Breaking News

మీ బాడీ ఇమేజ్... మీ పర్సనాలిటీ...

Published on Thu, 03/05/2026 - 07:10

చాలామంది పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే కేవలం మాట తీరు, డ్రెస్సింగ్ అనుకుంటారు. కానీ మీ పర్సనాలిటీకి అసలైన పునాది "మీ శరీరం". మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు నచ్చని వ్యక్తి కనిపిస్తే, ఆ అసంతృప్తి మీ ప్రతి అడుగులో, ప్రతి మాటలో ప్రతిబింబిస్తుంది. దీన్నే Body Image అంటారు.

సమాజం, మీడియా, మన ఆలోచనలు కలిసి మనల్ని మనం ఒక 'వస్తువు'గా చూసుకునేలా చేశాయి. మన పర్సనాలిటీలో ఆత్మవిశ్వాసం (Confidence) పుట్టాలంటే, ముందుగా మన శరీరంతో (Body) మనకు ఉన్న సంబంధం బాగుండాలి.

1. బాడీ ఇమేజ్ vs బాడీ రియాలిటీ
బాడీ రియాలిటీ అంటే మీ శరీరం నిజానికి ఎలా ఉంది? (ఎత్తు, రంగు, బరువు). ఇది ఒక భౌతిక సత్యం.
బాడీ ఇమేజ్ అంటే మీ శరీరం గురించి మీ మనసులో ఉన్న అభిప్రాయం.

సమస్య ఏంటంటే, మనం బాడీ రియాలిటీతో కాకుండా, బాడీ ఇమేజ్ తో జీవిస్తాం. చాలామంది ఫిట్‌గా ఉన్నా కూడా, తమని తాము లావుగా భావించడం వల్ల ఆందోళన చెందుతారు. ఇది ఒక రకమైన Cognitive Distortion.

2. సమాజం, మీడియా ప్రభావం
మీడియా మనకు పర్ఫెక్ట్ బాడీ అంటే ఎలా ఉండాలో ఒక ప్రమాణాన్ని ఇచ్చింది.
"నువ్వు తెల్లగా ఉండాలి," "నువ్వు పక్కా ఫిజిక్ కలిగి ఉండాలి."

ఈ ప్రమాణాలను అందుకోలేక, మెజారిటీ ప్రజలు తమ శరీరాన్ని తాము ద్వేషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి తన శరీరాన్ని అసహ్యించుకోవడం మొదలుపెడితే, అతను తనను తాను 'తక్కువ'గా చూసుకోవడం ప్రారంభించి, పర్సనాలిటీ పరంగా కుంచించుకుపోతాడు.

3. పర్సనాలిటీపై ప్రభావం
మీ బాడీ ఇమేజ్ బాగోలేకపోతే మీ పర్సనాలిటీ ఎలా మారుతుందో చూడండి.

అభద్రతా భావం: ఎప్పుడూ ఇతరులు తనని చూసి ఏమనుకుంటున్నారో అని భయం (Social Anxiety).

వాయిదా వేసే స్వభావం: "నేను బరువు తగ్గాక బయటకు వెళ్తాను, నేను అందంగా మారాక ఆ పని చేస్తాను"—ఇలా జీవితాన్ని వాయిదా వేస్తారు.

ఎమోషనల్ అస్థిరత: చిన్న విమర్శ కూడా వారిని విపరీతంగా బాధపెడుతుంది.

4. మీ శరీరంతో సంధి చేసుకోండి
Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ శరీరానికి, మీకు మధ్య ఉన్న గొడవను ఎలా ఆపాలో చూద్దాం.

Step 1: బాడీ షేమింగ్ ని ఆపండి
మొదట మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం ఆపండి. అద్దం ముందు నిలబడి మీ శరీరంలోని లోపాలను వెతకడం మానేసి, మీ శరీరం మీకు చేస్తున్న సహాయాన్ని గుర్తించండి. "నా కాళ్లు నన్ను నడిపిస్తున్నాయి, నా మెదడు నాకు ఆలోచనలను ఇస్తోంది" అని కృతజ్ఞతతో ఉండండి. సమాజం చెప్పిన 'పర్ఫెక్ట్' ప్రమాణాలను 'Break' చేయండి.

Step 2: ఫంక్షనాలిటీ vs అప్పియరెన్స్
మీరు మీ బాడీని చూడటానికి అందంగా ఉండాలని కాకుండా, ఆరోగ్యంగా ఉండాలని అనుకోండి. వ్యాయామం అంటే బరువు తగ్గడానికి మాత్రమే కాదు, అది ఒక Self-Respect. మీరు మీ బాడీని గౌరవించి, దానికి కావాల్సిన వ్యాయామం, ఆహారం ఇస్తే, మీ ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్ గా 'Build' అవుతుంది.

Step 3: బాడీ అక్సెప్టెన్స్
మీరు పరిపూర్ణంగా ఉన్నారా లేదా అనేది కాదు ముఖ్యం, మీరు మీ శరీరంతో ఎంత Comfortable గా ఉన్నారు అనేది ముఖ్యం. ఎప్పుడైతే మీరు మీ శరీరాన్ని ఒక దేవాలయంలా గౌరవిస్తారో, అప్పుడు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక 'గ్లో' కనిపిస్తుంది. ఇదే 'Beyond' స్టేజ్.

5. మీ అద్దం ఏం చెప్తోంది?
ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.

అద్దం ముందు నిలబడి, మీకు నచ్చని మీ బాడీ పార్ట్ వైపు చూడండి.

దాన్ని ద్వేషించడం మానేసి, "థాంక్యూ, నువ్వు నాకోసం ఇంత కష్టపడుతున్నావు" అని చెప్పండి.

మీ దృష్టిని అప్పియరెన్స్ నుండి 'బాడీ ఫంక్షనాలిటీ' కి మార్చండి.

మీ శరీరమే మీ మొదటి ఇల్లు!
బ్రో, ఒక ఇల్లు పాతబడితే దాన్ని కూల్చేయరు కదా, పెయింటింగ్ వేసి బాగుచేసుకుంటారు. మీ శరీరం మీ మొదటి ఇల్లు. దాన్ని ప్రేమించండి, గౌరవించండి. అప్పుడే మీ పర్సనాలిటీ లోపలి నుండి బయటకు ప్రకాశిస్తుంది.

గుర్తుంచుకోండి, "Your body is the vehicle for your soul; treat it with the respect it deserves."

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: మీ కలలు చెప్పే నిజాలు)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)