Breaking News

Fitness: '2 పర్‌ 20 వాకింగ్‌ రూల్‌' అంటే..?

Published on Fri, 05/30/2025 - 17:14

మనదేశంలో ఏటా మధుమేహంతో పడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు. షుగర్‌ నియంత్రణలో ఉండాలంటే వర్కౌట్లు తప్పనిసరి కానీ ఈ బిజీ లైఫ్‌లో వ్యాయమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. మరీ అలాంటప్పడు వ్యాయమాలు చేయకుండానే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ఈ ‘2 పర్ 20’ రూల్‌ని పాటిస్తే చాలని చెబుతున్నారు నిపుణులు. మరీ ఆ రూల్‌ ఏంటి, ఎలా షుగర్‌ని నియంత్రిస్తుందో చూద్దామా..

మనం ఎక్కువసేపు కూర్చొని ఉండటంతో కాళ్లలోని కండరాలు నిరుపయోగంగా మారతాయి. ఎందుకంటే రక్తం గ్లూకోజ్‌ని శోషించడం నెమ్మదిస్తుంది. అదే భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. 

అందువల్ల ప్రతి 20 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడి నడిస్తే..కండరాల కార్యకలాపాలు బలోపేతంగా ఉండి, గ్లూకోజ్‌ శోషణ రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా ఇన్సులిన్‌ స్థాయిలు 25% తగ్గుతాయని, ఇన్సులిన్‌ సమస్యలు ఉత్ఫన్నం కావని నొక్కి చెబుతున్నారు నిపుణులు. 

ఎవరికి మంచిదంటే..
ఈ విధానం ప్రీడయాబెటిక్‌ ‍వ్యక్తులు లేదా డయాబెటిస్‌ ప్రారంభ దశలో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కార్యాలయాల్లో కూర్చొని ఉద్యోగాలు చేసేవాళ్లే గాక వ్యాయమానికి తగినంత సమయం కేటాయించలేనేవారే. 

అందువల్ల ఆయా వ్యక్తలకు ఈ రూల్‌ని అనుసరిస్తే మంచి పలితాలను పొందుతారని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. అలాగే రోజులో చిన్నపాటి కదలికలు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. కనీసం 30 సెకన్లు కూర్చోవడానికి విరామం ఇచ్చి..అటు ఇటు నాలుగు అడుగుల వేస్తేనే మంచి ప్రభావాన్ని పొందగలమని అన్నారు. 

అయితే ఇది మెరుగైన హృదయ ఆరోగ్యం, కండరాల బలం వంటి నిర్మాణాత్మక వ్యాయామ ప్రయోజనాలను అందించకపోయినా..2 పర్‌ 20 వాకింగ్‌ రూల్‌' బిజీగా ఉండే వ్యక్తులకు, వ్యాయామం చేయడం కుదరదు అనుకున్న వ్యక్తులకు ఇది బెస్ట్‌ అని చెబుతున్నారు. 

దాంతోపాటు సమతుల్య ఆహారం, హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు కూడా పాటించాలని చెబుతున్నారు. మెరుగైన గ్లైసెమిక్‌ నియంత్రణకు ఇది బెస్ట్‌ అని ధీమాగా చెబుతున్నారు వైద్య నిపుణులు.

(చదవండి: S Jaishankar: చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌పై జైశంకర్‌ మాట)

 

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు