Breaking News

పదేపదే చెవుల్లో మ్యూజిక్‌ వినిపించడం మానసిక సమస్య..?

Published on Thu, 07/03/2025 - 10:10

నేను ఇంటర్మీడియట్‌ దాకా చదువుకున్నాను. కుటుంబపోషణ కోసం చిన్నప్పటినుంచే మా నాన్న గారి సెలూన్‌లో పని చేసేవాణ్ణి. పెళ్లిళ్లలో సన్నాయి వాయించడం కోసం కూడా వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు నాకు 60 ఏళ్లు. నా పిల్లలు బాగా చదువుకొని సెటిల్‌ అయ్యారు. నేను సెలూన్‌ పని మానేసి పదేళ్లవుతోంది. సన్నాయి వాయించడం కూడా ఆపేశాను. కాలక్షేపం కోసం ఇంటి దగ్గర చిన్న షాపు పెట్టుకున్నాను. నాకు ఒక సంవత్సర కాలం నుండి నేను గతంలో పెళ్లిళ్లలో వాయించిన సంగీతం, పాటలు చెవిలో మళ్లీ మళ్లీ వినపడుతున్నాయి, ముందు ఇంటి దగ్గర్లో ఏదైనా పెళ్లి అవుతుంటే అక్కడ నుండి వచ్చే శబ్దాలు, పాటలు అనుకున్నాను కానీ అని పగలు, రాత్రి, రోజంతా వినపడుతూనే ఉంటాయి. ఆ శబ్దాల వల్ల నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మాకే శబ్దాలూ వినపడట్లేదు. నువ్వు ఊహించుకుంటున్నావు అంటున్నారు. నాకే ఎందుకు ఇలా అవుతోంది... ఈ బాధ నుంచి నన్ను బయట పడేయండి డాక్టరు గారూ!
– గురునాథం, కరీంనగర్‌ 

మీరు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మీ పిల్లల్ని మంచి స్థితికి తీసుకెళ్లినందుకు ముందుగా మీకు నా అభినందనలు. ఇక మీ సమస్య విషయానికి వస్తే మీకు ఉన్న కండిషన్‌ని ‘మ్యూజికల్‌ హెలూసినోసిస్‌’ అంటారు. మనం గతంలో విన్న పాటలు, శబ్దాలు అప్పుడుప్పుడు వినపడటం అందరికీ జరుగుతుంటుంది. ఉదాహరణకు పొద్దున మనకు నచ్చిన పాట వింటే అది కాసేపు అలాగే ‘మైండ్‌లో’ ప్లే అవడం, దాన్ని మనం ఎంజాయ్‌ చేయడం సర్వసాధారణం! కాసేపటికి వాటంతట అవే తగ్గిపోతాయి. 

కానీ మీ విషయంలో ఎప్పుడో విన్న పాటలు, సంగీతం పదే పదే వినిపించడం, అవి మిగిలిన వాళ్ళకి వినపడకపోవడం, దానివల్ల డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు రావడం ఇవన్నీ ఖచ్చితంగా ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి. ‘మ్యూజికల్‌ హెలూసినోసిస్‌’ అనేది అరుదుగా కనబడే ఒక లక్షణం. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముందుగా మీకు వినికిడి సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చెక్‌ చెయించుకోండి. అలాంటిది ఏదైనా ఉంటే హియరింగ్‌ మెషిన్‌ వాడితే మీ సమస్య చాలావరకు తగ్గిపోతుంది. 

మీ వయస్సు 60 సంవత్సరాలు కాబట్టి పెద్ద వయసులో వచ్చే డిమెన్షియా, మెదడులో ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలి. ఇవేమీ లేవని నిర్ధారణ అయితే అప్పుడు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్‌ని కలిస్తే మీకు పరీక్షలు చేసి ‘యాంటీ సైకోటిక్‌’ మందులు, అలాగే మీ డిప్రెషన్‌ తగ్గడానికి మందులు, కౌన్సెలింగ్‌ ఇస్తారు. వాటిని కొంతకాలం వాడితే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండండి. 
(డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి సీనియర్‌ సైకియాట్రిస్ట్‌ విజయవాడమీ సమస్యలు, సందేహాలు sakshifamily3@gmail.com)

(చదవండి: దటీజ్‌ షెకావత్‌..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్‌కి సై)

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)