Breaking News

ఆమె నా కూతురు: తండ్రిగా గర్వించే క్షణం..

Published on Tue, 10/13/2026 - 14:52

పారిశ్రామిక దిగ్గజం హర్ష్‌ గోయెంక్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికపపుడూ ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయక విషయాలను పంచుకుంటుంటారు. అలానే తాజాగా మరో ఆసక్తికరమైన వీడియోతో ముందుకు వచ్చారు. అది తండ్రి కూతుళ్లకు సంబంధించిన వీడియో అది. తల్లిదండ్రులకు ఇంతకు మించి కావాల్సింది ఏమంది అంటూ హర్ష్‌ గోయెంకా తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు పోస్ట్‌లో. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ఒక సౌత్‌ వెస్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ ఒకరు విమాన ప్రయాణానికి ముందు ప్రయాణికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కనిపిస్తారు వీడియోలో. ఆయన తనకు ఈ రోజు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనదని చెబుతూ తన ఎయిర్‌లైన్‌ పైలట్‌ బృందంలో కొత్తగా చేరిన సభ్యురాలిని పరిచయం చేస్తారు. ఆమె ఇప్పుడే తన శిక్షణను పూర్తి చేసుకుందని చెబుతూ..సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌లో విమానాన్ని నడపడం ఆమెకు ఇదే తొలిరోజు అని వివరిస్తారు. 

ఆ తర్వాత ఆ పైలట్‌ ప్రయాణికులతో ఇలా అంటారు. ఆమె ఎవరో కాదు తన ప్రాణమైన కుమార్తె అని గర్వంగా చెబుతారు. అంతేగాదు  ఈ ప్రత్యేక సందర్భాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తన సంభాషణను ముగించారు. ఈ ప్రకటన కొత్తగా ఆ పైలట్‌ విమానాయన సంస్థలోకి చేరడం గురించే కాదు, ఒక తండ్రి తన కూతురితో ఒక ముఖ్యమైన మైలురాయిని పంచుకోవడం గురించి కూడా. 

నిజంగా ఆ సందర్భం ఆ పైలట్‌ తండ్రికి గర్వించే క్షణం కదూ అంటూ హర్ష్‌ గోయెంకా ఆ సంభాషణలో చివరి వాక్యం నాకు బాగా నచ్చింది అని క్యాప్షన్‌ జోడించి మరి ఈ వీడియోని పంచుకున్నారు. నెటిజన్లు కూడా ఒక తండ్రికి ఇంతకంటే గర్వించదగిన క్షణం మరొకటి ఉండదు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

ఇదీ చదవండి: ఫ్యాషనే ఆయుధంగా.. స్టైల్‌గా నిరసన! నేహా బోరా వన్‌ పీస్‌ టీ షర్టు దుమారం..
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)