Breaking News

నటి రెజీనా ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..! రెండు వారాలకోసారి కలబంద గుజ్జు..

Published on Fri, 05/02/2025 - 09:39

‘‘నా ఉదయం వేడి వేడి మసాలా టీతో మొదలవుతుంది. ఆ ఎనర్జీతో మొదలయ్యాక రోజంతా అదే ఉత్సాహం, శక్తితో ఉండటానికి నాకు సరిపడే ఆరోగ్యవంతమైన డైట్‌ని తీసుకుంటాను’’ అని రెజీనా కాసాండ్రా పేర్కొన్నారు. హీరోయిన్‌గా పలు భాషల్లో సినిమాలు చేస్తూ... బిజీ బిజీగా ఉండే రెజీనా కాసాండ్రా డైట్‌ విషయం లో స్ట్రిక్ట్‌గా ఉంటానంటున్నారు. కానీ వారంలో ఒక్కరోజు మాత్రం ‘చీట్‌ డే’ అని నవ్వేశారు. ఇక ఆ రోజు ఆయిల్‌ అని, ఫ్యాట్‌ అని నియమాలేం పెట్టుకోకుండా అన్నీ తింటానన్నారు. ఇంకా రెజెనా చెప్పిన విశేషాలు ఈ విధంగా... 

ఉదయం మసాలా టీ తాగిన కాసేపటికి అల్పాహారానికి మొలకలు, బాదంలాంటి డ్రై ఫ్రూట్స్‌ (పొట్టు తీసినవి), పండ్ల రసం తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్‌ బాగా తినాలి. అందుకే వీటితోపాటు ఇడ్లీ, దోసె తింటాను. 

సాంబార్‌ కాంబినేషన్‌ ఉండాల్సిందే. మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇస్తాను. బీన్స్, క్యారెట్, ఇంకా ఉడికించిన కూరగాయలు, పప్పు తప్పకుండా ఉండాల్సిందే. అన్నంతోపాటు ఇవన్నీ తింటే ఇటు కార్బోహైడ్రేట్స్‌ అటు ప్రోటీన్‌ రెండూ అందుతాయి. బ్రౌన్‌రైస్‌ని ప్రిఫర్‌ చేస్తాను. 

మన రోజుని మనం హెవీ బ్రేక్‌ఫాస్ట్‌తో మొదలుపెట్టి, రాత్రి వరకూ క్రమ క్రమంగా తగ్గించుకుంటూ తినాలి. డిన్నర్‌ ఎంత లైట్‌ అయితే అంత బెటర్‌. అందుకే నేను సూప్‌ లాంటి వాటిని ప్రిఫర్‌ చేస్తాను.  

ఇప్పటివరకూ చెప్పినది ఒక రోజులో తీసుకునే డైట్‌ అయితే నా వారం ప్లాన్‌ ఎలా ఉంటుందంటే... వారంలో ఒక రోజంతా కేవలం పండ్ల రసాలతోనే సరిపెట్టేస్తాను. ఒక రోజంతా పండ్ల రసాలు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు పోతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఇలా మలినాలను పోగొట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. 

అలాగే రెండు వారాలకోసారి కలబంద గుజ్జు తింటాను. దీనికోసం పొట్ట ఖాళీగా ఉంచుకుంటాను. అలా ఎమ్టీ స్టమక్‌తో తింటేనే మంచిది. కలబంద గుజ్జు చర్మానికి నిగారింపుని ఇస్తుంది. ఇక ఒకేసారి కాకుండా రోజు మొత్తంలో కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతుంటాను. చక్కెర, ప్రాసెస్డ్‌ ఫుడ్‌కి నేను దూరం.  

ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే... ఎక్సర్‌సైజ్‌లు చేయడటం, ఆహారం విషయంలో నియమాలు పాటించడం వంటివి స్లిమ్‌గా ఉండటం కోసమే కాదు... ఆరోగ్యంగా ఉండటం కోసం కూడా. సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకున్నా ప్రమాదమే. అందుకే చక్కగా తినాలి... వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఫిట్‌ అండ్‌ ఫైన్‌గా ఉంటాం’’ అంటూ ముగించారు రెజీనా.

నేను, యోగా వేరు కాదని అనుకుంటాను. అంతలా యోగాని ఇష్టపడతాను. నేను ఫిట్‌ అండ్‌ ఫైన్‌గా ఉండటానికి యోగా ఓ కారణం. సూర్య నమస్కారాలతో మొదలుపెట్టి, భుజంగాసనం, సర్వాంగాసనం... ఇలా చాలా చేస్తాను. అలాగే ఇతర వ్యాయామాలు కూడా చేస్తుంటాను. నా ఎక్సర్‌సైజ్‌ ప్లాన్‌ ఎలా ఉంటుందంటే... ఒకరోజు అప్పర్‌ బాడీ చేస్తే తర్వాతి రోజు లోయర్‌ బాడీ వర్కవుట్స్‌ చేస్తాను.  

– డి.జి. భవాని

(చదవండి:

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)