Breaking News

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర అలవాటు?

Published on Wed, 03/11/2026 - 08:15

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం, వ్యాయామం ఎంత అవసరమో.. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు మన శరీరంలోని అంతర్గత అవయవాలను దెబ్బతీస్తాయి. అయితే, వీటిలో అన్నింటికంటే ప్రమాదకరమైన అలవాటు ఏది? అనే ప్రశ్నకు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రముఖ వైద్యుడు సమాధానమిచ్చారు. అమెరికాకు చెందిన బోర్డ్-సర్టిఫైడ్ కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ ప్రపంచంలోని చాలామందిని పట్టిపీడిస్తున్న ఆ అలవాటు గురించి హెచ్చరించారు.

అవయవాల విధ్వంసకారి
ప్రముఖ పాడ్‌కాస్టర్ మెల్ రాబిన్స్‌తో నిర్వహించిన చర్చలో డాక్టర్ జెరెమీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక హృద్రోగ నిపుణునిగా మనిషి తప్పనిసరిగా దూరంగా ఉంచాల్సిన అలవాటు ఏది? అని అడిగినప్పుడు ఆయన ఏమాత్రం తడుముకోకుండా ‘ధూమపానం’ అని సమాధానమిచ్చారు. ‘సిగరెట్ తాగడం వల్ల శరీరంలోని ప్రతి అవయవానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. దీనికి మించిన ప్రమాదకరమైన అలవాటు మరొకటి లేదని స్పష్టంగా చెప్పగలను’ అని ఆయన పేర్కొన్నారు.

ఎందుకు అంత ప్రమాదకరం
ధూమపానం అనేది కేవలం ఊపిరితిత్తులను మాత్రమే  దెబ్బతీసే అనారోగ్య సమస్య కాదని, ఇది ఒక 'మల్టీ-ఆర్గాన్ కిల్లర్' అని డాక్టర్ జెరెమీ అభివర్ణించారు. ఆయన విశ్లేషణ ప్రకారం:
రక్తనాళాలు దెబ్బతినడం: సిగరెట్లలోని రసాయనాలు రక్తనాళాల లోపలి పొరలను నాశనం చేస్తాయి.
ఆక్సిజన్ కొరత: రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తగ్గించి, గుండెపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతాయి.
క్యాన్సర్ కారకం: ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం ధూమపానం. ఇది ఇతర రకాల క్యాన్సర్లకు కూడా పునాది వేస్తుంది.
‘నా 25 ఏళ్ల కెరీర్‌లో ఎంతోమంది రోగులను చూశాను. నికోటిన్ వ్యసనం నుండి బయటపడటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇది ప్రాణాలను హరిస్తుందనే నిజాన్ని ఎవరూ ఎంతమాత్రం విస్మరించకూడదు. నా దృష్టిలో అత్యంత ప్రమాదకరమైన అలవాట్ల జాబితాలో మొదటి మూడు స్థానాలు ధూమపానానివే’ అని ఆయన హెచ్చరించారు.

శాస్త్రీయ ఆధారాలు
కేవలం డాక్టర్ జెరెమీ అనుభవమే కాకుండా, అంతర్జాతీయ పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ‘క్యురియస్’ (Cureus) జర్నల్‌లో 2023లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ధూమపానం అనేది శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, సంతానోత్పత్తి లోపాలు, మరెన్నో దీర్ఘకాలిక వ్యాధులకు ఇది మూలకారణంగా నిలుస్తుంది. ముఖ్యంగా 'ప్యాసివ్ స్మోకింగ్' (పక్కన ఉన్నవారు వదిలిన పొగను పీల్చడం) కూడా అంతే ప్రమాదకరమని ఈ నివేదిక వెల్లడించింది.

ఆరోగ్యకరమైన భవిష్యత్తు..
ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ధూమపానాన్ని వదిలిపెట్టడం అనేది తప్పనిసరి అని ఈ అలవాటు కలిగినవారు గుర్తించాలి. ఇటువంటి నిర్ణయం కేవలం గుండెను మాత్రమే కాకుండా, శరీరంలోని ప్రతి అణువును కాపాడుతుంది. డాక్టర్ జెరెమీ లాంటి నిపుణుల హెచ్చరికలను గమనించి, ధూమపానం అలవాటు కలిగినవారు తక్షణమే మేల్కొనడం అవసరం.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి: బాస్ కుర్చీలో ‘బాట్’.. ‘ఏజెంట్‌’ చెప్పింది చేయాల్సిందే!
 

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి