Breaking News

దెయ్యమా? మనిషేనా? హాలోవీన్‌ హత్యలో ఊహించని ట్విస్ట్‌!

Published on Sun, 08/30/2026 - 08:21

గరం చీకటి దుప్పటి కప్పుకున్న వేళ... అక్కడ హాలోవీన్‌ వేడుకలు మొదలయ్యాయి. వ్యాపారవేత్త చేతన్‌ విల్లా అంతా వింత ఆకారాలు, భయంకరమైన అలంకరణలతో నిండిపోయింది. మోడల్‌ నమిత, యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ మిత్రా, జర్నలిస్ట్‌ శుక్లా, నమిత స్నేహితురాలు వినతి, రమ్య అక్కడ చేరారు. అందరూ విభిన్నమైన ఫ్యాన్సీ డ్రెస్సుల్లో, ముసుగుల్లో ఉన్నారు. నమిత తెల్లటి దుస్తుల్లో ప్రేతాత్మలా భ్రమను కలిగిస్తోంది.

వేడుక పీక్స్‌కి చేరింది. అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు హారర్‌ ఎఫెక్ట్‌ కోసం ఇంట్లోని లైట్లన్నీ ఆపేశారు. ఐదు నిమిషాల పాటు అంతా కారుచీకటి. కేవలం భయంకరమైన నవ్వుల సౌండ్‌ ట్రాక్‌ మాత్రమే వినిపిస్తోంది. సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత లైట్లు ఆన్‌ అయ్యాయి.
ఒక్కసారిగా అక్కడ కనిపించిన దృశ్యానికి అందరూ షాకయ్యారు. హాల్లో ఉన్న సోఫాపై నమిత నిర్జీవంగా రక్తం మడుగులో పడి ఉంది. ఆమె గుండెల్లో పదునైన కత్తి దిగి ఉంది. ఆ గదిలో మంత్రాల్లా గోడపై రక్తం గుర్తులు రాసి ఉన్నాయి. అక్కడి వారంతా ఇది ‘ఆత్మ చేసిన హత్య’ అని ప్రచారం మొదలుపెట్టారు.
∙∙ 
క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు రంగంలోకి దిగాడు. మీడియాలో ‘హాలోవీన్‌ రాత్రి ఆత్మ చేసిన హత్య’ అంటూ అప్పటికే రూమర్స్‌ మొదలయ్యాయి. రక్తం మడుగులో నమిత– లక్షలాది మంది మగవాళ్ల హార్ట్‌ బీట్‌. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న మోడల్‌. డెడ్‌ బాడీని పోస్ట్‌మార్టమ్‌కు పంపి, అక్కడ ఉన్న ఐదుగురినీ విచారించడం ప్రారంభించాడు ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు.
డైరెక్టరు మిత్రా తన తదుపరి యాడ్‌ ఫిలింలో చేయమని నమితను కోరితే, ఆమె చేయనంది. అతనికి నమిత మీద పీకల దాకా కోపం వుంది.

జర్నలిస్ట్‌ శుక్లా– నమితకు కెరీర్‌ మొదట్లో సాయం చేసి, ఫేమస్‌ చేశాడు. కానీ స్టార్‌ అయ్యాక నమిత అతన్ని దూరం పెట్టడంతో లోలోపల రగిలిపోతున్నాడు.
బిజినెస్‌మేన్‌ చేతన్‌ నమితను పిచ్చిగా ప్రేమించి ప్రపోజ్‌ చేశాడు. నమిత అతని ప్రపోజల్‌ను తిరస్కరించింది. అతని ఈగో దెబ్బతింది.

ఇక వినతి, రమ్యలకు పెద్దగా మోటివ్స్‌ లేవు. అభిమన్యు నోటీసులోకి రెండు విషయాలు వచ్చాయి. ఒకటి, నమిత గుండెల్లో దిగిన కత్తిని కుడిచేత్తో బలంగా పొడిచారు. రెండు, లైట్లు ఆపే సమయానికి, ఆన్‌ అయ్యే సమయానికి అందరూ ఒకే చోట ఉన్నారా లేదా?
అభిమన్యు క్రైమ్‌ సీన్‌ ను పరిశీలించాడు. గోడపై రాసిన రక్తపు గుర్తులు ఆత్మ చేసిందిగా నమ్మించడానికి కావాలనే రాసినట్టు అర్థమైంది. హాల్‌లోని స్మార్ట్‌ హోమ్‌ లైటింగ్‌ సిస్టమ్‌ డేటాను ఫోరెన్సిక్‌ టీమ్‌ పరిశీలించింది. లైట్లు స్విచ్‌ బోర్డు నుండి కాకుండా, మొబైల్‌ యాప్‌ ద్వారా కంట్రోల్‌ అయినట్లు గుర్తించింది.

అభిమన్యు అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి. ‘లైట్లు పోయిన ఆ ఐదు నిమిషాలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు?’ అని అడిగాడు.
మిత్రా తాను స్విచ్‌ బోర్డు వైపు వెళ్లానని  చెప్పాడు. చేతన్‌ తను అక్కడే వున్నానని చెప్పాడు. లైట్లు ఆఫ్‌లో ఉండటం వాళ్ళ సీసీ కెమెరాలు పని చేయలేదు.
అందరి మొహాల్లో టెన్షన్‌– పోలీసులు సంకెళ్లతో సిద్ధంగా ఉన్నారు. బయట మీడియా హడావుడి. .
∙∙ 
అక్కడ అంతా నిశ్శబ్దం. అభిమన్యు పోలీసుల వైపు చూశాడు.
‘మిస్టర్‌ మిత్రా! పదండి’ అన్నాడు.
‘ఎందుకు? మిత్రా అడిగాడు.
‘నమితను హత్యకు కారణమైనందుకు’, అని చేతన్‌ వైపు తిరిగి ‘మిస్టర్‌ చేతన్‌! మీరు కూడా... నమితను కత్తితో పొడిచి చంపినందుకు’ అన్నాడు.
మిత్రాను, చేతన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
∙∙ 
మీడియా చుట్టుముట్టింది.
‘హత్య జరిగి గంట గడవక ముందే వీళ్ళే హంతకులని ఎలా తెలుసుకున్నారు?’ మీడియా అడిగింది.
మిత్రా తాను స్విచ్‌ బోర్డు వైపు వెళ్లానని అబద్ధం చెప్పాడు. కానీ ఫోన్‌లో యాప్‌ లాగ్స్‌లో అసలు నిజం బయటపడింది.
అతడి  కుడిచేతికి ఫ్రాక్చరై బెల్ట్‌ ఉంది. ఎడమచేత్తో అంత బలంగా పొడవడం సాధ్యం కాదు. అప్పుడే సందేహం వచ్చింది. లైట్లను ఆర్పింది మిత్రా... నమితను చంపే ప్రయత్నంలో నమిత గట్టిగా గోళ్లతో గీరింది. చేతన్‌  కుడి చేతి మణికట్టుపై ఉన్న గాయం, ఆ గోళ్ల ముక్కల్లో ఉన్న చర్మం మ్యాచ్‌ అయ్యాయి. అతను వేసుకున్న దెయ్యం కాస్ట్యూమ్‌పై నమిత రక్తం చిందింది. వాటిని విల్లా వెనుక డస్ట్‌ బిన్‌ లో దాచాడు. దాన్ని నా టీమ్‌ స్వాధీనం చేసుకుంది’ చెప్పాడు అభిమన్యు.

‘హాలోవీన్‌లో కనిపించే ఆత్మల కన్నా మన కళ్ళ ముందు స్వార్థం, ద్వేషంతో ఘోరాలు, నేరాలు చేసే మనుష్యులే  అసలైన ప్రేతాత్మలు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి’ చెప్పి ముందుకు కదిలాడు ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు.

- శ్రీసుధామయి

ఇవీ చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?

Videos

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు

Photos

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)