Breaking News

తలనొప్పితో బాధపడుతున్నారా? ఈ ఆకుతో వెంటనే రిలీఫ్‌

Published on Thu, 11/16/2023 - 12:13

వాము ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న వామును పలు చికిత్సల్లో వాడతారు. సుగంధ లక్షణాలు కలిగి ఉన్న వాము వంటల్లో రుచిని రెట్టింపు చేస్తుంది. అందుకే వీటిని చాలా రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీన్ని పలు చికిత్సల్లోనూ వాడతారు. వాము గింజలతోనే కాదు, ఆకులతోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా..
 

జీర్ణ సమస్యలు,అజీర్తి, గ్యాస్,కడుపు ఉబ్బరం సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేసే శక్తి వాము ఆకుల్లో ఉంది.

వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి త్వరగా బయట పడొచ్చు. గ్యాస్ట్రిక్ జ్యూస్‌లను విడుదల చేయడంలో వాము ఆకు ఉపయోగపడుతుంది.

► చిన్న పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది.



► వాము ఆకులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన శరీరంపై గాయాలను,మచ్చలను తగ్గిస్తుంది.

► చిన్నపిల్లల్లో వచ్చే కడుపునొప్పికి వాము ఆకు బెస్ట్‌ మెడిసిన్‌.

► ప్రతి రోజు భోజనం పూర్తయ్యాక వాము ఆకును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆకలి తక్కువ ఉన్నవారిలో ఆకలి పుడుతుంది.

► చిన్న పిల్లలకు వాము ఆకు రసంలో తేనే కలిపి ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.



► తలనొప్పి నివారణకు కూడా వాము ఆకు ఔషధంలా పనిచేస్తుంది. వాము ఆకుల్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది.

► ఏవైనా పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు వాము ఆకుల్ని ఆ ప్రాంతంలో రుద్దినా విషం బయటకు వచ్చేస్తుంది.

► వాము ఆకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు.. జుట్టు సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వాము ఆకులు హెల్ప్ చేస్తాయి.

► ఈ వాముని ఔషధంగానే కాదు ఆహారపదార్ధాల్లో కూడా ఉపయోగించవచ్చు. వాము ఆకుతో బజ్జీలు వేసుకొని తినవచ్చు.. వాము ఆకుతో పెరుగు పచ్చడి చేసుకుని తింటే రుచికరంగా ఉండడంతో పాటు అజీర్తి సమస్యలు కూడా దూరమవుతాయి.

 వాము ఆకును నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా కూడా దూరం అవుతుంది. నోరు రిఫ్రెష్గా ఉంటుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది

► వామాకులో ఎ, బి, సి విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం.

► వామాకు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

► వాము ఆకులతో తయారుచేసిన టీ ని ప్రతిరోజు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా  బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు