Breaking News

6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు

Published on Sat, 03/29/2025 - 04:15

ఉగాది పచ్చడిని సేవించే ఆచారం శాలివాహన శకారంభం నుంచి మొదలైనట్లుగా చరిత్రకారులు చెబుతారు. సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని కొత్త మట్టికుండలో
తయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో వేపపూత, మామిడి పిందెలు, చింతపండు, ఉప్పు, మిరియాల పొడి, బెల్లం,  అరటిపండు ముక్కలు ఉపయోగిస్తారు. వీటి వల్ల 
ఉగాది పచ్చడి ఆరురుచుల సమ్మేళనంగా తయారవుతుంది. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలు,  వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....

బెల్లం, అరటి పండ్లు– తీపి
బెల్లం తీపిగా ఉంటుంది. ఎండ వేడిమి వల్ల కలిగే అలసటను పోగొట్టి, తక్షణ శక్తినిస్తుంది. బెల్లాన్ని అరటిపండుతో కలిపి తీసుకోవడం శ్రేష్ఠమని ఆయుర్వేదం చెబుతోంది. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలను అరటిపండు నిరోధిస్తుంది.

చింతపండు– పులుపు
ఉగాది పచ్చడి తయారీకి పాత చింతపండు ఉపయోగించడం మంచిది. పాత చింతపండు ఉష్ణాన్ని, వాత దోషాలను తగ్గిస్తుంది. బడలికను పోగొడుతుంది. జఠరశక్తిని పెంచుతుంది. మూత్రవిసర్జన సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. వేసవిలో చింతపండు రసం తీసుకోవడం వల్ల ఉష్ణదోషాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.

ఉప్పు
రుచులకు రారాజులాంటిది ఉప్పు. ఉప్పులేని పప్పులు, కూరలు, పచ్చళ్లు రుచించవు. ఆహారంలో అనునిత్యం ఉపయోగించే ఉప్పు త్రిదోషాలను– అంటే, వాత పిత్త కఫ దోషాలు మూడింటినీ పోగొడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, ఉప్పును మోతాదులోనే వాడాలి.

మామిడి పిందెలు– వగరు
మామిడి కాయలు ముదిరితే పులుపుగా ఉంటాయి గాని, పిందెలు వగరుగా ఉంటాయి. మామిడి పిందెల వగరుదనం లేకుంటే, ఉగాది పచ్చడికి పరిపూర్ణత రాదు. మామిడి పిందెలలో విటమిన్‌–సి పుష్కలంగా ఉంటుంది. మామిడి పిందెలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని త్రిదోషాలను హరించి, శక్తిని కలిగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.

వేపపూలు– చేదు
వసంతారంభంలో వేపపూలను తినే ఆచారం దాదాపు అన్నిప్రాంతాల్లోనూ ఉంది. దీనిని ‘నింబకుసుమ భక్షణం’ అంటారు. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిలో వేపపూలను ఉపయోగించడం మన తెలుగువాళ్లకే చెల్లింది. వేపపూలు కఫదోషాన్ని, క్రిమిదోషాలను పోగొడతాయి. జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి.

మిరియాల పొడి–కారం
మిరియాలను నేరుగాను, పొడిగాను వంటకాల్లో తరచుగా వినియోగిస్తూనే ఉంటాం. మిరియాలు రుచికి కారంగా ఉన్నా, శరీరానికి చాలా మేలు చేస్తాయి. మిరియాలు కఫదోషాన్ని, విష దోషాలను హరిస్తాయి. చర్మవ్యాధులను అరికట్టడమే కాకుండా, జీర్ణశక్తిని, శరీరంలోని జీవక్రియలను పెంచుతాయి. అందుకే సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల్లో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు.

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు