Breaking News

రుద్ర హెలికాప్టర్‌ని నడిపిన తొలి మహిళా పైలట్‌..!

Published on Wed, 01/28/2026 - 17:13

సైన్యంలో చేరడం అంటే అంత ఆషామాషి కాదు. తీరా అందులో జాయిన్‌ అయ్యాక అక్కడ కఠిన శిక్షణను తట్టుకుని పూర్తి స్థాయిలో సక్సెస్‌ అవ్వడం మాటలు కాదు . అందులోనూ ఏవియేషన్‌ రంగంలో ఓ సాయుధ హెలికాప్టర్‌కి పైలట్‌గా వ్యవహరించడం అంటే..ఎన్ని సవాళ్లు ఎదుర్కొనలో చెప్పాల్సిన పనిలేదు. ఇంతవరకు అంతటి కష్టతరసాధ్యమైన బాధ్యతలను పురుషులే నిర్వర్తించారు. తొలిసారి అలాంటి విధుల్లో ఒక మహిళ రావడం ఇదే తొలిసారి. అలాంటి ఘనతను అందుకు "శర్మ జీ కి బేటి". గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె స్టోరీ ప్రేరణగా నిలిచింది. ఎవరామె..? ఈ రంగాన్ని ఎలా ఎంచుకుందంటే..

రుద్ర హెలికాప్టర్‌ను నడిపిన భారత సైన్యం తొలి మహిళా పైలట్‌గా కెప్టెన్ హంస్జా శర్మ చరిత్ర సృష్టించారు. శర్మ కెరీర్‌ జర్నీలో తిరస్కరణలు, శస్త్ర చికిత్సలు ఉన్నాయి. జమ్మూలో పుట్టి పెరిగిన ఆమె నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ శిక్షణా పాఠశాల (CAATS)లో తన శిక్షణా కోర్సులో అగ్రస్థానంలో నిలిచింది. 

ఉత్తమ పోరాట విమాన చోదకుడికి ఇచ్చే సిల్వర్ చిరుత ట్రోఫీని అందుకున్న తొలి అధికారిణి ఆమె. ఇది భారత ఆర్మీ ఏవియేషన్‌కు తొలి రికార్డు కూడా. ఈ ఏడాది రాజస్థాన్‌ ఆర్మీ డే పరేడ్‌లో 251 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించడమే గాక హెలినా క్షిపణి వ్యవస్థను ప్రదర్శించింది.

జమ్మూ నుంచి ఆర్మీ ఏవియేషన్‌ వరకు..
మార్చి 9, 1998న జమ్మూలో జన్మించిన కెప్టెన్ శర్మ బర్నాయ్‌లోని సెయింట్ జేవియర్స్ కాన్వెంట్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె జమ్మూలోని పరేడ్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత భారత సైన్యంలోకి ఎంపికయ్యే ముందు జమ్మూ విశ్వవిద్యాలయంలో జువాలజీ విభాగంలో చేరింది. 

అక్కడ నుంచి భారత సైన్యంలోకి చేరడానికి ఆమె పలు సవాళ్లు ఎదుర్కొంది. మొదటగా తాత్కలిక తిరస్కరణలను ఫేస్‌చేసింది. ఆ క్షణంతో తన కెరీర్‌ ముగిపోయిందనుకుంది. కానీ ఆమె అచంచలమైన సేవ, పట్టుదల మనస్తత్వం తిరిగి తన ఒంటిమీదకు యూనిఫాం వచ్చేలా చేశాయి. 

సింగిల్‌ మదర్‌ సంరక్షణలో..
సీనియర్ జర్నలిస్ట్, సింగిల్‌ మదర్‌ రష్మి శర్మ తన పిల్లలను పెంచడానికి అన్నింటిని అమ్మేశానన్నారు. ప్రస్తుతం తన కూతురు హంసజ తనను ఉద్యోగం మానేయమని అంటుంది. అయితే తాను జర్నలిస్ట్‌ని కాబట్టి పనిచేస్తే..తనకు చేతనైనంత ఇతరులకు సాయం చేయగులుగుతానని అంటోందామె. తన కూతురు కూడా ఇతర సైనికురాలి లాంటిదేనని అన్నారు. వాళ్లు దేశం కోసం త్యాగం చేస్తే..తాను అలాంటి త్యాగాలే చేసిన తల్లినని ఆమె గర్వంగా చెప్పారు. 

తాను శత్రువుల ముందు ధైర్యంగా నిలబడి తగిన జవాబు ఇవ్వడానికి సాహసించే ప్రతిసైనికుడిని చూసి గర్విస్తున్నాని అన్నారామె. నిజానికి ఏఎల్‌హెచ్‌లో ప్రయాణించడం అంటే బహిరంగ ఆకాశంలో ప్రయాణించడం లాంటిదని, చాలా భయంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో హంసజకు మరిన్ని బాధ్యతలు, సవాళ్లు ఎదరవ్వుతాయని..వాటన్నింటి ఆమె విజయవంతంగా ఎదుర్కొగలదని నమ్మకంగా చెప్పారు హంసజ తల్లి రష్మి శర్మ.

(చదవండి: దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!)



 

Videos

Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు

SIT విచారణకు గడువు కోరే యోచనలో KCR

ఒక్క ఏడాది ఓపిక పట్టండి..! సీక్వెల్స్ తో దద్దరిల్లిపోద్ది

రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్

పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్

మీ కుట్రలకు అంతు లేదా !! బాబు, పవన్ పై లక్ష్మీ పార్వతి ఫైర్

100 మంది 10 నిమిషాల్లో. కడపలో TDP చేసిన విధ్వంసం

Gadikota: రగులుతున్న ఆంధ్రా.. నీకు దమ్ముంటే

YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు

నా పార్టీ ఏంటో చూపిస్తా అన్నావ్ ఇప్పుడు ఏం అంటావ్ పవన్

Photos

+5

మేడారం మహా సంబరం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కుమారులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో ధనుశ్ (ఫొటోలు)

+5

అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోలు చూశారా?

+5

బేగంపేట్‌ : అట్టహాసంగా వింగ్స్‌ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)

+5

వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం (ఫొటోలు)

+5

ఆదివాసీ ఆచారాలతో సారలమ్మకు స్వాగతం.. మేడారంలో కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ఫుల్ గ్లామరస్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు

+5

బ్లూ శారీలో యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు.. ఫోటోలు

+5

హీరోయిన్ శ్రుతిహాసన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)