Breaking News

కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’

Published on Fri, 04/25/2025 - 17:07

కన్నవారిని, ఉన్న ఊరిని  వదిలి, కోటి ఆశలతో అత్తింటికి చేరే కోడళ్లను కన్న కూతురిలా చూసుకునే  కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ  కొడుకు మరణం తరువాత కోడల్ని అక్కున చేర్చుకుని ఆదరించడమే కాకుండా, ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించిన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి.  అలాంటి ఒక హృద్యమైన  కథనం నెట్టింట వైరల్‌గా మారింది. అనేక ప్రశంసలు దక్కించుకుంది.   

గుజరాత్‌లోని అంబాజీ నివాసి ప్రవీణ్ సింగ్ రాణా. ముదిమి వయసులో ఆదు కుంటాడనుకున్న పెద్ద కుమారుడు సిద్ధరాజ్ సింగ్‌ అర్థాంతరంగా కన్నుమూశాడు. దీంతో తనతో పాటు కోడలు,  నెలల వయస్సున్న చిన్న బిడ్డ అనాథలైపోయారు. కానీ ఇక్కడే ప్రవీణ్‌ సింగ్‌ తన పెద్దరికాన్ని  చాటుకున్నాడు. కోడలికి  తండ్రి స్థానంలో నిలబడ్డాడు.   చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాడు.  కోడలి, మనవరాల్ని కన్నీటితో సాగనంపడం   విశేషంగా నిలిచింది.

చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!
 

కొడుకు మరణం
2024లో దీపావళి  పండుగ సందర్భంగా ఆకస్మిక గుండెపోటు రావడంతో   కన్నుమూశాడు. ఈ సంఘటనతో సిద్ధరాజ్ భార్య కృష్ణ, చిన్నారి దీక్షితతో సహా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఇక జీవితాంతం భర్తలేకుండా గడపాల్సి ఉంటుందని, తండ్రి లేకుండా తన కుమార్తెను ఎలా పెంచాలంటూ కృష్ణ   అంతులేని శోకంలో  మునిగిపోయింది. చుట్టుపక్కల సమాజం కూడా అలానే  అనుకుంది.

కానీ ప్రవీణ్ మనసు వేరేలా ఆలోచించింది. తన కుమార్తెలా చూసుకున్నాడు. సమాజం అభిప్రాయాలను, భయాలను పట్టించుకోకుండా, తన కొడుకు ప్రాణ స్నేహితుడు సంజయ్‌తో తన కోడలి  కృష్ణకు  వైభవంగా పెళ్లి జరిపించాడు. కోడలితో పాటు, మనవరాలు దీక్షిత తరలి పోతోంటే, తన తల్లితో వెళ్లిపోయినప్పుడు తాత భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు ప్రవీణ్‌,కుటుంబంపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు కదా  నేటి సమాజానికి కావాల్సింది అంటూ వ్యాఖ్యానించారు.

ఇదీ  చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్‌.. ఎవరీ నటుడు?

కృష్ణను రెండో పెళ్లి చేసుకున్న సంజయ్  ప్రవీణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరాజ్ తన చిన్ననాటి స్నేహితుడనీ, కృష్ణను కొంతకాలంగా తనకు తెలుసునని చెప్పారు. కృష్ణ, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని సిద్ధరాజ్ కుటుంబానికి సంజయ్ హామీ ఇచ్చాడు.  తన స్నేహితుడి కుమార్తె , కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. దీని గురించి ప్రవీణ్ సింగ్‌తో మాట్లాడాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు. అటు కృష్ణ  కూడా అత్త మామలకు కన్నీటితో  కృతజ్ఞతలు  తెలిపింది.
 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)