రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్
Breaking News
నోరు తెరిస్తే దుర్వాసన! తౌడు నానబెట్టిన నీటిలో వీటిని కలిపి తాగితే..
Published on Tue, 12/20/2022 - 14:13
Oral Health Tips In Telugu- Bad Breath: ఉదయమే చక్కగా బ్రష్ చేసుకున్నారు. అయినా మధ్యాహ్నం నుంచి నోరు తెరిస్తే చాలు.. దుర్వాసన అని తెలిసిపోతోంది. ఎందుకిలా? బ్రష్ చేసిన తర్వాత కూడా వచ్చే నోటి దుర్వాసనకు కారణం ఏమిటి?
దుర్వాసన అనేది చిగుళ్ళ వ్యాధి వంటి పెద్ద దంత సమస్య యొక్క లక్షణం కావొచ్చు. ఇది దంతాలపై ఫలకాన్ని (plaque) తయారు కావడం వల్ల సంభవిస్తుంది. చికిత్స చేయకపోతే, చిగుళ్ళ వ్యాధి దుర్వాసన మరియు దవడ ఎముక దెబ్బతినడం వంటి సమస్యలను సృష్టిస్తుంది. హేలిటోసిస్ అంటే నోటిలో నుంచి దుర్వాసన రావడం. దీనినే దుర్వాసన లేదా బ్యాడ్ బ్రీత్ అని కూడా అంటారు.
దీనికి కారణాలు ప్రధానంగా..
1. ఆహారం- మీ దంతాలలో మరియు చుట్టుపక్కల ఉన్న ఆహార కణాల విచ్ఛిన్నం బ్యాక్టీరియాను పెంచుతుంది మరియు దుర్వాసన కలిగిస్తుంది.
2. పొగాకు ఉత్పత్తులు. ధూమపానం అత్యంత అసహ్యకరమైన నోటి వాసనకు కారణమవుతుంది.
3. పేలవమైన దంత పరిశుభ్రత, అంటే సరిగా బ్రష్ చేసుకోకపోవడం
నోటి దుర్వాసన ఇంకా ఏవైనా అనారోగ్యాలకు సంకేతమా?
నోటి దుర్వాసన ఇతర వ్యాధులు లేదా అనారోగ్యాలు ఉన్నాయన్న దానికి హెచ్చరిక సంకేతం కూడా కావచ్చు. శ్వాసకోశ మరియు టాన్సిల్ ఇన్ఫెక్షన్లు, సైనస్ సమస్యలు, డయాబెటిస్, కాలేయం మరియు మూత్రపిండాల సమస్యలు, అలాగే కొన్ని రక్త రుగ్మతలలో నోటి దుర్వాసన ఒక సాధారణ లక్షణంగా ఉంటుంది. మనం నోరు బాగా శుభ్రం చేసుకొన్నా దుర్వాసన వస్తోందంటే ఒక సారి డెంటిస్ట్ను కలవడం మంచిది.
నోటిపూత
సాధారణంగా నోటిపూత బి(B) విటమిన్ లోపం వలన వస్తుంది. నివారణకు ముందు రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తౌడుని వేసి తెల్లారి పరగడుపున ఆ నీటిని వడగట్టి అందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి ఓ 15 రోజుల పాటు తీసుకోవాలి. తౌడులో బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
ఇక పొట్టలో అల్సర్ వంటివి ఉన్నా నోటిపూత వస్తుంది. ఆహారంలో మసాలాలు లేకుండా, తక్కువ ఆయిల్ తో వండుకొని తినాలి. పండ్లు, కూరగాయలు, జ్యూస్లు, తీసుకోవాలి. అలాగే నీరు బాగా త్రాగాలి.
-డాక్టర్ నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు
చదవండి: Skin Cancer: ఒంటిపై మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు ఉన్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం..
Essential Bath Rules: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు!
Tags : 1