిక మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని ఆయర్వేదం చెబుతోంది. ఇంటర్నేషనల్ బ్రాజ్ జె యూరల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మీ మూత్రంలో ఉప్పు స్ఫటికాలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది కానీ సబ్జా గింజలు మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తాయనేందుకు ఆధారాలు లేవు అని పేర్కొంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కొబ్బరి నీళ్ళు లేదా తులసి గింజల వంటి సహజసిద్ధమైన హైడ్రేటింగ్ వనరులను సురక్షితంగా తీసుకోవడానికి  వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు అనుగుణంగా సురక్షితమైన విధంగా ఎలా తీసుకోవాలో సూచిస్తారని చెబుతున్నారు. అంతేగాదు లోబీపీతో బాధపడేవారు సబ్జాగింజలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..)

 

 

Videos

బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు

లులు మాల్ విషయంలో తప్పు చేశాం భయపడి వెనక్కి తగ్గిన ప్రభుత్వం

బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...

భారతీయులు ఇరాన్ వదిలి వెళ్లిపోండి

ఎన్నికల సంఘం-TMC ఎంపిల సమావేశంలో రసాభాస

నా భార్యను పక్కన కూర్చోపెట్టుకుని చెప్తున్నా... ABN రాధాకృష్ణ పై విరుచుకుపడ్డ రాచమల్లు

వెనక్కి తగ్గిన ట్రంప్.. సీజ్ ఫైర్ వెనుక కారణమిదేనా?

చేసిందంతా వైఎస్సారే.. హంద్రీ-నీవాపై 'చంద్ర' నాటకం

విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

Photos

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. బన్నీ అరుదైన రికార్డులివే! (ఫోటోలు)

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)