Breaking News

ఒకప్పటి సెక్యూరిటీ గార్డే .. ఇపుడు మైగేట్‌ యాప్‌ సీఈవో!

Published on Fri, 07/04/2025 - 15:48

సోషల్‌మీడియాలో తరచుగా ఆసక్తికర కథనాలు, విశేషాలను పంచుకునే పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తాజాగా ఒక ఆసక్తికర కథనాన్ని షేర్‌ చేశారు. యువపారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తినిచ్చేలా  మైగేట్ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ స్ఫూర్తిదాయకమైన కథను ఆయన పంచుకున్నారు


సెక్యూరిటీ అండ్‌ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ యాప్ మైగేట్ సహ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ సక్సెస్‌ స్టోరీని హర్ష్ గోయెంకా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. తద్వారా సక్సెస్‌ ఎవరికీ అంతఈజీగా రాదు..  దానికి వెనుక ఎంతో  కృషి, పట్టుదల ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు.   ఒకపుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తి ఇపుడు , కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ యాప్‌ ఫౌండర్‌గా సీఈవోగా ఎదిగిన  తీరును ఆయన వివరించారు.

 r> IIT గ్రాడ్యుయేట్ , మాజీ గోల్డ్‌మన్ సాచ్స్ ఎగ్జిక్యూటివ్ అయిన కుమార్ ఒకప్పుడు సెక్యూరిటీ గార్డుగా 14 గంటల షిఫ్టులు పనిచేశారని గోయెంకా వెల్లడించారు. ఆ  కష్టాలు,కన్నీళ్లు, ఆఅనుభవమే  తరువాత ‘మైగేట్’ పునాదిగా మారిందని  హర్ష్‌ గోయెంకా పేర్కొన్నారు. ఏదైనా  ఒక పనిచేపట్టాలంటే ముందు దానిలోని లోతుపాతులను అర్థం చేసుకోవాలన్నారు.  

ఎవరీ అభిషేక్ కుమార్ :
సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన తర్వాత ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యారు.  అభిషేక్ కుమార్, విజయ్ అరిసెట్టి మరియు శ్రేయాన్స్ దాగా కలిసి 2016లో మైగేట్‌ను ప్రారంభించారు. 2022లో, అర్బన్ కంపెనీ - అకో సంయుక్తంగా నిర్వహించిన నిధుల రౌండ్‌లో మైగేట్ రూ. 100 కోట్లు సేకరించింది.2024 ఏప్రిల్‌లో  మైగేట్ CEOగా నియమితులయ్యారు, విజయ్ అరిసెట్టి బోర్డు ఛైర్మన్‌గా మారారు. మైగేట్ అనేది గేటెడ్ కమ్యూనిటీలకు  సెక్యూరిటీ కమ్యూనికేషన్, హౌస్ కీపింగ్, ఇతర రోజువారీ సేవలను   అందిస్తుంది.  భారతదేశంలోని 25 వేల హౌసింగ్ సొసైటీలలో ఇప్పుడు 40 లక్షలకు పైగా జనం మైగేట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రతి నెలా 100 మిలియన్లకు పైగా చెక్-ఇన్‌లను సులభతరం చేస్తుంది.డిజిటల్ హోమ్ సెక్యూరిటీని అందించే స్మార్ట్ డోర్ లాక్‌ల శ్రేణి  మైగేట్ లాక్స్‌  ద్వారా మైగేట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ ఆదాయం అంతుకుముందు ఏడాదితో పోలిస్తే 2024  ఆర్థిక సంవత్సరంలో  రూ.77 కోట్ల నుండి రూ.109 కోట్లకు పెరిగింది. 2025 ఏడాది గాను రూ. 165 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుందని పంచుకుంది. \

2016లో అభిషేక్ కుమార్, విజయ్ అరిసెట్టి , శ్రేయాన్స్ డాగా స్థాపించిన మైగేట్, గేటెడ్ కమ్యూనిటీల నివాసితులకు ఏకీకృత యాప్ ద్వారా సందర్శకుల యాక్సెస్, భద్రత, నిర్వహణ,నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాదు బీమాసర్వీసులను అందించేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుండి  లైసెన్స్‌ను కూడా పొందింది.

ఇదీ చదవండి: 7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్‌ అంటున్న నేహా
 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)