Breaking News

తలకట్టు... కనికట్టు

Published on Sun, 04/19/2026 - 00:50

అబ్బాయిలకు ఏం స్టయిల్‌ ఉంటుందిలే అని చాలామంది అనుకుంటారు. కాని, బార్బర్‌ కుర్చీలో కూర్చునే పది నిమిషాలు చాలు, మామూలు అబ్బాయి కూడా సినిమా హీరోలా మారిపోవడానికి. సరైన హెయిర్‌ కట్‌ ఇచ్చే కాన్ఫిడెన్స్‌ వేరే లెవల్‌! చక్కని తలకట్టుతో రూపం కనికట్టు చేసినంతగా మారిపోతుంది. అందుకే ఈ సమ్మర్‌లో కంఫర్ట్‌తో పాటు కూల్‌గా కనిపించే కొన్ని ట్రెండీ హెయిర్‌ స్టయిల్స్‌ చూద్దాం...

జెంటిల్‌మన్  ఫ్యాడ్‌ – క్లాసీ స్టయిల్‌! 
జెంటిల్‌మన్  ఫ్యాడ్‌ అనేది ఇప్పటికీ ఎవర్‌గ్రీన్  స్టయిల్‌! చెవుల దగ్గర జుట్టు క్రమంగా తగ్గుతూ, పైన మాత్రం సెట్‌ చేసుకునేలా ఉండటం. ఈ కట్‌ వేసుకుంటే ముఖం మరింత షార్ప్‌గా, సన్నగా కనిపిస్తుంది. ఆఫీస్‌కు వెళ్లినా, ఫంక్షన్ కు వెళ్లినా సూట్‌ అయ్యే సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ స్టయిల్‌ ఇదే! 

అండర్‌కట్‌ – యూత్‌ ఫేవరెట్‌
అండర్‌కట్‌ అనేది కొంచెం బోల్డ్‌గా, ట్రెండీగా కనిపించాలనుకునే వాళ్లకు బెస్ట్‌. సైడ్స్‌ షార్ట్‌గా, పైన కొంచెం లెంగ్త్‌ ఉంచడం వల్ల మీరు స్టయిల్‌ను మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఫార్మల్‌గా నీట్‌గా దువ్వుకోవచ్చు, లేదా క్యాజువల్‌గా మెస్సీగా వదిలేయొచ్చు. ఒకే కట్‌తో రెండు వేర్వేరు లుక్స్‌ రావడం దీని కున్న ప్లస్‌ పాయింట్‌. 

టాప్‌ నాట్‌ – డిఫరెంట్‌ టచ్‌
జుట్టు కొంచెం పొడవుగా ఉంటే, టాప్‌ నాట్‌ వేసుకోవడం ఒక స్మార్ట్‌ ఐడియా. జుట్టు మొత్తాన్ని పైకి తీసుకుని చిన్న ముడి వేయడం వల్ల కూల్‌గా, కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ స్టయిల్‌ మీకు కొంచెం ఆర్టిస్ట్‌ లుక్‌ లేదా ట్రావెలర్‌ వైబ్‌ ఇస్తుంది. ముఖ్యంగా వేసవిలో జుట్టు ముఖంపై పడకుండా క్లీన్ గా ఉంచుతుంది. 

బజ్‌ కట్‌ – కంఫర్టబుల్‌ చాయిస్‌
వేసవిలో చాలామంది ఇష్టపడే సింపుల్‌ స్టయిల్‌ ఈ బజ్‌ కట్‌. జుట్టు చిన్నగా ఉండటం వల్ల చెమట తక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్‌ ఈజీ, పైగా షాంపూ, నూనె ఖర్చును ఆదా చేస్తుంది.  ఉదయం లేట్‌గా లేచినా, దువ్వుకోవాల్సిన టెన్షన్  ఉండదు. టైమ్‌ కూడా సేవ్‌ చేస్తుంది. కట్‌ చిన్నదే అయినా, కంఫర్ట్‌ మాత్రం పెద్దది.

టెక్చ్సర్డ్‌ క్రాప్‌ – మెస్సీగా.. మోడ్రన్ గా..
నేచురల్‌గా, కొంచెం మెస్సీగా కనిపించే స్టయిల్‌ కావాలనుకుంటే టెక్స్చర్డ్‌ క్రాప్‌ మంచి ఎంపిక. ఈ కట్‌ వల్ల జుట్టు మరింత వాల్యూమ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా థిన్  హెయిర్‌ ఉన్నవాళ్లకు ఇది మంచి సొల్యూషన్ . ఎక్కువగా సెట్‌ చేయకపోయినా, స్టయిల్‌గా కనిపిస్తారు. ఇలా స్టయిలిష్‌గా కనిపించడానికి పెద్ద ఖర్చు అవసరం లేదు. మీ ఫేస్‌ షేప్‌కు సరిపోయే చిన్న హెయిర్‌ కట్‌ చాలు, మీ లుక్‌కి వెంటనే కొత్త చార్మ్‌ వస్తుంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)